Telugu Moral Stories – Telugu Short Stories
వినయ్, మానవ్ ఇద్దరూ మంచి స్నేహితులు, కలిసినప్పుడు ఆసక్తికరమైన, ఆహ్లాదకరమైన విషయాలు చర్చించేవాళ్ళు. ఒకరోజు కఠోర శ్రమ, అదృష్టం మీద చర్చ రసవత్తరంగా సాగిపోతోంది వాళ్ళ మధ్య. మానవ్ అడిగాడు “విజయం సాధించాలంటే అదృష్టం కావాలా? కఠోర శ్రమ కావాలా??”
వినయ్, “మానవ్ మీకు బ్యాంకులో లాకర్ ఉంది కదా?? విజయం బ్యాంకు లాకర్ వంటిది, దానికి ఉన్న రెండు తాళం చెవులే విజయసూత్రం.”
మానవ్, “మీరు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు!!” వినయ్, “ప్రతి లాకర్ కు రెండు తాళం చెవులు ఉంటాయి కదా!! ఒకటి మీ వద్ద, రెండోది మానేజర్ దగ్గర, అవునా!” మానవ్ ‘అవున’ని తలూపాడు. వినయ్ నవ్వుతూ, ” జీవితంలో మీ దగ్గర ఉన్న తాళం చెవి కృషి, కఠోర శ్రమను సూచిస్తే, మానేజర్ దగ్గర ఉన్న తాళం చెవి అదృష్టాన్ని సూచిస్తుంది. ఈ రెండు తాళం చెవులు వాడితేనే లాకర్ తెరవగలుగుతాం.”
విజయం కావాలంటే కృషి చెయ్యక తప్పదు. కఠోర శ్రమ అనే తాళం చెవిని నిరంతరం వాడకతప్పదు. ఎందుకంటే ‘అదృష్టం.’ రెండో తాళం చెవి. ఎప్పుడు లభిస్తుందో చెప్పలేం, లాకర్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలీదు. కృషి అనే తాళం చెవి వాడక పోతే,అంటే కష్టపడకపోతే, ఎప్పుడో ఒకప్పుడు అదృష్టం అనే గొప్ప అవకాశం ( రెండో తాళం చెవి) లాకర్ తాళం తెరుస్తుంది. కానీ కృషి చెయ్యలేదు కదా, మొదటి తాళం చెవి వాడలేదు, కాబట్టి విజయం అనే లాకర్ ను తెరవలేరు.
సేకరణ-V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.