Menu Close

Health Benefits of Kiwi Fruit in Telugu – కివీ పండు వల్ల కలిగే ఉపయోగాలు

Health Benefits of Kiwi Fruit in Telugu – కివీ పండు వల్ల కలిగే ఉపయోగాలు

మనం తినే కూరగాయలు మరియు పండ్లలో చాలా పోషక విలువలు ఉంటాయి. కొన్ని పండ్లలో మాత్రం ఇతర పండ్ల కన్నా ఎక్కువ శాతం పోషక విలువలు ఉంటాయి. కివీ ఫ్రూట్ చూడటానికి చిన్నగా గుడ్డు ఆకారంలో ఉన్నా, వీటిలో అద్భుతమైన న్యూట్రియంట్లు ఉంటాయి.

Health Benefits of Kiwi Fruit in Telugu

100 గ్రాముల కివీ లో కింద చూపిన విధంగా పోషక విలువలు ఉంటాయి

పేరుమొత్తం
శక్తి (Energy) 61Cal
Vitamin A87IU
నీరు  (Water)83.1g
కార్బో హైడ్రేట్ (Carbohydrate)14.7g
షుగర్  (Sugars)8.99g
ఫ్రూక్టోజ్ (Fructose)4.35g
గ్లూకోజ్ (Glucose)4.11g
ఫైబర్  (Fiber)3g
ప్రోటీన్ (Protein)1.14g
కొవ్వు (fat)0.52g
పొటాషియం (Potassium)312mg
Vitamin C92.7mg
కాల్షియం (Calcium)34mg
ఫాస్ఫరస్ (Phosphorus)34mg
మెగ్నీషియం  (Magnesium)17mg
కోలిన్ (Choline)7.8mg
సోడియం (Sodium)3mg
Vitamin E 1.46mg
బీటైన్ (Betaine)0.5mg
నియాసిన్ (Niacin)0.341mg
ఐరన్ (Iron)0.31mg
లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin)122µg
కెరోటిన్ (Carotene)52µg
Vitamin K40.3µg
ఫోలేట్ (Folate)25µg
Vitamin A4µg
సెలీనియం (Selenium)0.2µg

కివీ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

  • కివీ లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి.
  • కివీ కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • కివీ ఫ్రూట్ ఆస్థమా ను నయం చేయటంలో సహాయపడుతుంది
  • కివీ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • కివీ ఫ్రూట్ మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
  • కివి ఫ్రూట్ మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ను నియత్రించటంలో సహాయపడుతుంది
  • కివి ఫ్రూట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడటంలో సహాయపడుతుంది
  • కివీ ఫ్రూట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది
  • కివీ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది
  • కివీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది

కివీ కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: పండ్లు మరియు కూరగాయలలో లుటిన్ మరియు జియాక్సంతిన్ (Lutein + zeaxanthin) సమృద్ధిగా ఉంటాయి. లుటిన్ మరియు జియాక్సంతిన్ మక్యూలర్ డిజెనరేషన్ అనే వయస్సు తో పాటు వచ్చే కంటికి సంబంధించిన సమస్యల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది. కివీ పండు లో కూడా లుటిన్ మరియు జియాక్సంతిన్ ఉంటాయి. ఫలితంగా కంటి యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతే కాదు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

కివీ ఫ్రూట్ ఆస్థమా ను నయం చేయటంలో సహాయపడుతుంది: కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ సి మరియు ఆంటీ యాక్సిడెంట్ గుణాలు ఆస్థమా నుంచి బాధపడేవారికి నయం చేయటంలో సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం కివీ ఫ్రూట్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే గురక లాంటి శబ్దాన్ని కూడా తగ్గించటంలో సహాయపడుతుంది.

కివీ ఫ్రూట్ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది: కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది. ఈ ఫ్రూట్ లో ఉండే ఎంజైమ్ ఆక్టినిడిన్ ప్రోటీన్లను బ్రేక్ డౌన్ చేసి జీర్ణ వ్యవస్థ లో సహాయపడుతుంది. ఫైబర్ కాన్స్టిపేషన్ అంటే మలబద్దకం సమస్యను మరియు మలం లో వచ్చే సమస్యలను నయం చేయటంలో సహాయపడుతుంది.

Health Benefits of Kiwi Fruit in Telugu

కివీ ఫ్రూట్ మన శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టం ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది: 19 సంవత్సరాలు దాటిన వారికి రోజుకి 90 మిల్లి గ్రాముల విటమిన్ C అవసరం. అయితే ఒక 100 గ్రాముల కివీ పండు లో 92 మిల్లీ గ్రాముల విటమిన్ C ఉంటుంది. కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C ఇమ్మ్యూనిటీ ని బూస్ట్ చేయటంలో సహాయపడుతుంది. ఈ పండు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

కివి ఫ్రూట్ మన శరీరంలో బ్లడ్ ప్రెషర్ ను నియత్రించటంలో సహాయపడుతుంది: రోజుకి మూడు కివీ పండ్లు తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ ను తగ్గించటంలో సహాయపడుతుంది. ఇంతే కాకుండా గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యలైన గుండెపోటు ను తగ్గించటంలో సహాయపడుతుంది. కివీ ఫ్రూట్ లో ఉండే పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.

కివి ఫ్రూట్ బ్లడ్ క్లాట్ అవ్వకుండా కాపాడటంలో సహాయపడుతుంది: మన శరీరంలో బ్లడ్ క్లాట్ అంటే రక్తం గడ్డ కట్టడం వల్ల గుండె కు సంబంధించిన రోగాలైన గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది. కివీ లో ఉండే ఆంటీ ప్లేట్లెట్ గుణం కారణంగా రక్తం గడ్డ కట్టకుండా కాపాడటంలో సహాయపడుతుంది.

కివీ ఫ్రూట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది: కొల్లాజిన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడే ముఖ్యమైన న్యూట్రియంట్, కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ C కొల్లాజిన్ తయారీ లో ముఖ్య పాత్ర వహిస్తుంది. విటమిన్ C గాయాలను త్వరగా నయం చేయటం లో కూడా సహాయపడుతుంది. కివీ లో ఉండే విటమిన్ E చర్మాన్ని సూర్యుని నుంచి హాని చేకూర్చే కిరణాల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.అంతే కాకుండా రోగాల నుంచి మన శరీరానికి సహజ రక్షణ కలిపిస్తుంది.

కివీ క్యాన్సర్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: మన శరీరంలో క్యాన్సర్ డిఎన్ఏ లో కలిగే మార్పుల వల్ల వస్తుంది అయితే ఫ్రీ రాడికల్స్ కూడా మన శరీరంలో డిఎన్ఏ ను నష్ట పరుస్తుంది. విటమిన్ C లో ఉండే అంటి యాక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతాయి. కివీ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల కు వ్యతిరేకంగా పనిచేయటంలో సహాయపడుతుంది.

కివీ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది: కివీ లో ఉండే విటమిన్ K మరియు కాల్షియం ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. మన శరీరం విటమిన్ K ను ఎముకల నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. ఈ విటమిన్ K ఆస్టియోపొరాసిస్ అనే ఎముకల రోగం నుంచి కూడా కాపాడటంలో సహాయపడుతుంది.

Health Benefits of Kiwi Fruit in Telugu – కివీ పండు వల్ల కలిగే ఉపయోగాలు

గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల నుండి సేకరించ బడినది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు. వీటిని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images