Telugu Moral Stories
నాకు ఉహ తెలిసినప్పటి నుండి నా మంచం కింద రాత్రిళ్ళు ఎవరో ఉన్నారనే భయం ఉండేది. అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాను. “సార్… రాత్రిళ్ళు నిద్రకు ఉపక్రమించగానే నా మంచం కింద ఎవరో ఉన్నారనిపించి భయమేసి, నన్ను పిచ్చెక్కిస్తోంది.”
“మీరేం భయపడకండి ! మీ సమస్యను నేను తీరుస్తాను. వారానికి మూడు రోజులు నా దగ్గరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సంవత్సరంలోగా మీ భయాలన్నీ పటాపంచలై పోతాయి. “భరోసా ఇచ్చాడు సైకియాటిస్ట్. ” సార్….. మీరెంత ఫీజు తీసుకుంటారు!!” ” వచ్చిన ప్రతిసారీ ₹500/- ఛార్జి చేస్తాను.” అన్నాడు డాక్టర్.
ఆర్నెల్ల తర్వాత ఒక రోజు దారిలో డాక్టర్ కనబడ్డాడు. “ఏం… ట్రీట్మెంట్ కు ఎందుకు రాలేదు.” అని అడిగాడు. “రోజుకు ₹500/-, వారానికి ₹1500/- చొప్పున సంవత్సరానికి ₹81000/- అవుతోంది. ఒకరోజు బార్ లో సర్వ్ చేసేవాడు యాభై రూపాయలకే నా వ్యాధి నయం చేసాడు. ఆ డబ్బుతో నేనొక కొత్త బైక్ కొనుక్కున్నాను.” “ఔనా!!! అదెలాగా!!” – “నా మంచం కాళ్ళు కోయించేయమని అన్నాడు. అప్పుడు దాని కిందికి ఎవ్వరూ రారు.” అని చెప్పాడు.
అందుకే రెండో అభిప్రాయం తీసుకోవడం మంచిది.
సేకరణ – V V S Prasad
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.