Neevena Nanu Thalachinadhi Lyrics In Telugu – Mayabazar
నీవేనా… ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆ
నీవేనా నను తలచినది… నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి… హృదయము కలవర పరిచినది
నీవేనా…
నీవేలే నను తలచినది… నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలచి… హృదయము కలవర పరిచినది
నీవేలే…
కలలోనే ఒక మెలకువగా… ఆ మెలకువలోనే ఒక కలగా
కలలోనే ఒక మెలకువగా… ఆ మెలకువలోనే ఒక కలగా
కలయో నిజమో… వైష్ణవ మాయో
తెలిసి తెలియని అయోమయములో…
నీవేనా నను తలచినది… నీవేనా నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి… హృదయము కలవర పరిచినది
నీవేనా…
కన్నుల వెన్నెల కాయించి… నా మనసున మల్లెలు పూయించి
కన్నుల వెన్నెల కాయించి… నా మనసున మల్లెలు పూయించి
కనులను మనసును కరగించి… మైమరపించి నన్నలరించి
నీవేలే నను తలచినది… నీవేలే నను పిలచినది
నీవేలే నా మదిలో నిలచి… హృదయము కలవర పరిచినది
నీవేలే… నీవేలే
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.