Menu Close

Business Ideas in Telugu – కొత్త వ్యాపార ఆలోచనలు

విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. వాహనదారులు ఈవీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏ నెలకు ఆ నెల ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూ వస్తోన్నాయి. దీనికి అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సైతం రెట్టింపు అవుతోంది.

అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద దృష్టి సారించాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకుని వచ్చిన తరువాత ఈవీల మీద దృష్టి సారించారు వాహనదారులు. ఇదివరకెప్పుడూ లేనిసంఖ్యలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ రోడ్ల మీద కనిపిస్తోన్నాయి.

ఫోర్ వీలర్స్‌ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మారుతి సుజుకి, కియా, టయోటా.. వంటి టాప్ కార్ మేకర్స్ వీటి తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ట్రక్కులను కూడా తీసుకుని రావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా.

విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలను వ్యవసాయ అవసరాల కోసం వినియోగించేలా ట్రాక్టర్, ట్రక్ మేకర్స్ రంగం సిద్ధం చేశాయి. క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత ప్రోత్సహించేలా అటు కేంద్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా- ఇందులో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీల వస్తు, సేవా పన్నులను తగ్గించాలని భావిస్తోంది.

లిథియం అయాన్ బ్యాటరీలపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న జీఎస్టీ శాతం.. 18. దీన్ని అయిదు శాతానికి తగ్గించాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. నెక్స్ట్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఆమోదించవచ్చనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీని మరింత ముమ్మరం చేయడానికి కూడా ఇది దోహదపడుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోందంటే.. దానికి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను సైతం అందుబాటులోకి తీసుకుని రావడం తప్పనిసరి అవుతుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, జాతీయ రహదారుల వెంట పెట్రోల్ బంకుల తరహాలోనే ఇబ్బడిముబ్బడిగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది కూడా. ఇవి అందుబాటులో ఉంటేనే కొనుగోలుదారులు ఈవీలపై ఆసక్తి చూపుతారు.

చింతపండు చాక్లెట్స్- Buy Now

ఈ పరిస్థితుల మధ్య ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పడం ద్వారా ప్రతినెలా లక్షల రూపాయల్లో ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను నెలకొల్పడానికి భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. లక్ష నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు రావచ్చు.దీని మీద వచ్చే ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ నెలకొల్పాలంటే లొకేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 10 చదరపు అడుగుల స్థలంలో కూడా ఈ పాయింట్‌ను నెలకొల్పవచ్చు. పెద్దగా స్థలం అవసరం ఉండదు. వాహనాల పార్కింగ్‌ కోసం స్థలాన్ని చూపించాల్సి ఉంటుంది. దీన్ని నెలకొల్పడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈవీలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. వీటిపై పెద్దగా ఎలాంటి ఆంక్షలను విధించలేదు.

SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Business Ideas in Telugu
Best business ideas
New business ideas
Online business ideas
Startup ideas
Business ideas in India
Business ideas for women
Low investment business ideas
Small business ideas from home

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ధనవంతుల ఆలోచనలు - Buy Now

Leave a Reply

Your email address will not be published.

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker

Refresh Page
x

Subscribe for latest updates

Loading

South Indian Actress with Highest Remuneration Interesting Facts About Indian Flag in Telugu Rashmika Mandanna Images Sai Pallavi Photos Samantha Cute Photos