ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరేపా రెక్కలుకొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది. సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు,
👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..!
👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!
👉 వలవేస్తాడు జాగ్రత్త..!
👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!
👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. !
అనే పాటనేర్పింది.
ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి.
ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు…స్తా……డు…….. అంటూనే చచ్చిపోయాయి.
అయ్యో… ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు.
మన పిల్లల చదువులు కూడా ఇలాగే వున్నాయి. పిల్లలే కాదు మనమందరము కూడా నేడు మన మందరమూ చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు, వింటున్నాము, చదువుచున్నాము. పాటించ(ఆచరించ) కుండా వదిలేస్తున్నాము.
ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com
Subscribe to Our YouTube Channel
Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.