మూగ ప్రేమ – Love Stories in Telugu – Romantic Stories in Telugu
వనజను ప్రక్క గ్రామంలో ఓ రైతుకిచ్చి పెళ్ళి చేశారు. కాపురానికి పోయేవేళ తనకిష్టమైన టామీ అనే కుక్కను వెంట తీసుకుపోయింది. టామీ అక్కడ పది రోజులు ఇక్కడ పదిరోజులు వుంటూ కాలం గడిపేది. పైరు పండిన వేళ, పశువులు పడకుండా, టామీని కాపలా పెట్టి, ఇంటికి వచ్చి అన్నం తినిపోయేది వనజ.
అలా వారికి ఎన్నో విధాల ఉపయోగ పడుతుండేది. మరిది సాగర్ దురలవాట్లకు బానిసై డబ్బులివ్వమని అన్నను పీడించే వాడు. వాడి బాధను తట్టుకో లేక, పెత్తనం వనజ కిచ్చాడు. అయినా వదినను కూడా పీడించటం మొదలు పెట్టాడు.
కుతికల కానా తాగి అర్ధరాత్రి కాగానే, ఇంటిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. గనగన మంటూ తగలబడి పోతుంది. అది టామీ గమనించి తలుపు దగ్గరకు పోయి అరచి గీ పెట్టింది. వారు లేచి బయటకు వచ్చారు. మరిది ఇంటిపైన కిరోసిన్ పోయడం లో కొంత తనమీద కూడా పడింది.
అంతలో మండుతున్న ఓ తాటాకు వచ్చి మరిది పైన పడింది.. క్రింద పడి దొర్లాడుతున్నాడు అది గమనించిన టామీ కుండతో నీళ్ళు తెచ్చి పోసింది. అన్నా వదిన ఇంటిపై నీళ్ళు పోసి చల్లార్పారు. కుక్కకున్న నీతి కూడా నీకు లేకుండా పోయింది తగలబెట్టింది నీవని తెలిసినా, నిన్ను కాపాడింది అన్నారు అన్న వదిన.
కళ్ళనీళ్ళు పెట్టుకుని, దురలవాట్లలో సుఖముందని బ్రమించాను . ప్రేమలో మంచితనంలో కూడా సుఖముందని తెలుసుకున్నాను. క్షమించమని అన్నావదినల పాదాల మీద వాలిపోయాడు. టామీని చెంతకు తీసుకుని ముద్దాడాడు. మన సాగర్.
✍🏻జంజం కోదండ రామయ్య
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.