Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

కళ్ళారా చూసుకుంటాము, కరువు తీరా మా ప్రేమను పంచుతాము – Telugu Stories

Telugu Stories, Telugu Kadhalu, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories

కథ: ప్రేమ పొదరిల్లు – నచ్చితే తప్పకుండా షేర్ చెయ్యండి

అంగరంగ వైభవం గా వసుంధర..రామ్ ల పెళ్లి.. జరుగుతోంది…పెళ్లి లో ఆడ పెళ్లి వారికి మర్యాదలు తక్కువ అయ్యాయని…ఆడ పెళ్లి వారు… గుసగుసలాడుకోవటం…వసుంధర చెవిన పడింది…అదే సమయం లో…వసుంధర కు పిన్ని వరసయ్యే శాంతి…” “ఇదిగో వసు…నీకు కాబోయే భర్త మంచివాడు అయినప్పటికీ..ఆతని తల్లి మాత్రం కొంచెం ఘటికురాలు.. లాగుంది… రామ్ ను చూడు..ఎంత సేపు తల్లి కొంగు పట్టుకునే తిరుగుతున్నాడు…

పెళ్ళికూతురు అయిన నిన్ను కనీసం పట్టించుకోవడం లేదు..ఇలా అయితే .రేపు మీ సంసారం ఎలా వుంటుందో ..ఏమో” అంది నిష్టూరంగా..వింటున్న వసు …. మనసు బాధ తో రగిలిపోయింది..నిజమే.. రామ్ తనతో ఎక్కువ … సమయం..గడపడం లేదు..ఎంతసేపు తల్లి చుట్టే…పెళ్లికూతుర్ని చేసేటపుడు…గోరింటాకు పెట్టించుకునేటపుడు..

రామ్ దృష్టిలో పడాలని..తను మెచ్చుకోవాలి అని ఎంతగానో ఆశ పడింది..కానీ తన ఆశ అడియాస అయింది…వసుంధర మనసులో అప్పుడే ..అంతర్గతంగా ఒకరకమైన నిర్లిప్తత..నిర్లక్ష్యం చోటు చేసుకుంది…సుమారు..పెళ్లి కుదిరినప్ప టి నుండి..దాదాపుగా..రెండు నెలలు గా..ఇదే… తంతు…వసుంధర కు మనసు …స్టవ్ మీద ఉడికే అన్నం లా..కుత కుతలాడి పోతోంది…ఇక పెళ్లి పట్టుచీర దగ్గర కూడా ఇదే గొడవ….

ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అయినా..చాలా పెద్ద ప్రభావాన్నే చూపిస్తాయి…పెళ్లి తర్వాత..మొదట్లో ఒక్కసారి వెళ్లడమే..తరువాత ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.. రామ్ ను కూడా వెళ్లనీయలేదు ..పండుగ ల సమయం లో కూడా….రామ్ ఒకసారి ..వెల్లొచ్చినందుకు…పెద్ద గొడవే చేసింది వసుంధర..,ఇక తీరిక దొరకని ఉద్యోగాలు…నిజానికి వసుంధర తో గొడవ పడటం.. రామ్ కు కూడా చాలా ఇబ్బందిగా అనిపించినా…వసుంధర గర్భం దాల్చడం…హై బి పి ..తో వుండడం..డాక్టర్ సలహా వల్ల…రామ్ కూడా వసుంధర చెప్పినట్లే నడచుకునేవాడు..

కానీ రామ్ కు..మనసు పొరల్లో….తన తల్లి గుర్తొస్తే…తల్లి ప్రేమ మాధుర్యం..తన హృదయాన్ని కరిగించేసి..కనుల ను తడిపే సేది…ఈ విషయం …రామ్ తల్లి పసిగట్టింది…ఎంతో వేదన కు లోనయ్యింది..కాలం గడిచింది.పోస్ట్ మ్యాన్ పోస్ట్ అనగానే వసుంధర చాలా ఆశ్చర్యానికి లోనయ్యింది..ఈ కాలం లో ఈ పోస్ట్ ఎక్కడి నుండి అని.అడ్రస్ చూసింది..అది తన అత్తగారు దగ్గర నుంచి అనగానే…ఆశ్చర్య పోయింది….

తన చంటి బిడ్డ నిద్రపోగానే…మెల్లగా లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది..ప్రియమైన వసుంధర కుదీవించి వ్రాయునది….నేను క్షేమం..నువ్వు..రామ్ ..క్షేమంగా ఉన్నారని…ఉండాలని..ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న…మొబైల్ టెక్నాలజీ పెరిగి పోయినా.ఉత్తరం రాస్తున్న.,..లెటర్ ను సాంతం చదువు..కోపం తో చదవడం ఆపకు .నీకు కొన్ని విషయాలు తెలియాలి…చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది…నా పెళ్లయిన కొత్తల్లో మాది ఉమ్మడి కుటుంబం…అప్పటికే…మా ఊరి లో చదువుకున్న అమ్మాయి ని…నేను ఒక్కదాన్నే……అత్తగారు..మామ గారు..ఇద్దరు బావ గార్లు..ఇద్దరు తోటి కోడళ్ళు..ఇంకా పెళ్లి కాని ముగ్గురు మరుదు లతో..ఇల్లంతా పండుగ వాతావరణం లా ఉండేది…

ఇంట్లో పాడి పశువులు ..పొలాలు..పంటలు పండిస్తు…క్షణం తీరిక లేకుండా…డబ్బుకు కొదవ లేకుండా ఉండేది…అదేంటో పెళ్లయిన ఆరేళ్లకు కూడా నాకు పిల్లలు పుట్టలేదు..అదే సమయం లో మా చిన్న బావ గారి కొడుకు..రామ్…తన తల్లి సులోచన…దగ్గర కంటే కూడా నా దగ్గరే ఎక్కువ ఇష్టంగా ఉండేవాడు….దానికి కారణం వుంది…మా చిన్న తోటి కోడలు సులోచన కి.. ముగ్గురు పిల్లలు…అయినప్పటికీ అనుకోకుండా గర్భం నిలిచింది…

వాళ్ళు ఇంక పిల్లలు వద్దు అనే ఉద్దేశం లో ఉన్నారు…అప్పుడే నాకొక అలోచన వచ్చింది…ఎలాగోలా ఆ బిడ్డను కని..నాకు ఇచ్చేయమని..సులోచన ను అడిగాను…అందుకు సులోచన ఒప్పుకుంది…కారణం..అప్పటికే సులోచన కు అయిదవ నెల దాటింది…గర్భం పోగొట్టడం అంటే..సులోచన ప్రాణాల మీదికి వస్తుంది అని డాక్టర్ లు చెప్పారు..దాంతో గత్యంతరం లేక …బిడ్డను ప్రసవించింది…

పొత్తిల్ల లోనే బాబు ను నాకు ఇచ్చింది….పైగా..బాబు కు తల్లి పాలు లేవు…ఇక అప్పటి నుండి పోత పాలు…నా బిడ్డ రామ్ ను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను…. నేల న నడిస్తే మట్టి అంటుకుంటుందేమో…అన్నంత మురిపెంగా పెంచుకున్నాను.. ఇంటెడు పనులు.. ఒంటి చేత్తో చేసేదాన్ని….ఎప్పుడు బాబు ధ్యాసే…..బాబు ను వదిలి పెట్టింది లేదు.నా బంగారు తండ్రి రామ్..నన్ను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేవాడు కాదు…ముద్దు ముద్దు మాటలతో…చిలిపి చేష్టల తో ఎంతో అమాయకంగా..మరెంతో ప్రేమ గా నా చుట్టూ తిరుగుతూ..నన్నల్లుకున్న..ప్రేమ పూల తోటలా…అంటి పెట్టుకొని వుండేవాడు…

ఇలా ఉండగా..ఒక రోజు ..అకస్మాత్తు గా…రామ్ కు అమ్మ వారు పోసింది…జ్వరం తో..ఒళ్ళు కాలిపోయేది…వేప మండలు వేసి పడుకోబెట్టి..రాత్రనక..పగలనక..కంటి కి రెప్పలా నా బిడ్డ ను కాపాడు కున్నాను… పది కిలోమీటర్లు దూరం నడిచి…శివుని గుళ్ళో పూజలు చేసుకుని..ఆ అడవిలో వుండే నిప్పుల గుండం లో నడిచి వచ్చాను..చెప్పులు కూడా లేకుండా అంత దూరం..రాళ్ళు రప్పలు అనుకోకుండా నడవడం తో ..నా కాళ్ళు వాచిపోయి…ఒక వారం పాటు నడవలేక పోయాను…

ఆ రోజులు నాకు ..నా రామ్ కు నరకాన్ని పరిచయం చేశాయి…కొన్ని రోజులకు రామ్ మామూలు అయిపోయాడు.. కానీ అసలు సమస్య తరువాత మొదలైంది…చిన్నారి రామ్..కు.నాతో పెనవేసుకున్న అనుబంధం…సులోచన కు కంటగింపు గా మారింది…తన బిడ్డ ను తనకు ఇచ్చేయ వలసిందిగా గొడవ. పెట్టుకుంది…అత్తయ్య..మామయ్య..ఇంకా పెద్దలు అందరు..ఎంత చెప్పినా…వినకుండా గోల గోల చేసి గొడవ పెట్టుకుంది…నన్ను.. రామ్ ను విడదీసింది….ఉమ్మడి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది..రామ్ ను తీసుకుని దూరంగా వెళ్లిపోయింది.. ..నేను బాబు మీద దిగులు తో…అనారోగ్యం తో మంచాన పడ్డాను…అంతే..అక్కడ కూడా బాబు…అన్నం నీళ్ళు మాని…” అమ్మా..అమ్మా అంటూ నన్ను కలవరిస్తూ…దిగులు పెట్టేసుకున్నాడు…

విపరీతమైన జ్వరం..సులోచన దగ్గరికి తీసుకుందాం అన్నా..సులోచన దగ్గరికి వెళ్లడు…”అమ్మా.. అమ్మా..అంటూ కలవరింతలు..స్పృహలో లేడు… అప్పటికప్పుడు బాబు ను నా దగ్గరికి తీసుకొచ్చి వదిలి పెట్టారు…నన్ను చూడగానే…ఏడుస్తూ నన్ను చుట్టేసాడు…ఒకటే ఏడుస్తూ ” అమ్మా..నన్నొదిలి వెళ్ళకు…అంటూ..ఒకటే బాధ పడుతున్నాడు…నా మనసు ద్రవించింది పోయింది..నా చిట్టి తండ్రి తిరిగి నా దగ్గర కొచ్చేసాడు…ఈ సారి సులోచన మా ఆస్తిలో సగం వాటా రాయించుకుని…బాబు ను శాశ్వతం గా మాకు వదిలేసింది…

ఆస్తి పోయినా బాబు చాలు అనుకున్నాం…తర్వాత ఎవరి కుటుంబాల్లో వాళ్ళం బిజీ అయిపోయాం…రామ్ ను స్కూల్ కు పంపడం…మధ్యాహ్నం వెళ్లి భోజనం తినిపించడం…సాయంకాలాలు స్కూల్ నుండి ఇంటికి తీసుకు రావడమే కాక..వాడి ముద్దు మాటలు..అల్లరి…వాడితో అనుబంధం…పిల్లలు లేని నాకు …మధురమైన మాతృ అనుభూతి ని ఇచ్చింది..ఎంతలా అంటే..ఈ జన్మకి ఇది చాలు అనిపించేంత…నా బిడ్డ అంటే నాకు పంచ ప్రాణాలు…మీ పెళ్లి జరిగిన తర్వాత రెండు సంవత్సరాల కు గాను..నా బిడ్డ కేవలం రెండు సార్లు మాత్రమే …ఊరికి వచ్చాడు..అది కూడా ఒంటరిగా…వసు…నువ్వు కోపగించుగోకు… నీ సంవత్సరం వయసున్న బిడ్డ ను..నువ్వు ఎలా ప్రేమిస్తున్నా వో…ఒక్క క్షణం కూడా వదిలి…నువ్వు..ఎలాగైతే వదిలి ఉండలేవో..నేను కూడా అంతే కదమ్మా…

మావి ముసలి ప్రాణాలు…మా ప్రాణం అంతా..మా బిడ్డ రామ్ చుట్టే పెనవేసుకుని వుంటుంది…ఈ వయసులో మా బిడ్డ …మమ్మల్ని చుడాలనుకోక పోవడం..కనీసం పలకరించక పోవడం..తట్టుకోలేము…మేమేమీ..నీకు శత్రువులం కాదు తల్లి..నిష్కారణంగా .. రామ్ ను మాతో కలవ నివ్వకుండ చేస్తున్నావు..ఇది నీకు న్యాయం కాదు వసు…నిన్న గాక మొన్న పుట్టిన.. నీ చంటి బిడ్డ ను వదిలి నువ్వు ఉండలేవు…మరి ఇన్నేళ్ళు..నా బిడ్డే లోకంగా పెరిగిన నేను…నా బిడ్డను వదిలి ఎలా బ్రతక గలను అనుకుంటున్నా వు…మేము చేసిన తప్పేంటి..వాడికి తల్లి దండ్రి అవ్వడమా…అయినా మమ్మల్ని విడదీసే హక్కు నీకెక్కడిది…ఒక తల్లి బిడ్డను .వేరు చేస్ హక్కు ఎవరికీ లేదు…నువ్వొక సారి ఆలోచించు….రామ్ నిన్ను ప్రేమిస్తున్నాను .పెళ్లి చేసుకుంటాను అన్నపుడు నేను కానీ..మీ మామ గారు కానీ..పల్లెత్తు మాట అనలేదు..

నా బిడ్డ నిన్ను ఎంతో ప్రేమించాడు..నువ్వు లేకుండా బతకలేను అన్నాడు..మాకు మా రామ్ సంతోషం ముఖ్యం .అందుకే మీ పెద్దల్ని కూడా ఒప్పించి పెళ్లి చేసాము..పెళ్లి లో జరిగిన ఏదో చిన్న పొరపాటు ను మనసు లో పెట్టుకుని…నన్ను నా బిడ్డ ను వేరు చేసి సాదిస్తున్నావు..ఇది కరెక్ట్ యేన…దూరం చేయాలంటే చిన్న చిన్న మాటలతో అపార్థాలు సృష్టించి..ఎంతటి బంధాన్ని అయిన..తుంచేయవచ్చు..ఇప్పుడు నువ్వు చేసింది కూడా అదే….నిన్ను వేడుకుంటున్నా …నాకు నా బిడ్డ ప్రేమ ను బిక్ష గా పెట్టు తల్లి…ఇంకేమి అడగను..నా బిడ్డ ను చూడకుండా నేను ఉండలేను…నీకు మేము నచ్చక పోతే… మా మొహాలు చూడకు..నిన్ను ఇబ్బంది పెట్టం…కానీ..రెండు నెలలకు ఒకసారి మా రామ్ ను మా దగ్గరికి పంపు..కళ్ళారా చూసుకుంటాము…కరువు తీరా మా ప్రేమను మా బిడ్డ కు పంచుతాము…

నా బిడ్డ లేకుండా..నా బిడ్డకు నచ్చినవి వండి పెట్టకుండా..మాకు ఏ పండుగ సంతోషంగా జరగదు…నా బాధ ను నువ్వు తెలుసుకోవాలనే ఇలా ఉత్తరం రాశాను..నన్ను అత్తలా కాకుండా..ఒక స్త్రీ స్థానం లో..నా బాధ ను అర్థం చేసుకుంటావా….ఈ విషయం రామ్ తో చెప్పకు…అసలే..వాడు ఇప్పటికే….మమ్మల్ని వదిలి ఉండలేక….నీ మనసు ను బాధ పెట్టి…మా దగ్గరికి రాలేక…మనసు తో ఒక యుద్ధాన్ని చేస్తుంటాడు..పిచ్చి తండ్రి…నా మనవడికి నా ముద్దులు..నీకు రామ్ కు ఆశీస్సులు..మీ రాక కోసం మా ముసలి ప్రాణాలు ఎదురు చూస్తుంటాయి..లెటర్ చదవడం పూర్తవగానే..కంటి నుండి జారే కన్నీటిని ఆపలేక పోయింది వసుంధర….సాయంత్రం ఆఫీస్ నుండి రామ్ వచ్చే సమయానికి..మరుసటి రోజుకి..అత్తగారి ఊరికి ..తనకు రామ్ కు ట్రైన్ టికెట్స్ బుక్ చేసి.. రామ్ ను ఆశ్చర్యం లోనూ..ఆనందం లోనూ ముంచెత్తింది…అప్పటి నుండి ఆ ఇల్లు అపార్థాల పొరలు తొలగి…ప్రేమ పూల తో పొదరిల్లు గా అల్లుకుంది.

సమాప్తం

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks