Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

మరొకరి మంచి కోసం మనం నోరు తెరిస్తే భగవంతుడు మన వెంటే ఉంటాడు-Telugu Stories

బయట జోరుగా వర్షం పడుతుంది.తరగతి గదిలో టీచర్ పాఠం బోధిస్తున్నారు. పిల్లలు శ్రద్దగా వింటున్నారు. కానీ వాతావరణం డల్ గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది.వాళ్ల మైండ్స్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో జేబులో నుండి వందరూపాయలు తీసి ఇప్పుడు నేను ఈ వందరూపాయలు ఇస్తే మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు టీచర్.
నేను బొమ్మకారు కొనుక్కుంటా అంటూ మెరిసే కళ్లతో సమాధానం చెప్పాడొక విద్యార్ధి. నేను ఫ్రెండ్స్ తో కలిసి సమోసాలు కొనుక్కుని తింటాను అంటూ పెదవులు తడుపుకుంటూ చెప్పాడు మరో విద్యార్ధి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సర్,నేను ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటాను అన్నాడు మరొక విద్యార్ధి.
“నేను మా అమ్మకి కళ్లజోడు కొంటాను సర్ అని” చివరగా ఒక విద్యార్ధి సమాధానం ఇచ్చాడు ఆశగా వందరూపాయల వైపు చూస్తూ. వెంటనే టీచర్ ఆ విద్యార్ధి వైపు తిరిగి , మీ అమ్మకి నువ్వెందుకు కళ్లజోడు కొనడం? ఆ పని మీ నాన్న చేస్తాడు. కాబట్టి ఈ వందరూపాయలతో నీకోసం నువ్ ఏం కొనుక్కుంటావ్ అని రెట్టించి అడిగాడు.
నాకు మా నాన్న లేడు సర్,చనిపోయాడు.మా అమ్మ టైలర్ పని చేసి నన్ను మా చెల్లిని చదివిస్తుంది . బట్టలు కుట్టేటప్పుడు మా అమ్మ కళ్లు కనపడక చాలా ఇబ్బంది పడుతుంది. తను సంపాదించినది మా చదువులకి , తిండికే సరిపోవట్లేదు . అందుకే కళ్లజోడు కొనుక్కోవట్లేదు. మీరు ఈ డబ్బులిస్తే మా అమ్మకి కళ్లజోడు కొంటాను అంటూ మళ్లీ అడిగాడు ఆశగా.
కుర్రాడి చెప్పిందంతా విన్నాక టీచర్ కళ్లు చెమర్చాయి . కన్నీళ్లను తుడుచుకుంటూ సరే ఇస్తాను, కానీ ఒక షరతు అంటూ ఆగాడు. చెప్పండి సర్ మీరేం చెప్పినా చేస్తాను , మా అమ్మకి కళ్లజోడు కొనిపెట్టడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ హుషారుగా అన్నాడు.
వందరూపాయలు ఆ కుర్రాడి చేతిలో పెడుతూ రేపు నువ్ పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్ అవుతావు కదా ,అప్పుడు నాకు ఈ వందరూపాయలు తిరిగి ఇచ్చేయాలి ఇదే ఆ షరతు అన్నాడు. అంతేకాదు నువ్ జీవితంలో చాలా గొప్పవాడివి కావాలి,అవుతావు అంటూ దీవించాడు.
ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ స్కూల్ ముందు ఒక కార్ వచ్చి ఆగింది. ఆ రోజు కూడా వర్షం కురుస్తుంది పదిహేనేళ్ల క్రితం జ్ణాపకాన్ని కళ్లముందు నిలబడానికా అన్నట్టుగా. తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు.
ఎక్స్క్యూజ్ మి సర్ అంటూ వినపడిన ద్వారం వైపు ఎస్ అంటూ సమాధానం ఇస్తూ టీచర్ తలతిప్పారు. తనతో పాటు స్టూడెంట్స్ కూడానూ. మీరిచ్చిన వందరూపాయలు సర్ అంటూ , ఆ రోజు తన తల్లి కళ్లజోడు కోసం ఇచ్చిన వందరూపాయల్ని తిరిగిస్తూ ,పాదాభివందనం చేసిన ఆ విధ్యార్ధి ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్.
అవును ఒక మనిషి ఎప్పుడూ తన కోసం కాకుండా తన దేశం కోసం,తన కుటుంబం కోసం ఆలోచిస్తూ, దయాగుణం,మానవతా హృదయం కలిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. మనలోని అవలక్షణాలే మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా వెనక్కి లాగుతుంటాయి అనడానికి ఈ స్టోరి ఒక చక్కటి ఉదాహరణ.

ఈ పోస్ట్ సోషల్ మీడియా నుండి సేకరించబడింది, ఈ పోస్ట్ మీకు ఏ విదమైన ఇబ్బంది కలిగిస్తే, కామెంట్ రూపంలో తెలపగలరు లేదా మమ్మల్ని సంప్రదించండి. admin@telugubucket.com

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks