Menu Close

Motivational Stories in Telugu

Motivational Stories in Telugu

తల్లి ఏదో పుస్తకం చదువుతూ ఉంటే కూతురు ఆడుతూ, అల్లరి చేస్తూ ఆమె ఏకాగ్రతకు భంగం కలిగిస్తోంది. ఆ పాపాయిని బిజీగా ఉంచడం కోసం ఒక పుస్తకంలోని ప్రపంచ పటాన్ని తీసి, ముక్కలుగా చేసి అన్నింటినీ సరిగా సర్ది ప్రపంచ పటాన్ని యధాతథంగా అతికించమని పని కల్పించింది.

ప్రపంచ పటాన్ని మళ్ళీ యధాతథంగా అతికించాలంటే చాలా సమయం పడుతుంది, కూతురు తనను కొద్ది సేపు డిస్టర్బ్ చేయదని తల్లి భావించింది. కానీ ఆ అమ్మాయి నాలుగైదు నిముషాల్లో పటాన్ని సక్రమంగా అతికించి తెచ్చి చూపించింది. తల్లి ఆశ్చర్యపోయి, “ఇంత త్వరగా ఎలా అతికించావ”ని అడిగింది.

ఆ అమ్మాయి “ఆ పేపర్ కు వెనక వైపున ఐశ్వర్యా రాయ్ బొమ్మ ఉంది. దాని సహాయంతో సరిగా అమర్చగలిగాను” అని మళ్ళీ ఆడుకోవడానికి పోయింది.

mother and daughter

ఇలాగె మన ప్రతి అనుభవానికి రెండో కోణం కూడా ఉంటుంది. ఏదైనా క్లిష్టమైన, కఠినమైన సవాల్ ఎదుర్కొనేప్పుడు దాన్ని మరో రకంగా ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తే అప్పుడా సమస్యను సులభంగా గానీ, తక్కువ శ్రమతో గానీ పరిష్కరించుకొని, మనమే ఆశ్చర్యానికి లోనవుతాం.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading