Menu Close

ఆడపిల్లపై లైంగిక దాడులు ఎప్పటికీ ఆగవు – Rapes in India

Rapes in India
A Woman raped in bus,
A School student raped,
A College Student was raped by her friends,
Father raped his own daughter,
10 year old boy rapes minor girl,
60 year old man rapes minor girl,
20 year old boy rapes 70 year old lady

మనం పొద్దున లేస్తే వినపడే సుప్రభాత గీతాలు ఇవి, గణాంకాల ప్రకారం కేవలం 2020 ఒక్క సంవత్సరంలోనే 28 వేలకు పైగా లైంగిక దాడులు జరిగాయి, వీటికి కారణం మనలోని ప్రతి ఒక్కరూ..! కాదంటారా ఈ ఆర్టికల్ పూర్తి గా చదివి చెప్పండి అదే మాట..

gang-rape

ఎన్ని భయంకరమైన చట్టాలు వచ్చినా,
ఎంతమందిని కఠినంగా శిక్షించినా,
మన దేశంలోనే కాదు ఏ దేశంలోనూ
ఈ లైంగిక దాడులు ఆగవు…..

మనిషిని భయపెట్టి అతని వాంఛను, భావోద్వేగాలను అదుపు చెయ్యలేము, కేవలం విచక్షణను, చిన్నతనం నుండి మంచి చెడులు మధ్య బేధం, ప్రతి ఒక్కరిని గౌరవించాలని ఆలోచన ద్వారా మాత్రమే ఆపగలం, అది మన తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయులు మాత్రమే చెయ్యగలరు…

Women Safety Rape

దురదృష్టం కొద్దీ మన దేశం పేదరికంలో వుండడం వల్లనే ఎక్కువ శాతం తల్లితండ్రులకి వారి పనులతోనే సమయం గడిచిపోతుంది. పిల్లలతో కలిసి గడిపే సమయం చాలా తక్కువగా వుంది, ఇంకా పిల్లలకి మంచి నడవడికను అలవాటు చెయ్యడం కుదరడం లేదు.

అందులోనూ సగానికి పైగా 35 నుండి 50 వయసు వారిలోను చాలా మందిలో విజ్ఞత కరువైంది. అంటే వారికి కూడా మంచి నడవడిక లేదు అని నా అభిప్రాయం, ఈ మధ్య కాలంలో వింటూనే ఉంటున్నాం కన్న తండ్రే కూతురిపై లైంగిక దాడి అని, ఇది ఆ వయసు వారి ఆలోచనలకు అద్దం పడుతోంది.
ఇది కూడా వా..రి తల్లితండ్రులు మరియు ఆ నాటి పరిస్థితుల వల్లనే..

gang-rape

ఇక మన విద్యా సంస్థల గురుంచి చెపాల్సిన అవసరమే లేదు, కేవలం మార్కులే ప్రాధాన్యంగా చదువులు సాగుతున్నాయి. సంస్కారం, మంచి చెడులు గురుంచి మాట్లాడే వారే లేరు ఈ పాఠశాలలో.. అలాంటప్పుడు ఇంకా ఈ తరంలో ఎలా మార్పు వస్తుంది, భవిష్యత్తులో మెరుగైన సమాజాన్ని చూడగలం అని ఎలా ఆశించాలి.

ఒకే ఒక్క మార్గం మనం అందరం కలిసి కట్టుగా ప్రయత్నిస్తే తప్ప ఒక మెరుగైన సమాజాన్ని నిర్మించలేము..
మనలోని ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారి పిల్లలకి చిన్న తనం నుండే మంచి సంస్కారాన్ని అలవాటు చెయ్యాలి. ప్రతి ఉపాద్యాయుడు తన వృత్తిని కేవలం పనిలా కాకుండా ఒక బాధ్యతగా భావించాలి. పిల్లల్ని మార్కులు మరియు ఒక ఉద్యోగం కోసమే కాకుండా, మెరుగైన సమాజానికి దోహద పడే గొప్ప పౌరులుగా తీర్చి దిద్దాలి.

  1. తల్లి తండ్రులు నుండి మంచి సంస్కారం అలవాటు చేసుకోవాలి.
  2. ఉపాధ్యాయుల నుండి బాధ్యతగా మెలగడం నేర్చుకోవాలి.
  3. సంస్కారం, బాధ్యత లేనప్పుడు చట్టం/ప్రభుత్వం వుంది అది శిక్షిస్తుంది అనే భయం వుండాలి.

ఈ మూడు విషయాలు కచ్చితంగా పిల్లల జీవితంలో వున్నపుడే రేపటి తరం ఆడపిల్లలపై లైంగిక దాడులు ఆగుతాయి. అప్పటి వరకు మనం అక్కడ ఆ దాడి జరిగింది, ఇక్కడ ఈ దాడి జరిగింది అని రోజు వార్తలలో వింటూనే వుండాలి..

ఈ కథనం మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Why Rapes in India won’t stop?

Like and Share
+1
3
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading