Health Benefits of Mulberry in Telugu – మల్బరీ వల్ల కలిగే ప్రయోజనాలు
మల్బరీ పండ్ల యొక్క రంగు నల్లగా మారే కొద్దీ ఇంకా ఎక్కువ తియ్యగా మారుతాయి. మల్బరీ ను తినే ఆహార పదార్థాలైన పై (pie), వైన్ (wine) మరియు హెర్బల్ టీ తయారు చేయటానికి వినియోగిస్తారు.
మల్బరీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- మల్బరీ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది
- మల్బరీ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
- మల్బరీ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది
- మల్బరీ డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది
- మల్బరీ మెదడు యొక్క ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది
- మల్బరీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది
- మల్బరీ లో అంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి
మల్బరీ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది: మన శరీరంలోని కణాలలో మరియు టిష్యూ లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి అవ్వటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మల్బరీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు అయిన ఆంథోసైనిన్స్ క్యాన్సర్ రాకుండా ఉండటంలో సహాయపడుతాయి.
- Fruits Valla Kalige Arogya Prayojanalu
- Arogya Sutralu
- Health Tips in Telugu
మల్బరీ గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది: మన డైట్ లో మల్బరీ పండ్లని చేర్చుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించటంలో మరియు అథెరోస్క్లెరోసిస్ అనే గుండె కు సంబంధించిన సమస్య ను తగ్గించటంలో సహాయపడుతుంది. అథెరోస్క్లెరోసిస్ అనే సమస్య వచ్చినప్పుడు గుండె ధమనులలో (arteries) ప్లేక్ జమ అయ్యి ధమనుల సైజు ను చిన్న గా చేస్తుంది. అయితే మల్బరీ గుండె పోటు లాంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.
మల్బరీ కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది: మల్బరీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు వయసు తో పాటు వచ్చే కంటికి సంబంచిన సమస్యలనుంచి కాపాడుతుంది. మల్బరీ లో ఉండే విటమిన్ C కూడా కంటికి సంబంచిన కంటి శుక్లాల (cataracts) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
మల్బరీ డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది: మల్బరీ డయాబెటిస్ సమస్య తో బాధపడుతున్న వారిలో భోజనం తరవాత షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది.
మల్బరీ మెదడు యొక్క ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది: మల్బరీ లో ఉండే ఫ్లేవనాయిడ్లు మెదడు కు సంబంధించిన జ్ఞాన పరమైన సమస్యలనుంచి కాపాడటంలో మరియు మతిపరుపు తో సంబంధింత సమస్యలనుంచి కూడా కాపాడటంలో సహాయపడుతుంది.
మల్బరీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది: మల్బరీ లో ఉండే ఫైబర్ మన కడుపు కు సంబంధిన సమస్యలనుంచి కాపాడటంలో సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయటంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్దకం (constipation), కడుపులో ఉబ్బరం లాంటి సమస్యలను తగ్గించటంలో దోహదపడుతుంది.
మల్బరీ లో అంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి: వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ గుణాలు శరీరం లోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే పలు రకాల దీర్ఘ కాలిక రోగాలు వస్తాయి. అంటి ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.
Health Benefits of Mulberry in Telugu – మల్బరీ వల్ల కలిగే ప్రయోజనాలు
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.