Business Ideas in Telugu: మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు. ఎక్కువ కురిసినా.. తక్కువ పడినా.. ఇబ్బందేం లేదు.
ఈ కాలంలో చాలా మంది యువత వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. పట్టణాల్లో మంచి మంచి ఉద్యోగాలను కూడా వదిలిపెట్టి.. గ్రామాల్లో పొలంలోకి దిగుతున్నారు. సంప్రదాయ పంటలను కాకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. సొంతూరిలో తల్లిదండ్రుల వద్దే ఉంటూ లక్షలుసంపాదిస్తున్నారు.
అలాంటి అద్భుతమైన పంటల్లో వాటిలో ఒకటి మునగ సాగు (Drumstick Farming)..! గ్రామాల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు మంచి డిమాండ్ ఉంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే చాలా మంది మునగకాయలను రోజూ వారీ కూరల్లో వినియోగిస్తారు. సాంబార్ వేస్తారు. లేదంటే కర్రీ చేస్తారు. ఆయుర్వేదం (Ayurveda)లోనూ మునగ ఆకులు వినియోగిస్తున్నారు. మునగ కాయలతో పాటు మునగ ఆకులతో కూడా చాలా మంది కూరలు చేసుకుంటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి ధర లభిస్తోంది.
మునగశాస్త్రీయ నామం మోరింగా ఒలిఫెరా. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా సాగు చేస్తారు. ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక వరకు అనేక దేశాల ప్రజలు మునగను సాగు చేసి భారీగా లాభాలు పొందుతున్నారు. మునగ పంటను సులభంగా పండివచ్చు. దీని ప్రత్యేక ఏమిటంటే.. బంజరు భూమిలో కూడా సాగు చేయవచ్చు. పెద్దగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఈ పంటతో నెలకు రూ.50వేల వరకు వస్తుంది. ఈ లెక్కన సంవత్సరానికి రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చు.
మునగ తక్కువ ఖర్చుతో కూడిన పంట. ఒక్కసారి విత్తిన తర్వాత నాలుగేళ్ల వరకు మళ్లీ పొలం దున్నాల్సిన పనిలేదు. మునగ పంటకు వర్షం వల్ల కూడా నష్టం ఉండదు. ఎక్కువ కురిసినా.. తక్కువ పడినా.. ఇబ్బందేం లేదు. ఇది ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పెరిగే చెట్టు. అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు కాపు తీయవచ్చు. ఏడాది పొడవునా ఒక్కో మొక్క నుంచి దాదాపు 200-400 కాయలు (40-50 కిలోలు) అందుబాటులో ఉంటాయి.
మునగకాయలను తక్కువ సంఖ్యలో అమ్మితే ఎక్కువ రోజుల పాటు చెట్టుపై ఉంచే.. మెల్లమెల్లగా కోయాల్సి ఉంటుంది. లేదు గిరాకీ ఎక్కువగా ఉంటే.. ఎక్కువ సంఖ్యలో కోత కోయవచ్చు. ఐతే మునగకాయ బాగా ముదరకుండా జాగ్రత్త పడ్డాలి. కాస్త లేతగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తీసుకెళ్లాలి. అలాంటి వాటికే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. లాభాలు కూడా అధికంగా వస్తాయి. గ్రామాల్లో వారంతపు సంతలు ఎలాగూ ఉంటాయి కాబట్టి.. నెలలో కనీసం నాలుగు సార్లు కోతకోసి విక్రయించవచ్చు.
ఒక ఎకరంలో 1,200 మొక్కలు నాటుకోవచ్చు. ఇందుకు దాదాపు రూ.50,000-60,000 ఖర్చు అవుతుంది. ఒక్కసారి మొక్కలు నాటమంటే చాలు.. అవే పెరుగుతాయి. అది కూడా తక్కువ సమయంలో ఏపుగా ఎదుగుతాయి. ఎప్పటికప్పడు మార్కెటింగ్ చేసుకోవాలే గానీ.. ఈ పంటలతో బాగా లాభాలు వస్తాయి. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. ఇంట్లో కూర్చునే హాయిగా సంపాదించుకోవచ్చు
Subscribe to Our YouTube Channel
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.