Menu Close

మ్యూజిక్ ప్రియులకి మంచి ఇయర్ బడ్స్
తక్కువ బడ్జెట్ లో అమెజాన్ ఆఫర్ 👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ప్రేమ లోగిలి – డబుర ధనలక్ష్మి కథలు – Love Stories in Telugu

Love Stories in Telugu – Wife and Husband Stories

మొబైల్ లో వాట్సప్ మెసేజ్ ల నోటిఫికేషన్ రావడం తో ఆఫీస్ లో చేస్తున్న వర్క్ ను ఆపి మొబైల్ చెక్ చేశాడు కిరణ్.. అది తన భార్య శృతి నుండి.. శృతి-కిరణ్ లకు పెళ్లయి రెండు సంవత్సరాలు. చూడ చక్కని జంట, కానీ ఇద్దరివీ భిన్న మనస్తత్వాలు. రెండు నెలల నుండి ఇంట్లో వాతావరణం వాడి వేడి చూపులు మాటలతో సాగుతోంది.

శృతి కిరణ్ మీద అలిగి చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితం కిరణ్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లగానే తలుపుకు తాళం కనపడింది. ఉస్సూరంటూ కూలబడ్డాడు. తను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పంపితే చూస్తోంది కానీ రిప్లై ఇవ్వట్లేదు.

ఇదిగో ఇప్పుడు ఈ రోజు శ్రుతి నుండి ఫోన్
“ఎక్కడున్నారు”” అడిగింది శ్రుతి.
“ఎక్కడుంటాను?? ఆఫీస్ లో
“ఓ..అవునా…ఇంకా ..ఆ శ్రేయ మీ పక్కనే ఉందా..
“ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళం. ఏం ఉండకూడదా.
అది కూడా తప్పేనా…?

wife and husband couple love telugu stories

“అందరి కథ వేరు. తమరి కథ వేరు
“నేను అందరిలాంటి వాడినే. నువ్వే లేనిపోనివి సృష్టించు కొని నన్ను అనుమానిస్తూ అవమానిస్తూ ఉన్నావు.
“అవునులే.. మీరు బిగ్గరగా మాట్లాడితే. మీ చుట్టూ ఉన్న మీ కొలీగ్స్ అందరూ నన్ను గయ్యాలి అనుకోవాలా?
“అది కాదే. నేను “
“మరి ఏది కాదు.”
“ఆఫీస్ లో పెండింగ్ వర్క్ ఎక్కువ ఉంది. తర్వాత ఫోన్ చేస్తాను”
“అవునులే. రెండు నెలల మునుపు నేను పుట్టింటికొచ్చేస్తే కనీసం బతిమాలడడాలు, బుజ్జగింపులు కూడా లేవు”
“మొగుడంటే పట్టింపు లేదు. వదిలేసి వెళ్తే భోజనానికి ఇబ్బంది. ఇంకా ఇల్లు సంసారం అంటే బాధ్యత ఉన్న ఏ ఆడదైనా ఇలా వదిలేసి వెళ్ళిపోతుందా..?”

“మరి, వెళ్ళక చస్తానా.. అర్ధరాత్రి రెండు గంటలకు ఆ శ్రేయ ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు. నేను వెళ్ళవద్దంటే ఆగిపోయారా”
“నిజమే ఆవిడ తల్లి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తన భర్త దూరంగా ఉద్యోగం ఆత్మీయునిగా భావించి అత్యవసరమై ఫోన్ చేసింది. నిర్లక్ష్యం చేస్తే నిండు ప్రాణం పోతే తరువాత ఎంత పశ్చాత్తాపం చెప్పు.”

“ఎందుకు పశ్చాత్తాపం ఆవిడేమైనా మీ అమ్మనా.. ? లేక మా అమ్మనా..? దారిన పోయే వాళ్ళందరి సమస్యలు మనకు అవసరమా..?”
“షటప్ శృతి, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది. మన నిశ్చితార్థం అయ్యాక మీ అమ్మ నాన్న తిరుపతి వెళ్ళినపుడు ఘాట్ రోడ్డు లో చీకట్లో ఆక్సిడెంట్ అయి తీవ్ర దెబ్బలతో బాధపడుతుంటే నువ్వు కాల్ చేసి నాకు చెప్పగానే ఆ ఏరియా కు దగ్గర్లోని మా ఫ్రెండ్స్ ను అలెర్ట్ చేయడం తో అత్త మామల కు పెద్ద ప్రమాదం తప్పింది.

ఆ రోజు డాక్టర్ గారు ఏమన్నారో గుర్తుందా..? “ఇంకాస్త ఆలస్యం అయుంటే” అత్త మామలు మనకు దక్కరు అని. ఆ రోజు నువ్వు నన్నెంత మెచ్చుకున్నావో గుర్తుందా.ఇది నా మనస్తత్వం. మొదట్లో నాలోని ఆ సహాయం చేసే గుణం అంత నచ్చిన నీకు ఈ రోజూ ఎందుకంత భరించలేనిదిగా అయిపోయింది.”
“ఒప్పుకుంటాను, ఆ రోజు మీరు అలా చేయడం కరెక్ట్ ఎందుకంటే మీరు చేసింది సాయం కాదు.

కాబోయే అల్లుడిగా మీ బాధ్యత. కానీ ఆఫీస్ లో బయట మనకు సంబంధం లేని ఆడవాళ్ల విషయాల్లో మీ జోక్యం మీ సహాయం నాకు నచ్చదు. శ్రేయ ఒక్కటేనా, రెండు నెలల క్రితం రాత్రి భోంచేస్తుండగా మీ కాలేజ్ క్లాస్మేట్ స్వరూప ఫోన్ చేసింది. తింటున్న భోజనం వదిలి మొబైల్ తీసుకుని నా ముందు మాట్లాడకుండా మేడ మీదికెళ్ళిపోయారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన ఫోన్ రాత్రి పదకొండు గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారు.

“అవును. స్వరూప తండ్రి పంచాయితీ రాజ్ లో ఏ ఈ తల్లి మున్సిపాల్ ఆఫీస్ లో ఉద్యోగి. నేను చదువుకునే రోజుల్లో మూడుపూటలా తిండి తినలేని పేదరికం. స్వరూప చాలా మంచిది. కాలేజ్ లో జాయిన్ అయిన కొత్తల్లో ఎవరో సీనియర్స్ తనను రాగింగ్ చేస్తే పిచ్చ కొట్టుడు కొట్టా. తనంటే చాలా అభిమానం నాకు. మా అమ్మ లా అనిపించేది. తను తినే లంచ్ బాక్స్ లో నాక్కూడా భాగం పెట్టేది.

నేను మొహమాటపడి తినను అంటే తను కూడా తినేది కాదు. నాకు ఇష్టమని నెలలో ఒకసారి పెద్ద హోటల్ కు తీసుకెళ్ళి నాకు నచ్చినవి అన్ని తినమని చెప్పేది. బిల్ తను పే చేసేది. మంచి బట్టలు కొని గిఫ్ట్ గా ఇచ్చేది. నా పుట్టినరోజు నా కంటే కూడా తనకే ఎక్కువ గుర్తు. మా స్నేహాన్ని అందరూ గౌరవించేవారు. తన పెళ్లి అప్పగింతల లో నేను పడిన బాధ అంతా ఇంతా కాదు.

wife and husband couple love telugu stories

తను యు ఎస్ వెళ్లిపోయింది. తనకు ఇద్దరు కొడుకులు. అప్పుడప్పుడు మెసేజ్ లు, ఫోన్ కాల్స్ రాను రాను తను తన కుటుంబం తో బిజీ అయిపోయింది. అనుకోకుండా ఆ రోజు ఫోన్ చేసింది. తన నాలుగేళ్ల చిన్న కొడుకు హఠాత్తుగా అనారోగ్యంతో చనిపోయాడని తన బాధను నాతో చెప్పుకుంది. ఓదార్పు గా నాలుగు మాటలు మాట్లాడాను.

తనకు అంత కష్టం వస్తే కనీసం ఒదార్చక పోవడం ఎంత మిత్ర ద్రోహం. అప్పటికి నువ్వు మేడ మీదకు వచ్చి మా మాటలన్నీ విన్నానని నాకు తెలుసు. నువ్వే చెప్పు మా మాటల్లో నీకు ఏమైనా తప్పుగా అనిపించాయా “అలా ఏమి తప్పుగా అనిపించలేదు. కానీ భార్యని అనేదాన్ని నేనొక్కదాన్ని ఉన్నాను అని కూడా మరచిపోతారు చూడండి. అది నాకు నరకం లా అనిపిస్తోంది. నెల క్రిందట మీ ఆఫీస్ లో పని చేసే వేదిక తో ఏదో….” “ఆపెయ్ శృతి. వినలేకున్నా. నిజానికి ఆఫీస్ లో పనిచేసే వేదిక చాలా మంచి అమ్మాయి.

మా ఆఫీస్ లో నే పనిచేసే అరుణ్ ప్రేమ అని తన వెంట పడ్డాడు పెళ్లి చేసుకుంటాను అని మాయ మాటలు చెప్పి ప్రెగ్నెంట్ ను చేశాడు. తరువాత మొహం చాటేసాడు. ఆ అమ్మాయికి అర్జెంట్ గా అబార్షన్ చేయించాల్సి వచ్చింది. హాస్పిటల్ లో తన భర్త ఈ మధ్యనే ఏక్సిడెంట్ లో చనిపోయాడు అని నేను వేదిక అన్న ను అని చెప్పి సంతకం పెట్టాను.

wife and husband couple love telugu stories

ఇదే విషయం నీకు తెలిసిందని నాకు తెలుసు. నీకు తెలియని ఇంకో విషయం ఈ రోజు ఉదయాన్నే అరుణ్ వేదిక ఇద్దరు నా క్యాబిన్ కు వచ్చి వారి పెళ్లి ఆహ్వాన పత్రిక ను ఇచ్చి వెళ్లారు. ఇద్దరి కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారట. అనవసరంగా ఏవేవో ఊహించుకోకు. నిజానిజాలు తెలుసుకోవాలి.
“ఇదేనా. మీ మేనత్త కూతురు .అదే సుజాత. ఇప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోలేదని తెగ బాధ పడుతూ ఉంటుందట. మీ పేరును పచ్చ బొట్టు గా వేయించుకుందట. మరి సుజాత సంగతి ఏంటి”

“చూడు బుజ్జమ్మా. సుజాత అత్త కూతురు. నీకు తెలియంది ఏముంది. పల్లెటూరి బంగారం. కడిగిన ముత్యం. మంచి మనసున్న అమ్మాయి. తనకు నేనంటే చాలా ఇష్టం అని నన్ను ప్రేమిస్తున్నది అని నాతోనే జీవితం పంచుకోవాలని ఎన్నో కలలు కన్నది అని నా పేరు ను పచ్చ బొట్టు గా వేయించుకుందని తన పెళ్లి అయిపోయే వరకు నాకు తెలియదు. మా బామ్మ చెప్పాక తెలిసింది. సంవత్సరం క్రితం సుజాత భర్త పొలం దున్నుతూ ట్రాక్టర్ తిరగబడి చనిపోవడం మా కుటుంబంలో అందరి మనసుల్ని కలచి వేసిన విషయం నీకు తెలియదా.

చిన్న వయసుకే ముగ్గురు పిల్లలు. భర్త మరణం సుజాత ను మానసికంగా ఎంత కృంగ దీసి ఉంటాయో అర్థం చేసుకోలేవా?. అందుకే తన బావగా బాధ్యత తీసుకుందాం అనిపించింది. అందుకే టీచర్ ట్రైనింగ్ కోసం ఎంట్రన్స్ వ్రాయించాను.ఇప్పుడు టీ టీ సి చేస్తోంది. తను తర్వాత ఉద్యోగం తెచ్చుకుని సుఖంగా బతుకుతుంది.

ఇప్పుడు తనకు నా అవసరం తోడు తప్ప ఎటువంటి ఆశ లేదు. నేను కూడా అంతే. ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. నువ్వంటే ఇష్టమే బుజ్జమ్మా. కాదు నా జీవితమే నువ్వు వెన్నెల్లో నీతో కబుర్లు. నీ చేతి గోరు ముద్దలు నన్ను పసివాన్ని చేస్తాయి. నువు నాతో లేకుంటే ఎలా వుందో తెలుసా ..?

నాలోని జీవమేదో నన్ను వదిలేసి వేల యోజనాల
దూరంలో ఉన్నట్టుంది.
నీ దూరం నా మనసును కనులను
కన్నీటి తో తడిపేస్తున్నట్టు ఉంది
తల్లిప్రేమ కోసం రోదించే పసి హృదయం లా
జన్మ జన్మల ప్రేమ నను వీడి వెళ్లిపోయినట్లు
నా కనులు హృదయం నిను
కలవరిస్తూ వెదుక్కుంటున్నాయి.
నువు నా జీవితంలోకి
రాక మునుపు శూన్యం
నువు నా జీవితంలోకి వచ్చి
వస్తూ వస్తూ వసంతాన్ని
మోసుకొచ్చావు
అలిగి వెళ్లిపోయి
నన్ను నా సంతోషాన్ని
చీకట్లోకి విసిరేసావు.
ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు
శరీరంలో ఓపిక లేదు
నా కంట్లో వెలుగు లేదు
నా మీద అలక మాని వచ్చేయ్ బుజ్జమ్మా. ప్లీజ్…

wife and husband couple love telugu stories

“ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు. చూద్దాం. మనసు మారితే బయల్దేరి వచ్చేస్తా. లేకపోతే మీరే వచ్చి తీసుకెళ్లండి. అంది ముసి ముసి గా నవ్వుతూ
“ఆఫీస్ వర్క్. సాయంత్రం బయల్దేరి వస్తా. అయినా హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ కు రావాలి. రెక్కలుంటే బాగుండు. ఇప్పుడే నీ ముందు అలా అలా వాలిపోదును.

నా బుజ్జమ్మ ఓ శీతల సమీరం నా ఎడారి జీవితానికి”
“కాదు మీరే నా నిజమైన బంగారం. మీ కోసం ఎదురు చూస్తుంటాను”

ఫోన్ కాల్ ముగియగానే ఇద్దరి మనసుల్లో తేలిక వాతావరణం.
అప్పుడే కాఫీ కలుపుకుని గదిలోకి తీసుకొచ్చి ఒక కప్ కుతురికిచ్చి ఇంకో కప్ తను తీసుకుని కాఫీ తాగుతూ కూతురితో ఇంటో ముచ్చట్లు మొదలు పెట్టింది శృతి తల్లి సులోచన. మాటల్లో మాటగా తమ పొరుగింటి కావ్య అత్తింటి కష్టాలు చెప్పడం మొదలెట్టింది. కావ్య భర్త ఏమో ఢిల్లీ లో ఉద్యోగం .కావ్య మాత్రం అత్తింట్లోనే సేవలు చేసుకుంటూ ఉందట.

కావ్య భర్త పృథ్వీ అక్కడే ఒక భర్త మరణించిన స్త్రీ తో సహజీవనం చేస్తూ ఉన్నాడట. ఈ విషయం ఎలానో కావ్య చెవిన పడిందట. పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించిందట. ఒక్కగానొక్క కూతుర్ని తీసుకుని పుట్టిల్లు చేరిందట. అదే ఊరిలో ఒక సొంత ఇంటిని కావ్య కూతురి పేరు రాయించారట. పన్నెండు లక్షల డబ్బు కావ్య అకౌంట్ లో వేశారట.

ఇక భార్య భర్తకు మధ్య తెగ తెంపులు అయిపోయాయట. ఇప్పుడు కావ్య అమ్మ గారింటిలోనే ఉంది అట.ఒక్కగానొక్క కూతురు జీవితం ఇలా అయిపోయిందని కావ్య తల్లిదండ్రులు బాధ పడని క్షణం లేదుట.కావ్య భర్త కనీసం కూతురు కావాలని కానీ కూడా అనలేదుట. ఏం తండ్రో ఏమో అని అంది సులోచన.
సరిగ్గా అప్పుడే శృతి తండ్రి కూడా వచ్చి కూర్చుంటూ” శృతి నువ్వు అల్లుడితో గొడవ పడ్డావా? నీ వాలకం చూస్తుంటే అలానే ఉంది. అబ్బాయి ఇప్పుడే ఫోన్ చేసాడు. నిన్ను తీసుకెళ్లడానికి వస్తాను అన్నాడు.”

“గొడవ ఏం లేదు నాన్న. అమ్మను మిమ్మల్ని చూడాలి అనిపించింది వచ్చాను. అంతే నాన్న”
కాసేపు ముగ్గురు కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు.
ఆ రోజు రాత్రి తొమ్మిది కావస్తుండగా ఇంట్లోకి అడుగు పెట్టాడు కిరణ్. తన వెనుకనే ఇంట్లోకి అడుగుపెట్టింది శృతి.
“ఇంట్లోకి వస్తున్న ధ్యాస లో గేటు తీసుకుని రావడమే కానీ అటు వైపు చీకట్లో మెట్ల మీద మీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్న నేను కనిపించలేదా” అంది నవ్వుతూ శృతి అప్పుడు సరిగ్గా భర్త మొహం గమనించింది. వారం రోజులకే మనిషిలో చాలా మార్పు.

తను దగ్గర లేని కిరణ్ ఇలా దిగులుగా అయిపోతాడని అనుకోలేదు.మనసుకు బాధ అనిపించింది.అప్పుడే గుడికి వెళ్ళిన శృతి తల్లిదండ్రులు రావడం కుశల ప్రశ్నలు అయ్యాయి.భోజనాలయ్యాయి గది సర్ది పడుకునే ముందు కిరణ్ ను అలానే చూస్తున్న శృతి తో

ఏంటి అలా చూస్తున్నావ్. అసలే నువ్వు లేక ఎలా చిక్కిపోయానో చూడు. ఇంకా దిష్టి పెట్టకు” అన్నాడు చిలిపిగా
ఆ మాటలకు ” నిజంగా మిమ్మల్ని వదిలొచ్చి తప్పు చేశాను” అంది కళ్ల నీళ్లతో.
” పరవాలేదు. ఇప్పుడే బాగుంది. ఇన్ని రోజుల బాధ విరహం ముందు ఈ రోజు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే మన ఇంటికి బయల్దేరుదాం” అంటూ శృతిని దగ్గరగా తీసుకున్నాడు.

ఉదయాన్నే నిద్ర లేచిన శృతి తన లగేజ్ సర్దుకుంది.భర్తతో తమ ఇంటికి బయలుదేరింది. కిరణ్ ఆఫీస్ కు లేటుగా బయలు దేరాడు.ఇల్లంతా శుభ్రం చేసి తమ గదిలో కాస్త సేద దీరింది. పెళ్లి చూపుల్లోనే కిరణ్ తనను చూడగానే ఇష్ట పడ్డాడు. తను కూడా నిశ్చితార్థం అయ్యాక కొద్దిగా షాపింగ్ లకు సినిమాలకు అమ్మ నాన్న పర్మిషన్ తో తీసుకెళ్ళే వాడు.

wife and husband couple love telugu stories

ఇక పెళ్లయ్యాక ఇద్దరిదీ ప్రేమలోకం. రోజులు ఎలా గడిచిపోయేవో తెలిసేది కాదు.నెలసరి సమయంలో లో శారీరక శ్రమను అర్థం చేసుకుని ఇంటి పనుల్లోఎంతో సహకారంగ ఉండేవాడు. “ఆర్థికంగా తోడు ఉంటాను ఉద్యోగం చేస్తానంటే” ” ఇద్దరు పిల్లలు పుట్టే వరకు ఎలాంటి ఆలోచన వద్దు” అన్నాడు.
పెళ్లికి ముందు కిరణ్ కు చాలా కోపం అని చెప్పారు అత్త మామలు.. కానీ పెళ్లయ్యాక అతనిలో చాలా మార్పు. నిజానికి తన కోపాన్ని భరిస్తున్నారు.

ఆ భగవంతుడు మూడు ముళ్లు ఏడు అడుగులతో ఈ దాంపత్య బంధాన్ని ముడి వేసి మనసుకు మరో తోడు ని అర్ధ భాగాన్ని ఇస్తున్నాడు.ఎంత గొప్పది ఈ బంధం. తండ్రి తర్వాత అంత బాధ్యతను భర్త తీసుకుంటున్నాడు. అతనికి తల్లిలా ప్రేమను పంచడం భార్య విధి. నిజమే ఇప్పుడొక వాక్యం గుర్తు వస్తోంది.

ప్రతి భర్తా తన భార్యకు ప్రేమ, బాధ్యత పంచడంలో తండ్రిలా వ్యవహరిస్తే
ప్రతి భార్య తన భర్తను ప్రేమగా చూసుకోవడంలో తల్లిలా వ్యవహరిస్తుంది అని.

అలకలు గొడవలు అపార్థాలు లేని సంసారం ఉండదు.ఇక్కడ భార్య భర్త ల జీవితం కలకాలం. మధ్యలో వచ్చే గొడవలు అపార్థాలు నీటి బుడగల్లా ఉండాలి.
అపార్థాలు వీడిన కాపురం చీకటి చాటు వేకువలా బ్రతుకులో సంతోషాల వెన్నెల వెండి పూల వెలుగులతో ఇంటిని ప్రేమ లోగిలి గా మార్చి మనసులను సంతోషాలతో అభిషేకిస్తుంది.

Romantics Stories in Telugu, Telugu Love Stories, Cute Telugu Stories

డబుర ధనలక్ష్మి కథలు

Like and Share
+1
3
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks