Moral Stories in Telugu
ఒకప్పుడు ఒక పెద్ద గ్రామంలో, ఒకే ఒక చెప్పులు కుట్టే వ్యక్తి (మోచీ) ఉండేవాడు. ఊరందరికీ, అతనొక్కడే చెప్పులు బాగు చేసేవాడు. ఇది ఒక సమస్య. కాలం గడుస్తున్న కొద్దీ అతని కాళ్ళ చెప్పులు కూడా అరిగిపోవడం మొదలుపెట్టాయి.
అతను ఇతరులకు చెప్పులు బాగు చెయ్యడంలో మునిగిపోయి ఉంటే, అతని కాళ్ళకి సరైన చెప్పులు లేక, గాయాలై కుంటుకుంటూ నడిచే స్థితికి వచ్చాడు.
అతని పరిస్థితికి అతని వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. వాళ్లకు ‘ఫరవాలేదు నేను కుట్టగలను’ అని నమ్మించాడు. అయినా కొన్నాళ్ళకు అతని కాళ్ళు శిధిలమైన చెప్పుల వల్ల ఎంతగా గాయపడ్డాయంటే, చెప్పులను రిపేరు చేసే శక్తిని కోల్పోయాడు.
దాంతో ఊళ్ళోవాళ్ళు సరైన చెప్పులు లేక, అందరూ కుంటుతున్నారు, కారణం ఆ మోచీ తన చెప్పులు బాగు చేసుకొనే సమయం తీసుకోకపోవడం వల్ల.
ఈ చిన్న విషయాన్ని చాలాసార్లు విస్మరిస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, మీరు పనిచేసే స్థితిలో ఉండరు. నీకు ఎన్ని గొప్ప ఆశయాలు, లక్ష్యాలూ ఉన్నా అన్ని వృధా!! అవేమీ సాధించలేవు.
ఇది ప్రొఫెషనల్స్ కి, ఉద్యోగస్తులకు, నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, సేవకులకు, అధ్యాపకులకు, చివరకు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. నీకోసం సమయం కేటాయించకపోతే, ఇంకెవరు నీ గురించి ఆలోచిస్తారు.
భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే, మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. అప్పుడే ఏమైనా చెయ్యగలరు. స్వీయ రక్షణ అనేది కలకాలం ఆరోగ్యంగా ఉండటం కోసం చేసుకునే ప్రయత్నం. ఆరోగ్యమే మహాభాగ్యం.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.