Menu Close

లేవండి… మొద్దునిద్ర ఒదలండి – Telugu Poetry

Telugu Poetry

లేవండి…
మొద్దునిద్ర ఒదలండి.
మన జీవితాలకు మనమే నిర్దేశించుకులం.
మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.

గమ్యం చేరే వరకు క్షణం విశ్రాంతి తీసుకోవద్దు.
అసలెక్కడా ఆగవద్దు.
లేచి నిలబడండి.
ధైర్యంగా ముందుకు సాగండి.

మిమ్మల్ని ఏ శక్తీ ఆపలేదు.
మీ ఉత్సాహాన్ని అడ్డుకోలేదు.
మీరంతా ప్రత్యేకమైన వ్యక్తులు.
మీరందరూ ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు.
అనంతమైన శక్తిసామర్థ్యాలు ఉన్నవాళ్ళు.

మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని,
మీలో నిద్రాణంగా ఉన్న శక్తిని వెలికి తీయండి.
మీ భవిష్యత్తుకు మీరే నిర్ణేతలు.
ఇక్కడ ఎవరో వచ్చి మీ భవిష్యత్తును బంగారుమయం చెయ్యరు.
ఎదగండి… కొత్త శక్తిని పుంజుకుని మరింత ఎత్తుకు ఎదగండి.
అందరూ గర్వించేంత స్థాయికి ఎదగండి.

సేకరణ – V V S Prasad

Like and Share
+1
2
+1
3
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading