ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Business Ideas in Telugu: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునేవారికి చాలా బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. కొన్ని వ్యాపారాలకు ప్రభుత్వం నుంచి రుణాలు కూడా లభిస్తాయి. ఇంట్లోనే చిన్న గదిలో ప్రారంభించగల వ్యాపారాలు చాలా ఉన్నాయి. రోజురోజూ ఉద్యోగం చేయడం టెన్షన్ టెన్షన్‌గా ఉందా? ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మంచి బిజినెస్ ఐడియా ఉంటే చాలు.
ఈ రోజుల్లో చాలా మంది చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం కోసం చూస్తున్నారు. మీరు కూడా ఇలాంటి వాటి కోసం చూస్తున్నట్టయితే ఈ బిజినెస్ ఐడియా గురించి ఆలోచించవచ్చు. తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయొచ్చు. భారతదేశంలో మసాలాలు, మసాలా దినుసులకు (Masala Spices) విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు మిలియన్ల టన్నుల్లో ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో చాలా తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడం మంచి లాభాలు పొందవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితో మసాలా తయారీ వ్యాపారం ప్రారంభించి లాభాలను సంపాదించవచ్చు.
మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెట్టాలి. ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్ ఇది. భారతదేశంలోని వంటగదిలో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉంది. భారతదేశం మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది తయారు చేయడం సులభం. వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరు రుచిని అందించే మసాలాలు ఉంటాయి. ఈ రుచి గురించి, ప్రజలు ఇష్టపడే మసాలాల గురించి తెలిస్తే చాలు. మసాలా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) నివేదికలో సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి బ్లూప్రింట్ ఉంది. ఈ నివేదిక ప్రకారం సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు వెచ్చించాలి. 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డుకు రూ.60,000, పరికరాల రూ.40,000 ఖర్చవుతుంది. ఇది కాకుండా మసాలాలు తయారు చేసేందుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంతో మీ వ్యాపారం ప్రారంభమవుతుంది.
మీ వద్ద అంత మొత్తం లేకపోతే, మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. ముద్ర లోన్ స్కీమ్ ద్వారా కూడా రుణాలకు అప్లై చేయొచ్చు. ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఏటా 193 క్వింటాళ్ల మసాలా ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో క్వింటాల్‌కు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు విక్రయించవచ్చు. ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా సంపాదన వస్తుంది.
ఓ గదిని అద్దెకు తీసుకోవడం కంటే సొంత ఇంట్లో ఓ గదిలో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. ఇంట్లో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు తగ్గుతుంది కాబట్టి లాభాలు పెరుగుతాయి. ప్యాకేజింగ్ నిపుణుల సాయంతో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. లోకల్ మార్కెట్‌లో, షాపుల్లో, ఆన్‌లైన్‌లో వీటిని అమ్మొచ్చు. సొంతగా వెబ్‌సైట్ క్రియేట్ చేసి వ్యాపారాన్ని పెంచుకోవచ్చు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.