Menu Close

Turmeric Health Benefits in Telugu – పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

Turmeric Health Benefits in Telugu – పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

పసుపు మన అందరి వంటింట్లో ఉంటుంది, ప్రతి వండే కూరలో కాసింత పసుపు తప్పకుండ వేస్తారు. పసుపు వంటకే పరిమితం కాకుండా పెళ్లిళ్లలో మరియు శుభ కార్యాలలో వినియోగించటం జరుగుతుంది. ఆసియలో పసుపును అత్యధికంగా వినియోగించటం జరుగుతుంది. మన దేశంలో ఆరోగ్య పరంగా చాలా కాలంగా పసుపును ఉపయోగిస్తూ వస్తున్నాము.

ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రుజువు అయ్యింది. పసుపు లో కర్క్యుమిన్ (Curcumin) అనే ఆక్టివ్ కాంపౌండ్ ఉంటుంది, దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి.

మనము పసుపు ను సేవించినప్పుడు, దీనిలో ఉండే కర్క్యుమిన్ శరీరంలోని రక్తంలో సరిగా కలవదు. అందుకే పసుపును మిరియాలతో తీసుకున్నట్లైతే మిరియాలలో ఉండే పైపెరిన్ కర్క్యుమిన్ ను మన రక్తంలో ఎక్కువ మోతాదులో కలవటానికి సహాయపడుతుంది.

Turmeric Health Benefits in Telugu

పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పసుపు డయాబెటిస్ నుంచి కాపాడటంలో సహాయపడుతుంది: కొన్ని అధ్యయనాల ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ (curcumin) అనే కాంపౌండ్ డయాబెటిస్ ను నయం చేయడానికి లేదా నివారించడానికి సహాయపడుతుంది. ఒక పరిశోధనలో టైపు 2 డయాబెటిస్ బారిన పడ్డ ఎలుకలకు కిలో శరీర బరువు కి 80mg/kg చొప్పున కర్క్యుమిన్ ను 45 రోజులు పాటు ఇవ్వటం జరిగింది. ఫలితంగా ఎలుక రక్తంలోని షుగర్ లెవెల్స్ గణనీయంగా తగ్గాయి మరియు ఇన్సులిన్ లెవెల్స్ పెరిగాయి.

పసుపు లో ఉండే ఆంటీ – ఇంఫ్లమ్మెటరీ (anti-inflammatory) మరియు ఆంటియాక్సిడెంట్ గుణాల కారణంగా డయాబెటిస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది. ఈ పరిశోధన కేవలం ఎలుకల పైనే చేశారు, మనుషుల మీద కర్క్యుమిన్ ప్రభావం ఎలా ఉంటుందో ఇంకా తెలియాల్సి ఉంది.

పసుపు కాన్సర్ ను నిరోధించటం లో సహాయపడుతుంది: కాన్సర్ వ్యాధి వల్ల మన శరీరంలోని కణాలు అదుపు లేకుండా పెరుగుతాయి. కాన్సర్ లో వివిధ రకాలు ఉన్నాయి. పసుపు లో ఉండే కర్క్యుమిన్ వివిధ రకాల క్యాన్సర్ల రకాల పై ప్రభావం చూపిస్తుంది. కణాల ఎదుగుదలను మరియు పురోగతి ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఇంతకూ ముందు చెప్పిన విధంగా పసుపును మిరియాలతో పాటు తీసుకుంటే మిరియాలలో ఉండే పైపరిన్ పసుపును కాన్సర్ ను నయం చేయటానికి సహాయపడుతుంది. ఇంతేకాకుండా కాన్సర్ మన దగ్గరికి రాకుండా కూడా నివారిస్తుందని కూడా ఆధారాలు ఉన్నాయి.

పసుపు గుండెకు సంబంచిన రోగాలను తగ్గించడంలో సహాయపడుతుంది: పసుపు లో ఉండే కర్క్యుమిన్ గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగపరచటానికి సహాయపడుతుంది. పసుపు గుండె లోని ఎండోతెలియం (endothelium) ను బాగా పనిచేసే విధంగా చేస్తుంది. ఎండోతెలియం సరిగా పనిచేయకపోవడం వల్లనే మనకు గుండెకు సంబంచిన రోగాలు వస్తాయి. గుండెకు సంబంచిన చాలా రకాలైన రోగాల ప్రక్రియలను ఆపటంలో మరియు వ్యతిరేకంగా పనిచేయటంలో పసుపు సహాయపడుతుంది.

పసుపు లో ఉండే కర్క్యుమిన్ అల్జీమర్స్ రోగం ను నయం చేయడానికి సహాయపడుతుంది: అల్జీమర్స్ డెమెన్షియా అనే రోగం యొక్క మరొక రూపం. 60–70% డెమెన్షియా రోగులు అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ రోగం లో మనుషులు జ్ఞాపకశక్తి ని కోల్పోతూ ఉంటారు. ఇది ఎక్కువగా వయసు పై బడిన వారిలో అంటే దాదాపు 60 సంవత్సరాల వారిలో ఈ రోగం వస్తుంది.

ఈ వ్యాధికి ఇంతవరకు ఎలాంటి చికిత్స లేదు, కేవలం లక్షణాలను తక్కువ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.

ఈ రోగం బారిన పడ్డప్పుడు మెదడు వాపు మరియు ఆక్సీకరణం దెబ్బ తింటుంది.

పసుపు లో ఉండే ఆంటీ – ఇంఫ్లమ్మెటరీ (anti-inflammatory) మరియు ఆంటియాక్సిడెంట్ గుణాలు అల్జీమర్స్ రోగం బారిన పడ్డ వారికి సహాయపడుతుంది.

ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) చికిత్సలో పసుపు సహాయ పడుతుంది: ఆర్థరైటిస్ అనే వ్యాధి కీళ్ల నొప్పులకు సంబంధించినది. ఈ వ్యాధి లో దాదాపు 100 రకాలు ఉన్నాయి. ఈ వ్యాధి వల్ల కీళ్లలో వాపు, నొప్పి మరియు బిరుసు తనం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

ఒక అధ్యయనం ప్రకారం 8 – 12 వారాల వరకు పసుపు లో ఉండే కర్క్యుమిన్ ను 1000mg/day తీసుకోవటం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలైన నొప్పి మరియు వాపు ను తగ్గించటంలో సహాయపడింది. ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు కేవలం లక్షణాలను తగ్గించటమే ప్రస్తుతం ఉన్న మార్గం. పసుపు పై ఇప్పటి వరకు కొన్ని పరోశోధనలు మాత్రమే జరిగాయి కాబట్టి ఒక నిర్ణయానికి రావటం మరియు పసుపు ఆర్థరైటిస్ ను తగ్గిస్తుందని పూర్తిగా చెప్పలేము. ఇంకా పెద్దమొత్తంలో పరిశోధనలు జరిగితే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.

డిప్రెషన్ బారిన పడ్డ వారికి కూడా పసుపు సహాయపడుతుంది: WHO ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చాలా 30 కోట్ల మంది డిప్రెషన్ కారణంగా బాధ పడుతున్నారు. కొన్ని క్లినికల్ ట్రయల్స్ ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ ఆంటి డిప్రెసెంట్ (antidepressant) గా కూడా పనిచేస్తుందని తెలిసింది.

పసుపులో ఉండే కర్క్యుమిన్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలలో ఒక చికిత్స గా సహాయపడుతుంది. డిప్రెషన్ తో బాధపడుతున్న 60 మందిని మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కు fluoxetine (20 mg) అనే ఆంటిడిప్రెసెంట్ ఇవ్వడం జరిగింది. రెండవ గ్రూప్ కు కేవలం కర్క్యుమిన్ (1000 mg)ను ఇవ్వటం జరిగింది. మూడవ గ్రూప్ కు fluoxetine మరియు కర్క్యుమిన్ ను ఇవ్వటం జరిగింది.

ఈ పరిశోధన ప్రకారం fluoxetine మరియు కర్క్యుమిన్ ను కలిపి తీసుకున్న వారిలో చాలా మార్పు కనిపించింది. దీనిని బట్టి కర్క్యుమిన్ డిప్రెషన్ తో బాధపడుతున్న వారికి ఆంటిడిప్రెసెంట్ గా సహాయపడుతుందని చెప్పవచ్చు.

Turmeric Health Benefits in Telugu

పసుపు చర్మ ఆరోగ్యాన్ని పెంచటంలో సహాయపడుతుంది: పసుపులో ఉండే కర్క్యుమిన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పసుపు లో టాక్సిన్ లు ఉండవు ఎక్కువ మోతాదులో తీసుకున్న కూడా టాక్సిన్లు ఉండకపోవటం వల్ల చాలా వరకు దీనిని ఔషధం రూపంలో వినియోగించటం జరుగుతుంది.కర్క్యుమిన్ చర్మానికి సంబంధించిన రోగాలైన psoriasis మరియు స్కిన్ కాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. కర్క్యుమిన్ గాయాలను త్వరగా మానడానికి మరియు వాపు కి వ్యతిరేకంగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

పసుపు దీర్ఘ కాలిక వ్యాధులనుంచి కాపాడటంలో సహాయపడుతుంది: మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ కారణంగా అనేక దీర్ఘ కాలిక రోగాలైన డయాబెటిస్ మరియు కాన్సర్ వస్తాయి. పసుపులో ఉండే ఆంటి యాక్సిడెంట్ మరియు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గుణాల కారణంగా దీర్ఘ కాలిక రోగాలైన ఊబకాయం, డయాబెటిస్, కాన్సర్, డిప్రెషన్, ఆర్థరైటిస్, చర్మ రోగాలపై చాలా బాగా ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. పసుపు పై ఇంకా బాగా పరిశోధనలను చేస్తే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకునే అవకాశం ఉంది.

పసుపు ఆంటి యాక్సిడెంట్ గా పనిచేయటంలో సహాయపడుతుంది: ఆక్సీకరణ వల్ల మన శరీరానికి చాలా నష్టం జరుగుతుంది మరియు అనేక రోగాలకు దారి తీస్తుంది. పసుపు లో ఉండే ఆంటి యాక్సిడెంట్ గుణాల కారణంగా ఫ్రీ రాడికల్స్ నుంచి మన శరీరానికి జరిగే నష్టం నుంచి కాపాడటంలో సహాయపడుతుంది

పసుపు ఆంటి ఇంఫ్లమ్మెటరీ గా పనిచేయటంలో సహాయ పడుతుంది: ఇంఫ్లమేషన్ అంటే శరీరం వాపు కి గురి అవ్వటం, ఈ వాపు కారణంగానే చాలా రకాలైన దీర్ఘ కాలిక సమస్యలు వస్తాయి. పసుపు లో ఉండే ఆంటి ఇంఫ్లమ్మెటరీ గుణాల కారణంగా అనేక దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి కాపాడటంలో సహాయపడుతుంది.

Turmeric Health Benefits in Telugu – పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images