Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Women Safety in India – Rapes – Crimes
మీకో కథ చెప్తా..
ఓ ఊరిలో కల్యాణుడు అనే ఒకతను వుండేవాడు, అతను చాలా మంచివాడు. అతను ఎవరు ఏమి అడిగినా సహాయం చేసే వాడు. ఆ ఊరిలో అందరూ అతనిని గౌరవించే వారు. అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు. కలలో కూడా ఎవరు అతనికి చెడు చేయాలి అనుకునేవారు కాదు.
ఎప్పటిలాగే కల్యాణుడు ఒంటరిగా ఓ అడవి మార్గంలో పని మీద మరొక ఊరికి వెళ్తున్నాడు. నడక మొదలెట్టాడు. ఏందుకో ఆ రోజు ఆ అడవి అతనికి చాలా అందంగా కనిపించసాగింది. కొంత దూరం వెళ్ళాక ఓ అందమైన కుందేళ్ళ గుంపు అతని ముందు ఒక వైపు నుండి మరో వైపుకి వెళ్ళింది. వాటిని చూసి మురిసిపోయాడు కల్యాణుడు. అలానే ఇంకొంత దూరం వెళ్ళాక కొన్ని కృష్ణ జింకలు అతని ముందు నుండి కళ్ళు మూసి తెరిచేలోపే వెళ్లిపోయాయి.
ఇంకొంత దూరం అలానే నడిచాడు. ఎలాగో అతని ఎదుట ఒక తోడేలు గుంపు కనిపించింది. కల్యాణుడు తన నడక ఆపకుండా ఇంకా వాటి దగ్గరకు వెళ్లాడు. అవి కల్యాణుడిని చూసి గుర్రుమన్నాయి. వాటిని చూసి కల్యాణుడు
“నేను రోజు వెళ్ళే మార్గం ఇది.
మీరు నన్ను అడ్డగించకూడదు.
నేను చాలా మంచివాడిని.
నన్ను అందరూ గౌరవిస్తారు.
మీరు కూడా నన్ను గౌరవించి వెనక్కి వెళ్ళిపోండి” అని అన్నాడు.
ఇంతలో ఆ తోడేల్ల గుంపు కల్యాణుడి మీద పడి అతనిని పీక్కుతిన్నాయి.
ఇందులో నీతి ఏంటంటే, అడవిలో అందంతో పాటు ప్రమాదం కూడా ఉంటుంది. ప్రమాదాలను ఊహించి మన జాగ్రత్తలలో మనం ఉండాలి.
ఈ కథ చెప్పడానికి ఒక కారణం ఉంది.
ఈ కథని ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న సంఘటనలతో పోల్చుతూ కొంచెం మాట్లాడుకుందాం. మన సమాజంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి.
మొన్న ఒక మహిళ అంటుంది.
“నేను నచ్చిన చోటుకి వెళ్తా”
“నచ్చిన బట్టలు వేసుకుంటా”
“నేను ‘నో’ అంటే ‘నో’ అనే అర్థం.”
ఎవరికీ అమ్మా, నువ్వు చెప్పేది ఈ సమాజంలో 99% మంచివాళ్ళు ఉంటారు. వారు మీరు ‘నో’ అంటే అర్థం చేసుకుంటారు. మీ మాటకి, అభిప్రాయానికి గౌరవం ఇస్తారు.
కానీ ఆ 1% మృగాలు, క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు. వాళ్ళు మీరు “నో” అంటే ఆగరమ్మా. వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏమి చేయాలో ఆలోచించండి. కొన్ని సార్లు అలాంటి మృగాలకు ఎదురుగా వెళ్లి నిలబడకూడదు, కొంచెం పక్కకి తప్పుకోవడం మంచిది. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి.
ఆ మృగాలను అంతం చేయడం కొంచెం కష్టతరమైన పనే, వాటిని అణగదొక్కాలని అనుకుంటే.. ఒకటి వాళ్ళలో భయం సృష్టించాలి, లేదంటే భయం, బాధ్యత నేర్పించాలి.
అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరిని “వురి తీయ్యాలి” దీనివల్ల భయం సృష్టించబడుతుంది. ఒక్కరికోసం న్యాయం కావాలని సరిపోదు, బాధించబడిన ప్రతి ఆడపిల్లకి న్యాయం జరగాలి. అలా జరగాలంటే అత్యాచారం చేసిన ప్రతి ఒక్కరిని వురి తీయాలి. దీనివల్ల కొంతమందిలో భయం సృష్టి సృష్టించబడుతుంది. ఇంకా కొన్ని మృగాలు ఉంటాయి, ఆ క్షణంలో ఆ భయం కూడా గుర్తు రాదు వారికి.
ఇంకోటి భక్తి, బాధ్యత, ఇవి తల్లి తండ్రులు, టీచర్స్ చేతిలో ఉంటాయి. జెనరేషన్ వైజ్ మార్పు తీసుకురావడానికి కృషి జరగాలి. ఇది శాశ్వత పరిష్కారం.
ఒక తరంలో రావాలి మార్పు. ఈ మార్పు ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతి ఒక్కరు ఆ మార్పు కోసం కష్టపడాలి. నేడు మొదలు పెట్టండి ఆ మార్పు కోసం మీ ప్రయత్నం.
ఇక్కడ పూర్తి కథ ఆడియో/వీడియొ రూపంలో చూడండి
నా ఆలోచనలతో మీరు ఏకీభవిస్తే దయచేసి ఈ పోస్ట్ ని లైక్ చేసి, షేర్ చేయండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.