మనం వ్యాపారం చేయాలి అంటే అనేక వ్యాపారాలు ఉన్నాయి పెట్టుబడి పెట్టే వ్యాపారాలు, అలాగే పెట్టుబడి లేకుండా తెలివిగా చేసే వ్యాపారాలు ఇక చిన్న పెద్ద వ్యాపారాలు అనేకం ఉన్నాయి. మనిషి వ్యాపారం చేయాలి అని అనుకోవాలే కానీ మనిషి ఏ వ్యాపారనైనా సులువుగా చేయగలడు.
తెలుగు రాష్ట్రాలలో ఇక మనం తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.ఇప్పుడు మనకు రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. తెలంగాణాలో ఒక రెండు నెలలు గడువు మరియు ఆంధ్రప్రదేశ్లో మరో 6 నెలలు గడువు ఉంది. ఇక ఇక్కడ మనం కొంచెం తెలివిగా ఆలోచిస్తే ఈ రెండు రాష్ట్రాలలో జరిగే ఎన్నికలను మనం మన వ్యాపారంగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
పార్టీ సామాగ్రి ఎన్నికలలో అమ్మే సామాగ్రి వ్యాపారం ఇక అందరికి తెలిసిందే 2019 లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం మన తెలుగు రెండు రాష్ట్రాలలో అనేక రాజకీయ పార్టీలు పోటీపడబోతున్నాయి. ఈ సమయంలోనే మీరు కొంచెం తెలివి చేసి ఏ పార్టీలు మనం ఉండే చోట పోటీ చేస్తున్నాయో తెలుసుకొని ఆ పార్టీ వారిని కలిసి వారి పార్టీ సామాగ్రిని మీరు తయారు చేసే లాగా కాంట్రాక్టు తీసుకోండి.
పోస్టర్లు- పార్టీ జెండాలు ఇక ఇలా ఎందుకు చేయాలి అంటే ప్రతి పార్టీ ఎన్నికలు డేట్ రాగానే వారి పార్టీ తరపున ప్రచారంలో నిమగ్నమైపోయింటారు. ఒక్కపుడు పార్టీ ప్రచారానికి కేవలం పోస్టర్లు. పార్టీ జెండాలు మరియు క్లాత్ బ్యానర్లు మాత్రమే అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.
లక్షలు సంపాదించవచ్చు ఇప్పుడు ఎన్నికలు అనగానే వివిధ రకాల ప్రచార మాధ్యమాలు వచ్చేసాయి. వీటి వలన ప్రచారంలో ఉన్న ఎన్నో పార్టీలలో తమ పార్టీ ప్రచారం ప్రత్యేకమైన ప్రచారం కోసం ప్రతి పార్టీ కొన్ని కోట్లు ఖర్చు పెడతాయి. ఇలాంటి సంధర్భం వచ్చినప్పుడు మనం దాని క్యాష్ చేసుకోవాలి.ఇలా చేసుకుంటే మీ వ్యాపారంలో లక్షలు సంపాదించవచ్చు.
ఎంత ఖర్చు ఇక మీరు ఎన్నికల ప్రచార సామాగ్రి తెచ్చిపెట్టుకొని ఉంటే సరిపోదు ప్రతి పార్టీ దగ్గరికి వెళ్లి మీరు ఏ రకంగా పార్టీ ప్రచారం చేస్తారు ఎంత ఖర్చు అవుతుంది అని చెబితే చాలు ఇక వారు కనుక ఒప్పుకుంటే మీ వ్యాపారం సక్సెస్ .
ఉదాహరణకి ఉదాహరణకి ఈరోజుల్లో ప్రతి ఒకరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది వాటికీ ప్రతి ఒకరు మొబైల్ పౌచ్ వేసుకుంటారు దానికి బదులు మీరు ప్రచారం చేసే పార్టీ కవర్ ఉచితంగా ఇస్తే బాగా ప్రచారం జరుగుతుంది. ఇక మొబైల్ వినియోగదారుడికి తన మొబైల్ కి రక్షణ దొరుకుతుంది. మొబైల్ ప్రచార సాధనకు బాగా ఉపయోగపడుతుంది.
ప్రచార సాధనాలు ఎన్నికలు జరిగినప్పుడు అంత పార్టీ ప్రచారం కొత్త పొంతలు తొక్కుతూ పార్టీ ప్రచార ఖర్చు కూడా పెరుగుతూపోతోంది. ఒక్కపుడు మూడు మాత్రమే ప్రచార సాధనాలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు వంద ప్రచార సాధనాలు ఉన్నాయి. ఇక మీరు కనుక ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే వెంటనే మీ వినూత్న ఆలోచనలని పదును పెట్టండి.
ఆలోచలను ప్రధానంగా పార్టీ వారిని కలవండి మీ ఆలోచలను తెలిపి ఆర్డర్ పెట్టండి. కొత్త వ్యాపారానికి తెర లేపండి పార్టీ వారు ప్రచారానికి వెళ్లి సమయానికి మీరు తీసుకున్న ఆర్డర్ పార్టీ వారికీ సప్లై చేస్తే చాలు మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
Subscribe to Our YouTube Channel
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.