Menu Close

స్ఫూర్తిని రగిలించే మార్గం – Moral Stories in Telugu

Moral Stories in Telugu

“గుడ్డు ఒక్కొక్కటి ఎంత!”ఆమె కారు దిగి అతన్ని అడిగింది. “ఒక్కొక్కటి 5 రూ. అమ్మా!” అన్నాడు ఆ గుడ్లమ్మే వృద్ధుడు. “25 రూ.లకు 6 ఇవ్వు, లేకుంటే పోతాను.” బెదిరించింది. “తీసుకోండమ్మా! ఈ రోజు ఒక్క గుడ్డు కూడా అమ్మలేదు. మీ చెయ్యి చాలా మంచిది.

రామ్మా!రా!” అని ఇచ్చాడు. గొప్ప బేరం చేసాననే విజయగర్వంతో తన స్నేహితురాలితో కలిసి పెద్ద రెస్టారెంట్ కెళ్ళి కావలసినవన్నీ తెప్పించుకుని తిన్నంత తిని, పారేసినంత పారేసి బేరర్ ఇచ్చిన ₹1400/బిల్లుకు ₹1500/- ఇచ్చి “చిల్లర ఉంచుకో” అనింది గొప్పగా. ఆ హోటల్ లో ఇది సామాన్యమైన విషయం కావచ్చు.

కానీ ఆ గుడ్లమ్మే వ్యక్తి పట్ల ప్రదర్శించిన తీరు హర్షించదగ్గది కాదు. మనం ఎల్లప్పుడూ అనుకుంటాం! పేదవాళ్ళను, మన డబ్బు అనే అధికార బలంతో ఆడుకోవచ్చని, వాడుకోవచ్చని. – మన అభిమానం,ఆదరణ పేద వ్యాపారులకు కావాలి, కానీ అవసరం లేని చోట దానికంత విలువ ఉండదు.

ఓ ధనవంతుడు ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఒకటి నన్ను కదిలించింది. ” ప్రతిరోజూ మా నాన్న సామాన్యమైన వస్తువులను పేద వ్యాపారుల దగ్గర ఎక్కువ డబ్బిచ్చి కొంటుంటాడు, నిజానికి వాటి అవసరం లేకపోయినా ! నాకు విచిత్రం అనిపించి నాన్ననే అడిగాను. అది ఆత్మాభిమానం, గౌరవాన్ని అందించే దయాగుణం బాబూ.” అన్నాడు.

ఈ రెండు కథలను పోల్చి చూడండి. మొదటిది నిరాశ కలిగించే ప్రవర్తన, రెండోది స్ఫూర్తిని రగిలించే మార్గం.

సేకరణ- V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks