Menu Close

ఒక అమ్మాయి ప్రేమ ఖరీద – ఓ అయిదు లక్షలు, జీవితాంతం కన్నీరు – Telugu Love Stories

ఒక అమ్మాయి ప్రేమ ఖరీద – ఓ అయిదు లక్షలు, జీవితాంతం కన్నీరు – Telugu Love Stories

అందరి అమ్మాయిల్లా కలలు కనే వయసు… మంచి చదువుకి మంచి ఉద్యోగం…. తగినంత అందం కూడా.. కానీ దేవుని శాపమేమిటో… కాస్త అమాయకత్వం… ప్రస్తుతానికి ఆ అమ్మాయి పేరు….. శ్యామల.. ప్రయివేటు ఉద్యోగం చేస్తూ.. గవర్నమెంటు ఉద్యోగానికై కోచింగ్ సెంటర్ కి వెళ్ళింది శ్యామల…

indian art love women

ఇక్కడే శ్యామలకి పరిచయం అయ్యాడు…గోవర్ధన్ …. కౌన్సిలర్ కోచింగ్ సెంటర్ లో కొన్నాళ్ళు గడిచాయి…. గోవర్ధన్ సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ… వేరే వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాడు… అలా ఇద్దరూ కూడా దగ్గరయ్యారు … మాటలు కలిసాయి… అదే ప్రేమ అనుకుని.. ఇద్దరొకటయ్యారు…

దగ్గరలోని గుడి లో దండలు మార్చుకుని గాంధర్వ వివాహం చేసుకున్నారు… అలా 8 నెలలు గడిచాయి.. సంతోషంగా ఉన్నారు.. అమ్మాయి నెల జీతం తో ఇల్లు గడిచేది.. ఇక్కడే మొదలయ్యింది… వారి హానీ మూన్ గడచి పోయింది.. డాబ్బులు కావాలి రేపన్నది ఎలా జరగాలి మనకు.. ఏదో ఒకటి చేసుకోవాలి.. భవిష్యత్తు కై ఆలోచించాలి కదా అని శ్యామల ప్రతీ రోజు అడిగేది..

indian art love women

అడగడం కాస్తా.. పోట్లాట కిందకు మారిపోయింది.. ఒక రోజు ఉదయం శ్యామల తన భర్త తో ఒక మాట ఆనందంగా చెప్పింది…. తను తల్లి కాబోతున్నాను… అని, సంతోషంతో గోవర్ధన్ వెంఠనే బయటకు వెళ్ళి స్వీట్ తీసుకుని వచ్చాడు…. రెండు రోజుల తరువాత గోవర్ధన్ శ్యామలను డాక్టర్ దగ్గరకు పరీక్షలకై తీసుకెళ్ళాడు…

శ్యామలను పరీక్ష చేసిన డాక్టర్ శ్యామలను కొన్నాళ్ళ పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని లేపోతే ఇబ్బందులు తప్పవని చెప్పింది.. జాగ్రత్త గా ఉండాలని హెచ్చరించింది.. తిరిగి ఇంటికి వచ్చిన శ్యామల గోవర్ధన్ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. తెల్లారి లేచి గోవర్ధన్ వంట చేసి శ్యామలను తినమని చెప్పి తాను బయటకు వెల్లాడు..

సాయంకాలం గడిచింది… గోవర్ధన్ జాడ లేడు… రాత్రి అయ్యింది.. అయినా గోవర్ధన్ అయిపు లేడు.. శ్యామలు కంగారు ఎక్కువైంది.. తెల్లారింది… జాడే లేదు… కంగారు తో శ్యామల తాము పని చేస్తున్న కోచింగ్ సెంటర్ కు వెళ్ళింది.. అక్కడ కోఆర్డినేటర్ ని కలిసి గోవర్ధన్ గురించి అడిగింది… వారు చెప్పిన విషయం విని… షాక్ కి గురయ్యింది శ్యామల.

indian art love women

నిన్న ఉదయం వచ్చి తనకు సంబందించిన వస్తువులు, పుస్తకాలు మరియు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నాను, ఇక తిరిగి రాను అని చెప్పి.. వెళ్ళిపోయాడని.

దిక్కు తోచని శ్యామల్ తిరిగి ఇంటికి వచ్చింది.. గోవర్ధన్ మొబైల్ ఇంట్లోనే ఉండి పోయింది. ఇంకా ఎవరికి చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి.. దిక్కు తోచని స్తితి లో ఇక లాభం లేదని.. తన స్వంత ఊరు కి వెళ్ళిపోయింది జరిగిన విషయం అమ్మ నాన్నకి చెప్పింది.. వారు నానా గోల చేస్సి ఇంటి పరువు తీసావు.. నీకు బతుకెందుకు అని గొడవ చేసి కొట్టి తిట్టారు..

రెండు రోజులు పోయాక గోవర్ధన్ ఊరు వెతకి అక్కడ కనుక్కుంటే.. గోవర్ధన్ అమ్మ నాన్న లను కలిసి గట్టిగా నిలదీస్తే.. వారి నుండి చచ్చిన సమాధానం .. గోవర్ధన్ కి నీవు తగిన దానవి కావు ఎక్కడికైనా వెళ్ళిపో… అంతే కాకుండా.. భాషకందని మాటలతో అవమానించారు శ్యామలని. అవమానంతో తిరిగి వచ్చిన శ్యామల కుటుంబీకులు రెండు రోజుల తరువాత .. ఊరందరిని వెంట పెట్టుకుని మళ్ళీ గోవర్ధన్ వారి ఇంటికి వెళ్ళారు..

indian art love women

చాల గొడవ చేసీన తరువాత.. శ్యామలను ఇంటి లోకి రానిచ్చారు..మంచి రోజు చూసి వివాహం చేస్తామని అందరికీ భరోసా ఇచ్చారు..శ్యామలను వారి దగరే ఉండి పొమ్మన్నారు. ఓ రెండు రోజుల తరువాత.. శ్యామలను తీసుకుని పెళ్ళి బట్టలు తీసుకోవాలని చెన్నై కి తీసుకుని పోయారు.. ఏమి మాయ మాటలు చెప్పారో.. కానీ శ్యామల కి అబార్షన్ చేయించారు.. గోవర్ధన్ తల్లి దండ్రులు.

పెళ్ళి బట్టలు కొని తిరిగి వచ్చారు.. రెండు రోజులు మీ తల్లి గారింటిలో ఉండు అని తిరిగి పంపించారు శ్యామలను పుట్టింటికి.. పెళ్ళి కలలు కంటున్న శ్యామల…. ఉన్న ఊరి నుండి పరారైన గోవర్ధన్ కుటుంబం.. ఒక పది రోజులు తరువాత ఒక పెద్ద మనిషి శ్యామల ఇంటికి వచ్చి ఒక ఆగ్రిమెంటు… డబ్బు సంచి ఇచ్చి అగ్రిమెంటు మీద సంతకం పెట్టమన్నారు.

అగ్రిమెంటు చదివిన శ్యామల కుప్ప కూలిపోయింది.. ఆ కాగితం లో శ్యామలకి ఇక గోవర్ధన్ తో ఎటువంటి సంబందం లేదని ఈ రోజు నుండి విడిపోతున్నట్టు.. రాసి ఇచ్చిన పత్రం. ఇలా వదిలి పెట్టినందుకు తగిన పారి తోషికం ఓ అయిదు లక్షలు ……ఇదేం పని అని సదరు ఆ ఊరి పోలిస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చేరుకున్న శ్యామల అక్కడ గోవర్దన్ ని చూసి నిల దీసింది.

indian art love women

అక్కడే ఉన్న పోలీసులు శ్యామలకు నచ్చచెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతలో కొందరు సదరు పెద్ద మనుషులు వచ్చి శ్యామల తల్లి దండ్రుల తో మాట్లాడి.. ఆ కాగితాల మీద సంతకం పెట్టించుకుని డబ్బిచ్చి వెళ్ళి పోయారు. తెల్లారి శ్యామల తల్లి దండ్రులు శ్యామల ని ఇల్లు వదిలి వెళ్ళి పోమ్మని ఫార్మానా జారి చేసి ఇంట్లోంచి వెళ గొట్టారు…

ఒక అమ్మాయి ప్రేమ ఖరీద – ఓ అయిదు లక్షలు, జీవితాంతం కన్నీరు – Telugu Love Stories

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

Like and Share
+1
7
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading