Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Health Benefits of Guava in Telugu – జామ పండు వల్ల కలిగే ఉపయోగాలు

Health benefits of Guava in Telugu – జామ పండు వల్ల కలిగే ఉపయోగాలు

జామ పండు యొక్క శాస్త్రీయ నామం సిడియం గుజావ (Psidium guajava). ప్రపంచ వ్యాప్తంగా జామపండు యొక్క ఉత్పత్తి 55 మిలియన్ టన్నులు అయితే ఇందులో 22 మిలియన్లు అంటే దాదాపు 45% కేవలం మన భారత దేశంలో ఉత్పత్తి చేయబడుతుంది.

జామ పండు లో ఉండే ఔషధ గుణాల కారణంగా పురాతన కాలం నుంచే దీనిని పలు రోకాల రోగాల కోసం ఉపయోగించేవారు. జామ పండుని పండించటం కూడా చాలా సులువు, వివిధ రకాల నెలలలో మరియు వాతావరణ పరిస్థుతులలో కూడా లక్షణంగా పండించవచ్చు.

Health Benefits of Guava in Telugu

ఒక 100 గ్రాముల జామపండులో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి.

పేరుమొత్తం
శక్తి (Energy) 68kcal
Vitamin A, IU624IU
నీరు  (Water)80.8g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)14.3g
షుగర్  (Sugars)8.92g
ఫైబర్  (Fiber)5.4g
ప్రోటీన్ (Protein)2.55g
కొవ్వు (fat)0.95g
పొటాషియం (Potassium)417mg
Vitamin C228mg
ఫాస్ఫరస్ (Phosphorus)40mg
మెగ్నీషియం  (Magnesium)22mg
కాల్షియం (Calcium)18mg
కోలిన్ (Choline)7.6mg
సోడియం (Sodium)2mg
Vitamin E0.73mg
లైకోపీన్ (Lycopene)5200µg
బీటా కారోటీన్ Beta carotene374µg
Vitamin K2.6µg

జామ పండు మరియు ఆకుల ఉపయోగాలు

  • జామ పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • జామ పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది
  • జామ పండు చర్మానికి సంబంచిన రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
  • జామ పండు జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
  • జామ పండు కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • జామ పండు శరీరంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది
  • జామ పండు మహిళలకు పీరియడ్స్ లో ఉపశమనమా ఇవ్వటంలో సహాయపడుతుంది
  • జామ పండు యొక్క ఆకులు పంటి యొక్క నొప్పిని తగ్గించటం లో సహాయపడుతుంది

జామ పండు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది: జామ పండులో ఉండే ఫైబర్ మరియు పొటాషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో దోహదపడుతుంది. ఒక పరిశోధనలో బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్న 145 మందిని రెండు గ్రూప్ లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ లో 73 మందిని పెట్టడం జరిగింది. నాలుగు వారాల తరవాత వీరిలో బ్లడ్ ప్రెషర్ తగ్గటాన్ని, కొవ్వు శాతం తగ్గటాన్ని మరియు తక్కువ శాతం లో HDL అంటే మంచి కొలెస్ట్రాల్ పెరగటం గమనించటం జరిగింది.

జామ పండు తో పాటు జామ చెట్టు ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. చాలా మంది లేత జామ ఆకులను చింతపండు తో కలిపి తింటారు, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొన్ని జంతువుల మీద జరిపిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటాని గమనించటం జరిగింది.

జామ పండు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది: ఒక పరిశోధన ప్రకారం ప్రతి రోజు 100 గ్రాముల జామ చెట్టు యొక్క ఆకుల డికాషన్ తాగటం వల్ల లంగ్ క్యాన్సర్ మరియు కడుపు కు సంబంచిన క్యాన్సర్ ల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. జామ పండు లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో దోహదపడుతుంది. ముఖ్యంగా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటంలో మరియు దెబ్బ తిన్న DNA ను బాగు చేయటానికి సహాయపడుతుంది.

జామ పండు చర్మానికి సంబంచిన రోగాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: పలు దేశాలలో జామ పండు యొక్క లేత రెమ్మలను చర్మానికి సంబంచిన వ్యాధులను నయం చేయటంలో వినియోగిస్తారు. జామ పండు ఆకులో ఉండే ఆంటీబాక్టీరియల్ గుణాల కారణంగా చర్మానికి సంబంచిన వివిధ సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. చర్మానికి కాలిన గాయాలు లేదా కోసుకు పోవటం వల్ల కలిగే గాయాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల నుంచి కాపాడటంలో జామ పండు ఆకుల ఎక్స్ట్రాక్ట్ సహాయపడుతుంది.

Health Benefits of Guava in Telugu

జామ పండు జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: జామ పండు లోని ఔషధ గుణాల కారణంగా జీర్ణ వ్యవస్థ కు సంబంచిన ఇన్ఫెక్షన్స్ అయిన అజీర్ణం, విరేచనాలు, కడుపునొప్పి లాంటి సమస్యల కోసం సాంప్రదాయక చికిత్స గా వినియోగిస్తారు. జామ పండు ఆకులు చర్మానికి కాకుండా జీర్ణ వ్యవస్థకు సంబంచిన సమస్యలకు కూడా సహాయపడుతుంది. ఇండియా లోని పలు ప్రాంతాలలో జామ చెట్టు యొక్క ఆకులను జీర్ణ వ్యవస్థకు సంభందించిన రోగాల కోసం వినియోగించటం జరుగుతుంది.

ఎలుకల పై జరిగిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ డయేరియా అంటే విరేచనాల సమస్య నుంచి కాపాడటంలో మరియు డయేరియా తీవ్రతను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇంతే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే జీర్ణాశయం లో కలిగే పుండు నయం చేయటం లో సహాయపడుతుంది.

జామ పండు కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: జామపండు లో ఉండే విటమిన్ C కంటి చూపుని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది మరియు వయసు పై బడిన వారిలో కంటికి సంబంచిన సమస్యలైనా మక్యూలర్ డిజనరేషన్ మరియు క్యాటరాక్ట్స్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

జామ పండు శరీరంలోని షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది: ఇండియా లోని పలు ప్రాంతాలలో జామ పండు మరియు ఆకులను డయాబెటిస్ కోసం ఒక రెమెడీ గా ఉపయోగించటం జరుగుతుంది. కొన్ని ఎలుకల పై జరిగిన పరిశోధనల ప్రకారం కూడా జామ పండు శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఇంకో 40 మంది పై జరిగిన క్లినికల్ ట్రయల్ లో జామ పండు బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. జపాన్ లో మంచి ఆరోగ్యం కోసం జామ చెట్టు యొక్క ఆకుల తో తయారు చేయబడ్డ టీ ను అమ్మటం కూడా జరుగుతుంది.

జామ పండు మహిళలకు పీరియడ్స్ లో ఉపశమనమా ఇవ్వటంలో సహాయపడుతుంది: పలు దేశాలలో జామ పండు, వీటి ఆకులను మరియు ఆకుల యొక్క డికాషన్ ను నొప్పి తో కూడిన పీరియడ్స్ ను తగ్గించటానికి వినియోగిస్తారు. ఒక పరిశోధనలలో 197 మహిళలపై జరిగిన ట్రయల్స్ ప్రకారం జామపండు యొక్క ఆకుల యొక్క ఎక్స్ట్రాక్ట్ పీరియడ్స్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గించటంలో సహాయపడుతుంది అని తెలిసింది.

జామ పండు యొక్క ఆకులు పంటి యొక్క నొప్పిని తగ్గించటం లో సహాయపడుతుంది: ఇండియా లోని ఉత్తర సిక్కిం లో జామ చెట్టు యొక్క లేత ఆకులను పంటి నొప్పిని తగ్గించడానికి మరియు నోటి యొక్క అల్సర్ లను తగ్గించటానికి ఉపయోగించటం జరుగుతుంది.

ల్యాబ్ లో జరిగిన పరిశోధనల ప్రకారం జామ చెట్టు యొక్క ఆకులలో ఉండే ఆంటీ బాక్టీరియల్ గుణాలు నోటి వ్యాధికారకాల నుంచి కాపాడటంలో మరియు ఇతర దంత సమస్యలైనా డెంటల్ కెరీస్ (dental caries) మరియు డెంటల్ ప్లేక్స్ (dental plaques) నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

Health benefits of Guava in Telugu – జామ పండు వల్ల కలిగే ఉపయోగాలు

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks