ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నువ్వెందుకిలా అయ్యావు – Best Stories in Telugu
ఇద్దరు అన్నాదమ్ములు.
ఒకడు తాగుబోతయ్యాడు.
ఒకడు ప్రయోజకుడయ్యాడు. ఎందుకలా..?
తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే..?
“అంతా మా నాన్న వల్లే …
ఆయన తాగుబోతు.
మమ్మల్ని పట్టించుకోలేదు.
ఎప్పుడూ కొట్టేవాడు.
ఏదో నేరం చేసి
జైలుకి వెళ్లేవాడు ..
అందుకే నేనిలా తయారయ్యాను.” అన్నాడు.
ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే..?
“అంతా మా నాన్న వల్లే …
ఆయన తాగుబోతు.
మమ్మల్ని పట్టించుకోలేదు.
ఎప్పుడూ కొట్టేవాడు.
ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు…
అమ్మని కొట్టేవాడు…
ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను.
అందుకే నేనిలా తయారయ్యాను.” అన్నాడు.
ఒకే పరిస్థితి. ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది.
తేడా పాఠంలో లేదు. నేర్చుకునేవాడిలో ఉంది.
- Telugu Love Stories
- Prema Kathalu
- Pitta Kathalu
- Neethi Kathalu
- Telugu Heart Touching Stories
- Telugu Emotional Stories
- Telugu Sad Stories