Nammavemo Gani Song Lyrics in Telugu – Parugu – నమ్మవేమో గాని అందాల యువరాణి
నమ్మవేమో గాని… అందాల యువరాణి
నేలపై వాలింది… నా ముందే మెరిసింది… ||2||
అందుకే అమాంతం నా మది… అక్కడే నిశబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది… ఇక్కడే ఇలాగే నాతో ఉంది…
నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది
అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది… ||2||
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే…
చెంపలు కెంపు నాణాలై… కాంతిని ఇస్తుంటే…
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే…
రూపం ఈడు భారాలై… ముందర నుంచుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే… ఓ రాయిలాగా అయ్యాను నేనే…
అడిగ పాదముని అడుగు వేయమని… కదలలేదు తెలుసా…
నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది
అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది… ||2||
వేకువలోన ఆకాశం… ఆమెను చేరింది
ఓ క్షణమైన అదరాల రంగుని ఇమ్మంది…
వేసవి పాపం చలి వేసి… ఆమెను వీడింది…
శ్వాసలలోన తల దాచి జాలిగ కూర్చుంది…
ఆ అందమంత… నా సొంతమైతే…
ఆనందమైన వందేళ్ళు నావే…
కలల తాకిడిని మనసు తాళదిక… వెతికి చూడు చెలిని…
నిజంగా కళ్ళతో వింతగా… మంత్రమేసింది
అదేదో మాయలో… నన్నిలా ముంచి వేసింది.. ..
Subscribe to Our YouTube Channel
Nammavemo Gani Song Lyrics in Telugu – Parugu – నమ్మవేమో గాని అందాల యువరాణి
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.