Menu Close

ప్రేమ కథ – Telugu Love Stories

ప్రేమ కథ – Telugu Love Stories

బ్యాంక్ టైమ్ అయిపోవడం తో హుషారుగా ఇంటికి వెళ్ళడానికి బ్యాగ్ తీసుకుని.. తన వస్తువులు సరి చూసుకుంటూ వుండగా…”ప్రియా…ప్రియతమా రాగాలు..సఖి…కుశలమా అందాలు” రింగ్ టోన్ తో…మొబైల్ మోగుతోంది….నంబర్ చూడగానే తన మొహం లో చిన్న చిరునవ్వు….

కాల్ లిఫ్ట్ చేసిన అశోక్ …” బయల్దేరి వస్తున్న….రెడీ గా వుండు….హాస్పిటల్ కు వెళ్దాం ” అని కాల్ కట్ చేసి….బ్యాంక్ నుండి బయటకు వచ్చి .. బైక్ తీయబోతు వుండగా….మరలా ఫోన్ రింగ్ అవుతోంది…..అసహనంగా నంబర్ వైపు చూసాడు …కానీ..కళ్ళల్లో ఆశ్చర్యం…ఆ నంబర్ తను ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వసంత ది….వసంత…ఇప్పుడెందుకు తనకు కాల్ చేస్తోంది…

అదిరిపడి ..ఉవ్వెత్తున ఎగసి పడే హృదయ ఉద్వేగం……”హలో…ఎవరు….”హలో….నేను…వసంత ను…” ఏ వసంత???” అశోక్….నన్ను మర్చిపోయావా??” అబ్బా..తమరేమైన.. మరచిపో యే అంత…చిన్న గాయం చేశారా మనసుకి……అయినా..ఇప్పుడంతా ఎందుకులే కానీ…ఎందుకు కాల్ చేశావ్” అన్నాడు విసుగ్గా…

“జస్ట్…పలకరిద్ధాం అని …” ఓ…ఇంకా బతికే ఉన్న నో….లేదో…లేకుంటే….ఈ సారి పూర్తిగా చంపి వెళ్ళి పోవడానికా ..”నువు ఇలాగే మాట్లాడ తావని నాకు తెలుసు…. నీ స్థానం లో వుంటే నేను కూడా అలాగే మాట్లాడే దాన్ని…” ఊరికే ఈ చెత్త మాటలు నాకెందుకు..అసలు ఎందుకు ఫోన్ చేసావో..ఆ విషయం చెప్పు…”

ఏమి లేదు ..మా అమ్మ వాల్లింటికొచ్చా….నిన్ను కుడా ఒకసారి చూసి వెళ్దాం అనిపించింది…ఇంకా ఈ నెల రోజులు ఇక్కడే వుంటాను..వీలుంటే ఒకసారి ఇంటికి రా అశోక్…మరో మాటకు అవకాశం లేకుండా కాల్ కట్ చేసి..ఇంటికి బయల్దేరాడు….ఇంటికి వెళ్లగానే..గుమ్మం లో నే తన కోసం ఎదురు చూస్తూ పవిత్ర ఎదురొచ్చింది….

తొమ్మిదో నెల.గర్భవతి తను….నవ్వుతూ ఎదురొచ్చి న పవిత్ర….భర్త ముభావంగా వుండడం గమనించింది….బ్యాగ్ అందుకొని వెళ్లిపోయింది… హాల్ లో టీవీ ఆన్ చేసి…చూస్తున్నాడు అన్న మాటే కానీ…గుండెల్లో ఏదో బాధ….వసంత గుర్తుకొస్తోంది….చిన్నప్పట్నుంచీ తను…వసంత..పవిత్ర…అందరు కలిసే పెరిగారు..కలిసి చదువుకున్నారు..

ముఖ్యంగా పవిత్ర …అశోక్ మేనత్త కూతురు….వసంత క్లాస్ మేట్…వసంత కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు..తన తల్లి తో కలిసి అమ్మమ్మ..తాతయ్య…లతో వుండేది….అశోక్ కు ఇద్దరు చెల్లెళ్ళు…తల్లి గృహిణి..తండ్రి LIC office లో చిన్నపాటి ఉద్యోగం….అందరు ఒకే ఏరియా లో వుండడం..కలిసి ఆటలు..చదువులు కూడా…. అలా పెరుగుతూ ..తమకే తెలియకుండా ..అశోక్..వసంత్ ఒకరినొకరు ఇష్ట పడుతూ వచ్చారు..

స్నేహం పరిధి దాటి..ప్రేమ లో అడుగుపెట్టారు …అందరిలో మామూలు గా నే వున్న..ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టంగా వుండేవారు…..వయసుతో పాటు అందం..ఆకర్షణీయం…తెలివి తేటలు వసంత సొంతం….అశోక్ కూడా ఒక రోజు తన మనసు లోని మాట ను వసంత కు చెప్పాడు…తను కూడా ఒప్పుకొంది….ఇక అప్పటి నుంచి వసంత చదివే కాలేజీలో నే అశోక్ కూడా జాయిన్ అయ్యాడు…

art love

స్వతహాగా ఇద్దరు తెలివైన వారు..చదువులో కూడా ముందుండే వారు…కాలేజ్ లో…..క్లాస్ అయిపోగానే… కలుసుకొనేవారు…ఇద్దరు మాటలకు కూర్చుంటే సమయమే తెలిసేది కాదు…చిన్ననాటి స్నేహితులు కాబట్టి..ఎవరు వారిని అనుమానం గా చూడ లేదు…డిగ్రీ మొదటి సంవత్సరం లో వుండగా…అశోక్…పూర్తిగా వసంత ప్రేమలో పడి…ఫెయిల్ అయ్యాడు…వసంత కూడా అత్తెసరు మార్కులతో పాస్ అయింది…

ఇంట్లో తిట్ల దండకాలు మొదలయ్యాయి..ఇద్దరికీ…ఇక అప్పటినుండి సీరియస్ గా చదవడం మొదలు పెట్టారు…తమ ఇద్దరు కలిసి జీవించ బోయే జీవితం గురించి కలలు కనేవారు…ఇద్దరిదీ ఒకటే కులం కాబట్టి పెళ్లికి కూడా ఏ ఆటంకం వుండదు అని ఆశ పడ్డారు….

indian art love women

2…” బావ…కాఫీ…అంటూ చేతి లో కాఫీ కప్ తో …. నిండు గోదారిలా …చేతి నిండా గాజులతో..పెద్ద కుంకుమ బొట్టు తో నిదానంగా నడుచుకుంటూ వచ్చి కాఫీ ఇచ్చింది పవిత్ర….కాఫీ కప్ అందుకుంటూ…దగ్గర్లో సోఫా లో కొత్తచీర..గాజులు ను చూస్తూ ” ఏంటిది…ఎవరిచ్చారు” అన్నాడు…”

అయ్యో..చెప్పడం మరచిపోయా..బావ…ఉదయం మనింటికి వసంత వచ్చింది…నా కోసం ఇచ్చి వెళ్ళింది” అంది…మనసులో వున్న కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు….లేచి బెడ్రూంలోకి వెళ్తూ…పవిత్ర వైపు తిరిగి…” నాక్కొంచెం తల నొప్పిగా వుంది..డిస్టర్బ్ చేయకు” అన్నాడు…” అలాగే బావ…మారి హాస్పిటల్ కు??” ఈ రోజు వద్దు..రేపు వెళ్దాములే” అంటూ వెళ్లిపోయాడు…వెళ్లి బెడ్ పై పడుకున్నాడు…తనకే తెలియకుండా తన కంటి నుండి రెండు కన్నీటి బొట్టు…కళ్ల నుండి వెలువడి సెలవు తీసుకున్నాు యి….

3…అశోక్ .వసంత..ఈ సారి పోటీ పడి చదివారు..ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయి అని…ఇద్దరివీ మంచి మార్క్స్….అప్పుడే వసంత కు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు…ఇంట్లో చెప్పి ఒప్పించే ధైర్యం ఇద్దరిలో లేదు….అప్పుడే..అశోక్ బ్యాంక్ ఎగ్జాం వ్రాయడం…అతనికి జాబ్ రావడం చక చక జరిగిపోయాయి…ఇదే విషయాన్ని వసంత కు చెబుదామని సంతోషంగా వసంత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు…ఇంట్లో ఎవరూ లేరు ..అందరు బంధువు ల ఇంట్లో పెళ్లి వుంటే వెళ్లారు..ఎప్పుడు లేని విధంగా..వసంత ప్రవర్తించింది…తను ఎంత సంతోషం గ మాట్లాడుతూ వున్న…పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు..పైగా…” ఇంకెప్పుడు నన్ను కలవద్దు అశోక్….నాకు పెళ్ళి నిశ్చయం చేశారు…బహుశా ఇదే లాస్ట్…ఇక నుండి ఫ్రెండ్స్ గా మిగిలి పోదాం అంది…

ఒక్క క్షణం అశోక్ కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు…” నీ కేమైన పిచ్చా..లేక జోక్ చేస్తున్నావా..పెళ్లి వద్దని అంటున్నావ్…అన్నాడు..” జోక్ కాదు..సీరియస్ ..నిన్ను కొన్ని రోజులు భరించడమే కష్టం..జీవితాంతం భరించలేను…ఎవరితో మాట్లాడనివ్వలేదు వూ …ఎవరైనా ఏదైనా అంటే గొడవ పడతావు..ఇలాంటి నీతో పెళ్లి కష్టం…మనిద్దరికీ సెట్ అవ్వదు…నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో…నెక్స్ట్ మంత్ నా పెళ్లి….మా దూరపు బంధువుల అబ్బాయి తో…తను కూడా గవర్నమెంటు జాబ్… అంది నిర్లక్ష్యంగా….” చూడు వసు..నాది అనుమానం కాదు.ప్రేమ మాత్రమే…ఎవరితో మాట్లాడకు అని నేనెప్పుడూ చెప్పలేదు…మంచి అలవాట్లు లేని అబ్బాయిలు నీతో మాట్లాడ్డం నాకు నచ్చలేదు..అదే చెప్పాను..తప్పా..నిన్ను నా సొంతం అనుకున్నా..నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను…నీకు దెబ్బ తగిలితే నేను విల విల్లాడి పోయాను…

art love

నిన్ను ప్రేమించాను కాబట్టి… పసి బిడ్డ లా కాపాడుకోవాలి అనుకున్నా..ఇప్పుడు తెచ్చుకున్న ఉద్యోగం కూడా నీ కోసమే…ఉద్యోగం తో వచ్చి మీ పెద్దలను …మాట్లాడి .నిన్ను పెళ్లి చేసుకుందాం అనే కదా”. అన్నాడు బాధ గా..అయినా వసంత ఏమి వినే ఆలోచన లో లేదు..” వద్దు..నువ్వు నాకొద్దు ..ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ మాట్లాడింది…చివరకు అశోక్ ఎంతో బతిమాలుకున్నా కూడా వసంత వినలేదు….ఎంతో దిగులుగా ఇంటికొచ్చాడు అశోక్……ఇక ఆ రోజు నుండి వసంత కనిపించలేదు…రెండు నెలలకు వసంత పెళ్లి జరిగిపోయింది….ఇక అశోక్ వేదన..బాధ ఎక్కువై పోయాయి…

నెల రోజుల తర్వాత అశోక్ వాళ్ళ ఇంటికి వచ్చింది వసంత….అందరి తో సంతోషం గా మాట్లాడి..ఏమి జరగని దానిలా ప్రవర్తిస్తూ….అశోక్ తో కూడా చాలా మామూలు గా మాట్లాడింది…అశోక్ మనసు రగిలిపోయింది….ఎంత ప్రేమించాడు…కానీ..వసంత ఎంత లా మారిపోయింది…అనుకుంటూ..వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా అశోక్ తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోయారు….ఒక దాని తర్వాత ఒకటి…ఒక వైపు వసంత దూరంఇప్పుడు తండ్రి మరణం….అశోక్ పై కుటుంబ బాధ్యత…అప్పుడే అశోక్ మేనమామ తన కూతురు పవిత్ర ను పెళ్లి చేసుకోమని..ఇంకా పెద్ద మొత్తం లో కట్నం డబ్బు ఇచ్చాడు…అంతే కాకుండా తన చెల్లెళ్ళు ఇద్దరికీ మంచి పెళ్లి సంబంధాలు చూసి అశోక్ మేన మామే ..ఘనం గా పెళ్ళిళ్ళు జరిపించేసాడు…

కాల క్రమంలో లో వసంత ప్రేమ..తన మనసుని అప్పుడప్పుడు రగిలిస్తున్నా…బలవంతంగా వసంత ను మరచిపోయే ప్రయత్నం చేసేవాడు…ఒక సంవత్సరం నుండి..పవిత్ర ను ప్రాణంగా చూసుకోవడం మొదలు పెట్టాడు..వసంత చేసిన తప్పుకు పవిత్ర ను బాధ పెట్టడం మంచిది కాదు అని…ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా వున్నారు..ఇలాంటి టైమ్ లో వసంత మరలా ఎందుకు వచ్చింది…అనే ఆలోచనతో….మరుసటి రోజు ఉదయాన్నే…పవిత్ర ” బావ..బావ..త్వరగా నిద్ర లే..నీకో విషయం చెప్పాలి…అంటూ…”ఏంటి” అన్నాడు కళ్ళు తెర వ కుండా నే….ఆ వసంత చనిపోయింది అంట….త్వరగా లే బావ.. అంది…ఒక్క క్షణం మెదడు మొద్దు బారిపోయింది.అశోక్ కు…. కలా ..నిజమా అనిపించింది….పవిత్ర వస్తాను అంటున్నా వారించి…అశోక్ బైక్ పై వేగంగా వసంత వాల్లింటికెళ్ళాడు….నిర్జీవంగా వసంత .ఇంటి ముందు….మనసంతా దిగులు గా..తన మీద కోపం రావట్లేదు..జాలి అనిపిస్తోంది….అశోక్ కు……..కార్యక్రమాలు అన్ని పూర్తి అయిపోయాయి… ఇంటి కి వచ్చాడు….ఏదో పోగొట్టుకున్నాడు అనిపించింది…ఇలా వుండగా..వారం రోజుల తర్వాత ఆఫీస్ లో వుండగా..తన email ఓపెన్ చేసాడు….

అది వసంత చనిపోవడానికి ముందు చివరగా పంపిన మెయిల్…..చాలా ఆత్రంగా చదవడం మొదలు పెట్టాడు….ప్రియమైన….అశోక్ కు…ఇలా సంబోధించడానికి నాకు హక్కు లేదు.. కానీ నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెరగనిది…నాకు తెలుసు..నీకు నా పై చాలా కోపం వుందని….కొన్నింటిని నీతో చెప్పుకోవాలి అనిపిస్తోందిఇప్పటికైనా నా మనసు లో నీ బాధను తగ్గించుకోవాలి అనిపిస్తోంది….మొదట గా…నిన్ను నేను ..పెళ్లి కి నిరాకరించిన సందర్భం….నువు నాతో విడిపోవడానికి .కొన్ని రోజుల ముందు మీ అమ్మ..నాన్న…నన్ను మీ ఇంటికి పిలిపించారు…మన ప్రేమ విషయం తెలిసి తెలియనట్టు వున్నారని అర్థమైంది….ఆ రోజు మీ అమ్మ …చెప్పిన విషయం….నేను మీ ఇంటి కోడలు అవడం వారికి ఇష్టం లేదని…ఇంకా మీ మేన మామ కూతురితో నీ పెళ్లి జరగాలనేది వారి నిర్ణయం… నీ పెళ్లి మీ మేనమామ కూతురితో జరగడం వల్ల..మీ చెల్లెళ్ళకు మంచి సంబంధాలు తెచ్చి..మీ మేన మామ నే…వారి పెళ్లి ఖర్చులు భరించుకుంటారు అని..చెప్పారు…

ఇంకో విషయం ..వాళ్ళను కాదని మనం పెళ్లి చేసుకున్నా…మనల్ని విడగొట్టి..నన్ను నీ నుండి దూరం చేస్తాం అనే చెప్పారు….భయ పడ్డా..బాధ పడ్డా.అందరు బాగుంటారు అంటే మన ప్రేమ ను త్యాగం చేయడం లో తప్పు లేదు అనిపించింది….అందుకే కష్టంగా వున్న..బాధ గా వున్న…నీకు దూరం అవుదాం అనుకున్న…అలాగే దూరం అయ్యా కూడా…నాకు పెళ్ళి జరిగి పోయాక…అసలు కథ మొదలైంది…మా ఆయనకు ఎవరో..పెళ్లికి ముందు మన ప్రేమ కథ గురించి చెప్పారట…అది తెలిసిన రోజు నుంచి నాకు ఇంటో నరకం మొదలైంది ..ప్రతి రోజూ గొడవలు..దెబ్బలు. చీత్కారాలు .ఆయనకు నా మొహం చూడడం కూడా నచ్చేది కాదు..చాలా బాధ అనిపించేది..ఏం పాపం చేశాను అని ఈ నరకం నాకు…మనసారా కోరుకున్న నిన్ను కోల్పోయాను…

indian art love women

పెళ్లి తో నరకం లోకి వచ్చాను….ఈ విషయాలు..చెప్పుకోవడానికి కూడా లేదు..అమ్మకు..అమ్మమ్మ కు తాతయ్య కు తెలిస్తే బాధ పడతారని ఎవరికి చెప్పేదాన్ని కాదు….మా ఆయన కూడా నాతో నెల లో ఇరవై రోజులు ఆఫీస్ వర్క్ అంటూ వెళ్లిపోవడం..నాక్కూడా బాధ అనిపించేది..అందుకే బలవంతంగా ఆ పెళ్లి బంధం లో సర్దుబాటు చేసుకో లేక పోయాను…..కనీసం నేను లేకుండా పోతే..నా భర్త వెరోకర్ని చేసుకుని..ఆయన అయిన సుఖంగా వుంటాడు…ఇప్పుడు కూడా ఈ నిజం నీకు తెలియాలనే చెప్తున్న…మనస్ఫూర్తిగా నన్ను క్షమించు…పవిత్ర మంచిది..తనకు ఈ విషయాలేవీ తెలియదు…ఇంట్లో అందరూ..ఈ విషయాలేవీ మీకు తెలియదు అనుకుంటున్నారు… మీరు కూడా తెలియనట్లే ప్రవర్తించండి…..సెలవు…..వుత్తరం చదవడం అయిపోగానే…అశోక్ మనసంతా పశ్చాతాపం తో నిండిపోయింది …

ప్రతి ప్రేమ కథకు..మనకు తెలిసిన కోణం..ఒకటే….అటువైపు జరిగే పరిణామాలు తెలియవు…వసంత పడిన బాధ..మానసిక వేదన గుర్తొచ్చి వెక్కి వెక్కి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు..తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడానికి బాధ్యులు ఎవరు?? పరోక్షంగా తన కుటుంబ సభ్యుల స్వార్థం అనిపించింది…కానీ చివరగా ఎవర్ని ఏది అనకూడదు…అని.. అశోక్ సంతోషమే తన చివరి కోరిక అని వసంత చెప్పకనే చెప్పింది…..తన వసంత ఇక రాదు…కానీ తమ ప్రేమ జ్ఞాపకాలు ఓదార్పు గా ..తన జీవితం సాగిపోవాలి అనుకున్నాడు…ఫోన్ మోగింది..పవిత్ర కాన్పు నొప్పులతో వుంటే ఆసుపత్రి లో చేర్చామని…అశోక్ చెల్లెలు చెప్పింది…హాస్పిటల్ కు వెళ్ళాడు..పండంటి పాప పుట్టింది…సంతోషం గా గుండెకు హత్తుకున్నాడు..మనసుకు సంతోషం..దూరమైన వసంత ప్రేమ దగ్గరైనంత గా..

సమాప్తం

సర్వేజనా సుఖినోభవంతుస్వస్తి

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
26
+1
9
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading