Menu Close

కరెంట్ పోయినప్పుడు దాదాపు
4 గంటలు ఆన్లో వుండే బల్బ్ Buy Now👇

వారసుడు – Telugu Moral Stories – ఓబ్బా నీ కొడుకేం చేశాడో తెలుసా?

వారసుడు – Telugu Moral Stories – ఓబ్బా నీ కొడుకేం చేశాడో తెలుసా?

ఓబ్బా నీ కొడుకేం చేశాడో తెలుసా?

అంటూ వచ్చింది నా భార్య. హైపర్ యాక్టివ్ అయిన మావాడి ఇష్టాఇష్టాలకు ఇంట్లో నేను తప్ప మరెవరూ పెద్దగా విలువ ఇవ్వరు కాబట్టి ఇలాంటి కంప్లయింట్లు తరచూ వస్తుంటాయి. వాడిని ఇరుకున పెట్టేది ఏదో చెబుతాదిలే అనుకుని ఏంటో చెప్పు అన్నట్టు చూశాను. పొద్దున ఎవరో ఒకామె రసీదు బుక్కులు చేతబట్టుకుని వచ్చి మాయమ్మను డబ్బులు అడిగిందంట.

ఇంట్లో ఎవరూ లేరు పోమ్మా అని మాయమ్మ చెబితే ఆడుకుంటా ఉండే వీడు ఇంట్లోకి వెళ్లి డబ్బులు తెచ్చి ఇచ్చాడంట. ఎంతిచ్చావురా అని మాయమ్మ అడిగితే పది రూపాయలు అని చెప్పాడంట. కానీ వీడి ఫ్రెండు చెర్రీ మాయమ్మకు ఐదు వేళ్లు చూపి సైగ చేశాడంట. యాభయ్యా అంటే కాదు ఐదొందలని సైగ చేశాడంట. మాయమ్మ ఆమెను పిల్చి అడిగితే ఆమె నవ్వుతూ ఐదొందలు వెనక్కి ఇచ్చిందంట.

మాయమ్మ వీడ్ని అరిస్తే మానాన్న డబ్బుగన్లే అన్నాడంట. గంట కొట్టినట్టు టకటకా చెప్పుకొచ్చింది. నాకు చివరి మాట మాత్రమే తప్పుగా అనిపించింది. ఇట్రారా అన్నాను. వాడు‌ ఏ కంగారూ లేకుండా ధైర్యంగా వచ్చాడు. వాడికి‌ తాను చేసింది తప్పు అనిపిస్తే ఎనలేని భయం నటిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి చేతికి అందనంత దూరంలో ఆగిపోతాడు.

అంటే ఎవరోకరు వచ్చి రక్షించడానికి కావాల్సిన సమయం ఇస్తాడన్నమాట. అలాంటోడు ధైర్యంగా వచ్చాడంటే అది తప్పని వాడు ఏ కోశానా అనుకోవడం లేదు. అది గమనించి ” ఒరేయ్ సామీ.. నేను దండిగా సంపాదించి పెట్టినాక నువ్వు ఇలాంటి దానాలు మొదలుపెట్టాల. సంపాదించడానికి తెచ్చిపెట్టుకున్న డబ్బులు దానం చేసేస్తే ఎత్తిపోతాంరా ” అన్నాను‌ నవ్వుతూ. వాడూ నవ్వాడు ముసిముసిగా. దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు చేసిన తప్పేందో తెలుసా అన్నాను. చెప్పకుండా ఇవ్వడం అన్నాడు. అది కాదులే అనబోయి సర్లే చెప్పకుండా ఎందుకిచ్చావ్ అన్నాను.

ఇచ్చినాక అడుగుదామనుకున్నాను అన్నాడు. అబ్బా… ఇచ్చినాక అడుగుదామనుకున్నావా అన్నాను కామెడీగా. కిచకిచా కిలాడి నవ్వొకటి నవ్వేసి “చెబితే ఈనిస్తారా… గయ్ గయ్ అని లైరా” అన్నాడు ఒకింత కోపంగా. ఇంట్లో అందరివైపూ చూసి ఔనుకదా అన్నట్లుగా నేను కూడా నవ్వేశాను. అడక్కుండా ఇవ్వడం తప్పు కాదులే గానీ మానాన్న డబ్బులు అనడం తప్పు కదా అన్నాను.

నిజం నాన్నా నేనలా అనలేదు. మానాన్న అవసరమైతే డబ్బులు వాడుకోమని చెప్పాడులే అని చెప్పాను నిజంగా నాన్నా అన్నాడు. సర్లే పదో, ఇరవయ్యో ఇవ్వకుండా ఐదొందలు ఎందుకిచ్చావ్రా అన్నాను. అనాథాశ్రమం అని చెప్పింది నానా అన్నాడు. సేవ పేరుతో జరిగే మోసాలు కొన్ని చెప్పి ఒక నియమం పెట్టాను. నీది పదో తరగతి అయిపోయే వరకూ నీకు ఎవ్వరికన్నా ఇవ్వాలనిపిస్తే ఇరవై రూపాయలు మించి ఇవ్వగాకు.

చెప్పకుండా అయినా ఇవ్వొచ్చు సరేనా అన్నాను. మళ్ల అన్నాడు. అప్పుడు చెబుతాలే అన్నాను. ఎప్పటికప్పుడు మంచీ చెడూ చెప్పుకొంటూ రాగలగడం వల్ల వాడికి రావాల్సిన మంచి లక్షణాలన్నీ వస్తున్నాయి. ఇంక వాటితో వాడు ఎత్తిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకొంటూ రావాలి. మొత్తం మీద వీడు కొడుకు మాత్రమే కాదు వారసుడేననే విశ్వాసం కుదిరింది.
_ ఆకేపాటి. శివశంకర్ రెడ్డి, కడప.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

మా కంటెంట్ మీకు నచ్చినట్లైతే
మా యూట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks