Menu Close

నేను వాడుతున్న Ear buds ఇవి.
క్వాలిటీ చాల బాగుంది.
అమెజాన్ లో బెస్ట్ ఆఫర్ వుంది.
కావల్సిన వాళ్ళు ఒక్కసారి చూడండి👇

Ear Buds - Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Telugu Moral Stories – మోరల్ స్టోరీస్

అలసిన కూతురు తల్లితో అమ్మా నాకు విశ్రాంతి కావాలి స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయా. ‘దానికి తల్లి, మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతేకదా బాగా చదువు’ కూతురు లేచి చదవటం మోదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలి పోయింది.

‘అమ్మా కొంచెం టయమివమ్మా విశ్రాంతి తీసుకుంటాను’ ఆఫీసునుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ‘ముందు పెండ్లి చేసుకుని సెటిల్ అవ్వు తరువాత విశ్రాంతే’. ‘ఇప్పుడే ఏం అవసరమమ్మ. రెండు మూడేళ్ళుకాని.. ‘సరియైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా. ఆ తర్వాత విశ్రాంతియేగా.

‘కూతురు పెండ్లికి సిధ్ధమయింది. విశ్రాంతి మటేలేదు పెండ్లి అయింది. ఇద్దరు పిల్లల తల్లీ అయింది విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలి పోయింది. ‘నీవు అమ్మవు.. పిల్లలను జాగ్రత్తగ పెంచాలి. నాకు ఆఫీసు పనికి ఏవిధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకోన్ని సంవత్సరాలే. ఓపికపట్టు. అంతే.. పిల్లలు పెద్దవాళ్ళయితే నీకు విశ్రాంతేకదా.. ‘ ఇద్దరు పిల్లలకోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయాయేకాని విశ్రాంతి దక్కనేలేదు.

పిల్లల హోంవర్కు, ప్రాజెక్టు వర్కు, లంచ్ బాక్సులు, ఆర్ధిక సమస్యలు, సంసారం వడిదుడుకులు ఊపిరి సలపనిస్తితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమయింది. ‘పిల్లలు చదువులయి ఉద్యోగాలు చేస్తూ తమంత తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను’. ‘ఇంక పిల్లల పెండ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంక హాయేకదా అనుకుని గడపసాగింది ఆమె ఓపిక చేసుకోంది.

పిల్లల పెళ్లికి ఏ లోటులేకుండ చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. ‘పిల్లల సంసారం వాళ్ళపాటికి వాళ్ళు బాగానేఉన్నారు. ఇప్పుడైనా కోంచెం విశ్రాంతి తీసుకుంటాను. ‘ ‘ అరేరామ. అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు. పురుడు పోయాలి. నామకరణం వగైరా అన్నీ అయి అది కాపురానికి వెళ్ళిన తరువాత ఇంక విశ్రాంతే విశ్రాంతి’.

కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగ జరిగాయి. ‘అబ్బ ఈ జంజాటం ముగిసింది. ఇంక విశ్రాంతి తీసుకుంటాను. ‘అనుకునేలోపే’ అమ్మా నేను ఉద్యోగానికి వెళతాను. నీవు మనవడిని చూసుకోవాలి’ అని కూతురి ఆకాంక్ష. తప్పదు. మనవడి సంరక్షణ లో ఆడుతూ పరుగులు తీస్తూ రోజులు గడపసాగింది మనవడు పెద్దవాడైనాడు.

వాడిపన్లు వాడు చూసుకుంటున్నాడు. తన అవసరంలేదు. ఇంక విశ్రాంతి తీసికోవచ్చు. అనుకోనేలోపు ‘ఏమే వినిపిస్తున్నదా. నామోకాళ్ళ నెప్పులు ఎక్కువయిందే. లేవటానికి కష్టంగఉంది. బిపీ ని ఎక్కువయిందేమో. షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగ ఉండమన్నారు డాక్టరుగారు’ పతి సేవతో అంతోఇంతో ఉన్న ఆశక్తి కూడా కరిగి పోయింది.

శరీరం తోలు తిత్తి అయింది. విశ్రాంతి అన్నపదమే మర్చిపోయింది. ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమికి దిగివచ్చి’విశ్రాంతి తీసుకుందువు రా ‘అనిపిలిచాడు. ఆమె రెండుచేతులూ జోడించి ఆనందభాష్పాలతో సన్నద్దురాలైంది. భగవంతుడు ఆమెను పిలుచుకునిని వెళ్ళాడు. చివరకు ఆమెకు శాశ్వతంగ విశ్రాంతి దోరికింది..

ఈ కథ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి

Like and Share
+1
2
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks