అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
Telugu Moral Stories
హాస్పిటల్లో ఆదుర్దాగా తిరుగుతున్న యువకుడిని ఒక వృద్ధుడి మంచం దగ్గరికి తీసుకెళ్లి, “తాతా! ఇదిగో నీ కొడుకు!!” అని చెప్పింది నర్స్. ఆ మాట ఎన్నో సార్లు చెప్పిన తర్వాత వృద్ధుడు కళ్ళు తెరిచాడు. ఆయన మత్తు మందుల ప్రభావంతో ఉన్నారు.
నెమ్మదిగా కళ్ళు తెరిచి యువకుడిని చూశారు. నెమ్మదిగా చెయ్యి పట్టుకుని, ప్రేమగా ఆప్యాయంగా నిమరసాగాడు. ఆ యువకుడు కూర్చోడానికి ఒక కుర్చీ వేసింది నర్స్. యువకుడు ప్రేమగా వృద్ధుడికి ధైర్యాన్ని అందిస్తూ, ఆ చెయ్యి పట్టుకుని రాత్రంతా పక్కన కూర్చునే ఉన్నాడు.
అప్పుడప్పుడు ఆ యువకుడిని వెళ్ళిపొమ్మని తాము చూసుకుంటామని నర్స్ చెప్పింది. అయినా యువకుడు కదల్లేదు. తెల్లవారేసరికి వృద్ధుడు ప్రశాంతంగా కన్నుమూశాడు, ఆ యువకుడు చేతిలోనే. ఆ విషయాన్ని నర్స్ కు తెలియజేశాడు, పెద్దాయన చేతిని నెమ్మదిగా వదిలించుకుంటూ.
తదనంతర కార్యక్రమాలు చేసేవరకు అక్కడే నిలబడ్డాడు. ఆ తర్వాత నర్స్ యువకుడికి ధైర్య వచనాలు చెప్పింది. “ఆయన మీ తండ్రి అనుకుంటాను!” “లేదు సిస్టర్, ఆయనను నాకు ఏ సంబంధం లేదు. ఆయన ఎవరో తెలియదు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.” ఆశ్చర్య పోయింది సిస్టర్, “అయితే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తుంటే నువ్వెందుకు వారించలేదు.”
“ఎక్కడో పొరపాటు జరుగుతోంది, అని తెలిసింది. అయితే ఆయనకు ఆయన కొడుకు అవసరాన్ని గమనించి నేను ఏం మాట్లాడలేకపోయాను. ఆయన నన్ను గుర్తు పట్టలేదు కూడా! ఆయన దగ్గర ఆగిపోయాను.నేను ఆయన కొడుకుని కాదు అని కూడా అనలేకపోయాను.
సేకరణ – V V S Prasad