Menu Close

అవకాశం దొరికిందని అతి చేయకూడదు – Telugu Stories

అవకాశం దొరికిందని అతి చేయకూడదు – Telugu Stories

ఓదపా పులికి కడుపులో పుండు పుట్టింది. వైద్యులను పిలిపించింది. వారు పరిశీలించి ఇది మా వల్లకాదు. కాశీకి పోయి గంగలో స్నానం చేసి చుండిరికాయ పప్పు తింటే నయమౌతుంది అన్నారు.

నక్క దగ్గరకు వచ్చి,జరిగింది చెప్పి”అల్లుడూ! కాశీకి పోను నాకు దారితెలియదు. నువ్వయితే అడిగి తెలుసుకుంటావు. నన్ను చూస్తేనే జనం పరుగులు తీస్తారు కదా! కొంచెం నాకు తోడుగారా నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను”అంటూ ప్రాధేయపడింది పులి.

“బావా!నాకూ రావాలనే వుంది. ఈ మధ్యనడుం పట్టుకుని ఎక్కువదూరం నడవలేకున్నాను సరేకానీ పెద్దోడివి ఇంతదూరం నోరుతెరచి అడిగావు వస్తాపో—-” అన్నది నక్క.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

ప్రయాణ మయ్యాయి. కొంత దూరం పోయేసరికి”బావా!నడవలేకున్నాను. వీపున ఎక్కించుకో కాదంటే వెనుదిరిగి వెళ్ళి పోతా”
“అయ్యో!అంతమాట అనకు అల్లుడు, అలాగే ఎక్కు” ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ నాలాంటి అల్పప్రాణి పులిపై స్వారీ చేయడమంటే ఇదికదా అదృష్టం అంటే అని భుజాలు చరుచుకుంది.

రాత్రికాగానే ఓ చెట్టుక్రింద బసచేశారు.పులివెళ్లి ఓ జింకను కొట్టుకొచ్చింది. మంచి మంచి అవయవాలు నక్క తింటున్నది తోక చెవులు పులి తింటున్నది.”బావా! క్రింద పడుకుంటే ఏ దైనా పురుగు పుట్రా కుట్టి నాకేదన్నా అయితే ఆపై నీపరిస్తితి ఏంది. నీ పైన పడుకోబెట్టుకో బావా!”అంది లోపల ముసిముసిగా నవ్వుకుంటూ.
“అలాగే అల్లుడు” కాశీ రానే వచ్చింది. వైద్యులు చెప్పినట్టు చేశారు.

నాలుగు రోజులకు కాస్త నయమనిపించింది. తిరుగుముఖం పెట్టారు. మార్గ మధ్య మున రొయ్యల చెరువు దగ్గర ఆగి”బావా!నాలుగు రొయ్యపీసులన్నా ఎత్తుక పోకపోతే కాశీకి పోయి ఏం తెచ్చారని పిల్లలు ఎగతాళి చెయ్యరా?”అంటూ రొయ్యలు బస్తాకట్టి నెత్తికెత్తుకునే సమయంలో ఆసామి పరుగెత్తుకుంటూ వచ్చి కర్ర పైకెత్తాడు.అదిగమనించిన పులి పెద్దగా ఘాండ్రించింది.బయపడి పారిపోయాడు.

“అవకాశం దొరికిందని పెద్దవారిని తక్కువగా అంచనా వేయరాదు నేను లేకుంటే నీ బ్రతుకేమై వుండేది” అంది. “నామాటకు ఎదురు లేదని పెద్దా చిన్నా చూసుకోకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించు మారాజా! అని కాళ్ళ మీద పడింది నక్క.

✍🏻 జంజం కోదండ రామయ్య

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

SUBSCRIBE FOR MORE

Moral Stories in Telugu, Chanda Mama Kathalu, Telugu Short Stories, Panchatantra Stories in Telugu, Short Moral Stories in Telugu, Pitta Kathalu,Telugu Stories, తెలుగు స్టోరీస్, తెలుగు కథలు, Telugu Moral Stories, Love Stories in Telugu, Telugu Love Stories, Great Stories in Telugu, Best Stories in Telugu, Telugu Stories for Kids, Telugu Stories for Children

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading