Menu Close

జీవిత పరమార్ధం-Telugu Stories

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

” విస్తరాకును “ ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని ‘భోజనానికి’ కూర్చుంటాము.
భోజనము తినేవరకు “ఆకుకు మట్టి” అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం ‘ఆకును’ (విస్తరిని) మడిచి ‘దూరంగా’ పడేస్తాం.
“మనిషి జీవితం” కూడా అంతే ఊపిరి పోగానే “ఊరి బయట” పారేసి వస్తాము.
‘విస్తరాకు’ పారేసినప్పుడు సంతోషపడుతుంది. ఎందుకంటే ‘పొయేముందు ఒకరి ఆకలిని’ తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న ‘తృప్తి’ ఆకుకు ఉంటుంది.
‘విస్తరాకుకు’ ఉన్న ఆలోచన భగవంతుడు “మనుషులకు” కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ….
‘సేవ’ చేసే అవకాశము వచ్చినపుడు మీరు అందరూ ‘సేవ’ చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని “వాయిదా” వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే ‘కుండ’ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు ‘విస్తరాకుకు’ ఉన్న ‘తృప్తి’ కూడా మనకి ఉండదు..
ఎంత ‘సంపాదించి’ ఏమి లాభం? ‘ఒక్కపైసా’ కూడా తీసుకుపోగలమా?
కనీసం ‘మన ఒంటిమీద బట్ట’ కూడా మిగలనివ్వరు..
అందుకే ‘ఊపిరి’ ఉన్నంత వరకు “నలుగురికి” ఉపయోగపడే విధంగా ‘జీవించండి’..
ఇదే జీవిత పరమార్ధం💐

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading