Menu Close

ఐరన్‌ లోపం వల్ల కలిగే ప్రమాదాలు – Understanding Iron Deficiency, Symptoms, Causes, and Remedies

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Understanding Iron Deficiency, Symptoms, Causes, and Remedies

శరీరంలో ఐరన్‌ లోపం కారణంగా.. గుండె వేగం పెరగటం, చేతులు చల్లబడటం, తలనొప్పి, జీర్ణ సమస్యల వంటివీ వేధించొచ్చు. రోగనిరోధకశక్తి బలహీన పడటం వల్ల తరచూ జబ్బుల బారినపడే అవకాశం ఉంది. ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చు. అలసట, బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

ఐరన్ లోపం ఉండడం వల్ల ఎనీమియా మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఐరన్ తక్కువగా ఉండటం వల్ల తల నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, అలసట మొదలైన సమస్యలు కూడా వస్తాయని తెలుస్తోంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన దాని ప్రకారం ఐరన్ లోపం 33 శాతం మహిళల్లో కనబడుతుందని… 40 శాతం గర్భిణీలలో.. 42 శాతం పిల్లల్లో కనబడుతోందని మనకి తెలుస్తోంది.

ఐరన్‌ మన శరీరానికి ఎంతో అవసరమైన మినరల్‌. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్‌ అనే ప్రోటీన్ల తయారీకి ఐరన్‌ చాలా అవసరం.

శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన హిమోగ్లేబిన్‌ ఏర్పడటానికి ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్‌ తోడ్పడుతుంది.

శరీరం ఐరన్‌ను కండరాలు, ఎముకలు, కాలేయం వంటి భాగాల్లో నిల్వ చేసుకొని పెట్టుకుంటుంది. మన డైట్‌లో సరిపడా ఐరన్‌ తీసుకోకపోతే.. ఐరన్‌ లోపం తలెత్తే అవకాశం ఉంది. శరీరంలో ఐరన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే.. కొన్ని సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి.

Iron Deficiency, Symptoms, Causes, and Remedies Telugu Bucket

ఇక్కడ కొన్ని లక్షణాల గురించి వివరించడం జరిగినది(Iron Deficiency, Symptoms in Telugu).

1. మేల్కొన్న తర్వాత, లేచిన తర్వాత మైకము వుండటం : శరీరంలో ఐరన్‌ స్థాయిలు తగ్గితే.. రక్తహీనతకు దారితీస్తాయి. అంటే రక్తం ద్వారా ఆక్సిజన్‌ సరఫరా సామర్థ్యం తగ్గుతుంది. దీంతో మెదడుకు తగినంత ఆక్సిజన్‌ సరఫరా తగ్గుతుంది. దీంతో నిలబడినప్పడు, పడుకుని లేచిన తర్వాత మైకంగా అనిపిస్తుంది.

2. పెదవులు పగలడం : ఐరన్‌ లోపం శ్లేష్మ పొరపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్‌ అన్నారు. దీంతో పెదవులు పొడిబారడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మొదట్లోనే జాగ్రత్తలు తీసుకోకపేతే.. పెదవుల మూలలను కూడా ప్రభావితం చేస్తుంది.

3. గుండెల్లో మంట, దడగా వుండటం : గుండె కండరాలు సక్రమంగా పనిచేయడానికి ఐరన్‌ చాలా అవసరం. శరీరంలో ఐరన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే.. హృదయ స్పందనకు అంతరాయం కలుగుతుంది. గుండె దడ, గుండెల్లో మంటకు దారితీసే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌కు దోహదపడవచ్చు.

4. కళ్లు నీరసంగా, మగతగా వుండటం : ఐరన్ లోపం కారణంగా.. రక్తలేమి సమస్య ఎదురవుతుంది. దీనికారణంగా చర్మం పాలిపోతుంది. కళ్లను కూడూ ప్రభావితం చేస్తుంది. ఐరన్‌ లోపం కారణంగా కళ్లు నీరసంగా మారతాయి.

5. సులభంగా గాయాలు అవ్వడం : ఇనుము లోపం రక్త నాళాలను బలహీనపరుస్తుంది, అవి చీలిపోయే అవకాశం ఉంది. దీని వలన సులభంగా గాయాలు ఏర్పడతాయి. చర్మంలో కీలకమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్‌ అన్నారు.

ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు ఐరన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ఐరన్ ఎందులో ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఐరన్ లోపం కలగకుండా ఉండాలంటే డైట్‌లో ఈ ఆహార పదార్థాలను తీసుకోండి:

ఆకుకూరలు: చాలా మంది ఆకు కూరలు అంటే ఆమడ దూరం పారిపోతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆకు కూరల్లో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. పోషక పదార్థాలు సమృద్ధిగా ఉండే ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు తరిమికొట్టొచ్చు. అయితే ఆకు కూరల్లో ఐరన్ కూడా ఉంటుంది అని గ్రహించండి. పాలకూర కాలే మొదలైన ఆకు కూరల్లో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది.

కాబట్టి వీలైనంత వరకు ఆకు కూరలను కూడా మీ డైట్ లో చేర్చండి. ఆకుకూరల తో మనం వివిధ రకాల రెసిపీస్‌ని మనం తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు పాల కూర తో పాలక్ పన్నీర్ వంటివి ఎంతో రుచిగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కొత్త కొత్త రెసిపీలని కూడా ఆకు కూరలతో ప్రయత్నం చేసి ఏదో రూపం లో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Iron Deficiency, Symptoms, Causes, and Remedies Telugu Bucket 2

విటమిన్ సి ఎక్కువుగా వుండే ఆహారం తీసుకోవడం : అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటటిక్స్ ప్రకారం సమతుల్యమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో విటమిన్ సి కూడా తప్పక ఉండేటట్లు చూసుకోండి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో పాటు విటమిన్ సి కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఇలా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం కలగదు అని చెబుతున్నారు. కాబట్టి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా మీరు డైట్‌లో తీసుకోండి. ఎనిమియా సమస్య లేకుండా వుండండి.

మాంసం మరియు పౌల్ట్రీ: చికెన్, మటన్ మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వాటిలో ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎనిమియా సమస్య రాకుండా చూసుకుంటుంది. అదే విధంగా ఐరన్ లోపం కలగకుండా కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటుంది. కాబట్టి వీటిని కూడా తప్పకుండా డైట్ లో తీసుకోండి.

Note: ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను కాల్షియంతో పాటు తీసుకోకండి. ఎందుకంటే ఐరన్ తో పాటు క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను కలిపి తీసుకోవడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఐరన్ తీసుకో వద్దు. అదే ఐరన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవద్దు.

ఆహారం కంటే ముఖ్యమైనది మంచి నీళ్లు. నీళ్ళే కదా అని పట్టించుకోవడం మానేయద్దు. నీళ్లు నిజంగా బాడీకి చాలా అవసరం. ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు అయితే నిజంగా నీళ్లు అంత ముఖ్యమా అని ఆలోచిస్తున్నారా..? అవునండి మనం తీసుకునే నీళ్లు కూడా మన ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేస్తాయి.

సరిగ్గా నీళ్లు తీసుకుని హైడ్రేట్‌గా ఉంటే ఎనిమియా సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బులెటిన్ రీసెర్చర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తే… మంచి నీళ్లు తీసుకోవడం వల్ల ఐరన్ లోపం కలగదని అంటున్నారు కాబట్టి హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం అని తెలుసుకుని.. ప్రతి రోజూ ఏడు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగండి.

మీరు కనుక వట్టి మంచి నీళ్లు తాగ లేకపోతే నీటి యొక్క ఫ్లేవర్‌ని మార్చుకోవచ్చు. ఉదాహరణకు అందులో రెండు తులసి ఆకులు వేసుకుని రుచి మార్చుకోవచ్చు లేదా పుదీనా, నిమ్మరసం ఇలా ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా నీళ్ళని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా చాలా సమస్యలు మీకు రావు. ముఖ్యంగా ఐరన్ సమస్యలు కూడా ఉండవు.

ఆరోగ్యమే మహా భాగ్యము.

Unmasking Iron Deficiency: Symptoms, Causes, and Remedies
The Silent Epidemic: Understanding Iron Deficiency and How to Combat It
Fueling Your Body: A Guide to Iron-Rich Foods for Deficiency Recovery
Iron Deficiency SOS: Effective Remedies to Boost Your Iron Levels

Breaking the Fatigue Cycle: Overcoming Iron Deficiency with Smart Solutions
From Plate to Powerhouse: The Role of Nutrition in Iron Deficiency
Iron-Clad Health: A Comprehensive Approach to Beating Iron Deficiency
Unlocking Vitality: How to Naturally Treat Iron Deficiency Anemia

The Iron Blueprint: Crafting Your Path to Optimal Health
Ironing Out the Details: A Holistic Guide to Overcoming Iron Deficiency
Beyond Red Meat: Diverse Dietary Solutions for Iron Deficiency
The Iron Resurgence: Strategies to Reclaim Your Energy and Well-Being

Understanding Iron: Your Comprehensive Guide to Deficiency Prevention
Eating for Energy: Iron-Rich Recipes to Combat Fatigue
Navigating Iron Deficiency: A Roadmap to Recovery
The Iron Throne: Reclaiming Your Health from Deficiency

Ironing Out the Myths: Dispelling Common Misconceptions About Iron
Revitalize with Iron: Transforming Fatigue into Vitality
Iron-Rich Eats: Transforming Your Diet for Optimal Health
Iron Insight: Demystifying Deficiency and Embracing Remedies
Understanding Iron Deficiency, Symptoms, Causes, and Remedies

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading