Menu Close

Business Ideas in Telugu: 2 ఎకరాల భూమి నుంచి ప్రతి నెలా 6 లక్షల ఆదాయం

Business Ideas in Telugu: మీ వద్ద వ్యవసాయ భూమి ఉంటే.. అందులో భారీ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దానిని నుంచి ఉత్పత్తయ్యే కరెంట్‌ను ప్రభుత్వానికి విక్రయించి.. ఆదాయం పొందవచ్చు. ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు బోలెడు అవకాశాలున్నాయి.

మీ వద్ద డబ్బు ఎక్కువగా లేకుంటే.. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడా వ్యాపారం చేయవచ్చు. భారీ ఎత్తున పెట్టాలనుకున్నా.. బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడితో చేయలగలిగే ఓ అద్భుతమైన వ్యాపారం గురించి ఇక్కడ తెలుసుకుందాం. కోటి రూపాయలా? మనం చేయలేములే అని భావించవద్దు.

బ్యాంకులు రుణాలు కూడా ఇస్తాయి. మీకు వచ్చే ఆదాయం సైతం ఆ స్థాయిలోనే ఉంటుంది. మీ వద్ద వ్యవసాయ భూమి ఉంటే.. అందులో భారీ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దానిని నుంచి ఉత్పత్తయ్యే కరెంట్‌ను ప్రభుత్వానికి విక్రయించి.. ఆదాయం పొందవచ్చు.

మొత్తం 2 ఎకరాల భూమిలో 1.1 మెగా వాట్స్ సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్‌ (Solar Power Plant) ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకోసం 330 వాట్స్ కెపాసిటీ గల 3400 సోలార్ ప్యానెల్స్‌ అవసరమవుతాయి. ఈ ప్లాంట్‌లో ప్రతి రోజూ సగటున 5వేల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది.

ఎండాకాలంలో రోజుకు 5,500 యూనిట్లు, శీతాకాలంలో 3500 విద్యుత్ తయారవుతుంది. సోలార్ ప్లాంట్‌లో డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ఏసీగా మార్చి.. ఏదైనా ప్రైవేట్ సంస్థలకు విక్రయించవచ్చు. లేదంటే కేంద్ర ప్రభుత్వం కుసుమ్ యోజన కింద విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటే… 25 ఏళ్ల పాటు ఖచ్చితమైన ధర వస్తుంది. మీ ప్లాంట్‌లో ప్రతి రోజు 5వేల యూనిట్స్ కరెంట్ తయారై.. ఒక్కో యూనిట్‌కు రూ.4 చొప్పున విక్రయిస్తే.. రోజుకు రూ.20వేల ఆదాయం వస్తుంది. ఇలా ప్రతి నెలా రూ.6 లక్షల వరకు సంపాదించవచ్చు.

ఐతే ఇందులో ఉన్న పెద్ద అవరోధం అంటంటే.. పెట్టుబడి..! ఈ స్థాయిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోట్లల్లో ఖర్చవుతుంది. 1 మెగా వాట్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి పట్టణానికి చెందిన అమిత్ సింగ్ యాదవ్ అనే డాక్టర్..

తన వ్యవసాయ భూమిలో ఇలాంటి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. భారీగా ఆదాయం పొందుతున్నాడు. పీఎం కుసుం యోజన కింద ప్రభుత్వానికే విద్యుత్‌ను విక్రయిస్తూ.. ప్రతి నెలా రూ. 6 లక్షలు సంపాదిస్తున్నాడు. పెట్టుబడి డబ్బులను బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నానని.. నాలుగైదేళ్లలో ఆ రుణాన్ని క్లియర్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చే ఆదాయమంతా.. లాభాలేనని వెల్లడించారు. ఈయన ప్లాంట్ చూసిన తర్వాత.. చాలా మంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.

Subscribe to Our YouTube Channel

ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.

Business Ideas in Telugu
Best business ideas
New business ideas
Online business ideas
Startup ideas
Business ideas in India
Business ideas for women
Low investment business ideas
Small business ideas from home

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading