సూర్యుని రథసారథి అనూరుడు అంటే ఊరువులు (అంటే తొడలు) లేనివాడు అని అర్థం. ఇతడు కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అనూరుడనే పేరు వచ్చింది. అనూరునికే అరుణుడు (ఎర్రని వాడు) అని కూడా ఇంకొక పేరు ఉంది. ఇతడి తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. ఈమె సవతి కద్రువ.
వినత, కద్రువ నెలలు నిండాక బిడ్డలకు బదులుగా గుడ్లను ప్రసవించారు. వినతకు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్లు సకాలంలో పగిలి పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగ సంతతి. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్లు పగలలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది.
ఇంకొకవైపు తన సవతిపిల్లలు కళ్ళముందు తిరుగుతూ ఉంటే ఆమె ఆత్రం పట్టలేక ఒక గుడ్డును పొడిచి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు ఇంకా ఏర్పడని నవయవ్వనుడైన కుమారుడు కనిపించాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలిగించినందుకు తల్లి మీద కోపించి వెయ్యేళ్ళపాటు సవతి ఐన కద్రువకు దాసిగా ఉండమని శపిస్తాడు.
“రెండవ గుడ్డులో మహా బలఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, తొందరపడి ఆ గుడ్డును పగలగొట్టవద్దని” చెప్తాడు. అప్పుడే సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా చేసుకుంటాడు. అనూరుడికి ఇక ఎప్పటికీ ఆ రథం దిగి నడవవలసిన అవసరం రాదు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డును పగలగొట్టుకుని వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసుకుంటాడు. గరుత్మంతుడినే గరుడుడు అని కూడా అంటారు. అనూరుడి భార్య శ్యేని. రామాయణంలో కీలకపాత్ర పోషించిన సంపాతి, జటాయువులు వీరి కుమారులు.
ఈ ఆసక్తికర విషియాన్ని మీ స్నేహితలకి షేర్ చెయ్యండి, వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోండి.
Stories from Hindu Mythology in Telugu, Hindu Mythology in Telugu, Unknown Stories from Hindu Mythology
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.