Menu Close

Business Ideas in Telugu – కోటీశ్వరులను చేసే పంట ఈ సాగుతో 4 నెలల్లోనే లక్షల ఆదాయం

Business Ideas in Telugu: మీరు కూడా కొత్త రకం వ్యవసాయాన్ని చేయాలని భావిస్తూ ఉంటే.. తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఐదారేళ్ల క్రితం వరకు వ్యవసాయం అంటే.. నష్టంతో కూడుకున్నదన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అయ్యేది.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యవసాయ రంగంలో వస్తున్న యువత సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొత్త కొత్త పంటలను సాగుచేస్తూ లక్షల రూపాయలను సంపాధిస్తున్నారు. మీరు కూడా కొత్త రకం వ్యవసాయాన్ని చేయాలని భావిస్తూ ఉంటే.. తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు.

ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు. తద్వారా కేవలం 4 నెలల్లోనే రూ.8 లక్షలు సంపాదించాడు. ఇందుకోసం నెదర్లాండ్స్‌ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో నాటాడు. ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు.

అందువల్ల, రెస్టారెంట్లు మరియు హోటళ్ల నుంచి ఇటువంటి దోసకాయలకు భారీ డిమాండ్ ఉంది. ఇతర దోసకాయల కంటే వీటికి అధిక ధరలు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారం కోసం రైతు ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు గ్రాంట్ తీసుకుని పొలంలో షెడ్ నెట్ హౌస్ నిర్మించుకున్నాడు ఆ రైతు.

ఈ దోసకాయను ఏ రకమైన నేలలోనైనా పండించవచ్చు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ దోసకాయను ఉత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. దోసకాయ పంట 60 నుండి 80 రోజులలో చేతికి వస్తుంది. ఈ సాగు కోసం భూమి యొక్క pH 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

అప్పుడు భూమి మంచిదిగా పరిగణించబడుతుంది. దోసకాయను నదులు లేదా సరస్సుల ఒడ్డున కూడా పండించవచ్చు. వేసవిలో దోసకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దోసకాయను ప్రతీ సలాడ్ లో ఉపయోగిస్తారు. దోసకాయను పార్టీల్లోనూ వడ్డించడం ఇటీవల ఎక్కువైంది. దీంతో దోసకాయకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

మీకు తక్కువ డబ్బు ఉన్నప్పటికీ.. మీరు దోసకాయ వ్యవసాయం నుండి మంచి లాభం పొందవచ్చు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీతో ఈ వ్యవసాయం చేసుకోవచ్చు. మార్కెట్‌లో సాధారణ దోసకాయ కిలో రూ.50 వరకు ఉంది. దోసకాయ ఉత్పత్తి రైతులకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ పొలం నుంచి దోస సాగు ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించవచ్చు. వాస్తవానికి, మీ ప్రాంతంలోని మార్కెట్‌పై మంచి అధ్యయనం అనంతరం ఈ సాగును ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.

మా కంటెంట్ మీకు నచ్చినట్లైతే
మా యూట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL

ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Business Ideas in Telugu
Best business ideas
New business ideas
Online business ideas
Startup ideas
Business ideas in India
Business ideas for women
Low investment business ideas
Small business ideas from home

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images