Menu Close

మీ జీవితాన్ని డబ్బుకి అమ్ముకోవద్దు – Your Money or Your Life Book in Telugu


మీ జీవితాన్ని డబ్బుకి అమ్ముకోవద్దు – Your Money or Your Life Book in Telugu

పుస్తకం పేరు: Your Money or Your Life
రచయితలు: వికీ రాబిన్ (Vicki Robin), జో డొమింగెజ్ (Joe Dominguez)
ప్రచురణ సంవత్సరం: 1992

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం
ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి👇

Telegram WhatsApp

Your Money or Your Life” అనే ఈ పుస్తకం మిమ్మల్ని ఓ ప్రశ్న వేస్తుంది
మీరు డబ్బు కోసం బ్రతుకుతున్నారా లేక బ్రతకడానికి డబ్బు సంపాదిస్తున్నారా?

Your Money or Your Life Book in Telugu

ఈ పుస్తకం మనకి చెప్పేది ఏంటంటే..

  • మనం సంపాదిస్తున్న డబ్బు అంటే నిజంగా మనం జీవితంలో పోగొట్టుకుంటున్న కొంత భాగం.
  • మన జీవితంలోని కొంత సమయాన్ని డబ్బు కోసం అమ్ముకుంటున్నాం.
  • ప్రతి రూపాయి వెనుక మన జీవితంలోంచి పోయిన కొన్ని గంటలు, కొంత శక్తి వుంటుంది.
  • డబ్బు మీద నియంత్రణ కలిగి ఉండడం ద్వారా మనం నిజమైన స్వేచ్ఛను పొందగలము.
  • అవసరమయ్యే డబ్బు ఎంత? అసలు సంపద అంటే ఏంటి? అనేవి మళ్ళీ నిర్వచించాల్సిన విషయాలుగా పుస్తకం చూపిస్తుంది.

ఈ పుస్తకం నుండి కొన్ని ముఖ్యమైన విషియాలు:

మనం సంపాదించే డబ్బు వెనుక మన జీవితం ఉంది.
మన సమయం ఎంత విలువైనదో మనం గుర్తించాలి.

కేవలం ఆఫీసు లో గడిపే సమయం, మన శ్రమ ఇవి మాత్రమే కాదు,
మనం ఉద్యోగానికి వెళ్లడానికి అయ్యే ఖర్చులు, పట్టే టైం అవి కూడా గమనించాలి.
వాస్తవానికి, నిజంగా మనకి మిగిలేది ఎంత అని తెలుసుకోవాలి.

మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి మీ జీవితం నుండి కొంత సమయం తీసుకుపోతుంది.
ఈ ఖర్చు నిజంగా అవసరమా? సంతోషాన్ని ఇస్తుందా? అని తెలుసుకుని ఖర్చుపెట్టాలి.

  • డబ్బు ఎందుకు దాచుకోవాలో తెలుసా..!
  • ఇది మన లక్ష్యాలను చేరుకోవడం కోసం ఉపయోగపడుతుంది.
  • ఉద్యోగమొక్కటే మన లక్ష్యం కాదు, ఆనందంగా వుండటం, స్వేచ్ఛగా వుండటం.
  • మన జీవితాన్ని మన అదుపులో ఉంచుకోవడం కోసం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతృప్తి, ఆనందం ఎలా పొందాలో నేర్చుకోవాలి.
డబ్బుకి మనం బానిస కాకుండా, అది మన కోసం పని చేసే సాధనంగా మలచాలి.

సంపాదనకు పరిమితి పెట్టండి: అవసరమైనంత మాత్రమే సంపాదించండి.
ఖర్చుపై అవగాహన పెంచుకోండి: ఎక్కడ, ఎందుకు ఖర్చవుతోంది అని తెలుసుకోండి.
జీవితానికి విలువ ఇవ్వండి: డబ్బు కాదు, సంతోషమే గమ్యం.
తృప్తికరమైన జీవితం గడపండి: ఎక్కువ సంపద కాదు, ఆలోచనాత్మక జీవితం ముఖ్యం.

మన జీవితాన్ని డబ్బుకి అమ్ముకోవద్దు,
మనం ఎలా జీవించాలో మనమే నిర్ణయించుకోవాలి.

తప్పకుండా ప్రతిఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది
ఇక్కడ పూర్తిగా చదవండి (ఇంగ్షీషు లో)👇
Your Money or Your Life

మరిన్ని పుస్తకాలు ఇక్కడ చదవండి👇
చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద మార్పుని తీసుకురాగలవు – The Compound Effect Book in Telugu
డబ్బు కన్నా ప్రశాంతత ముఖ్యం – The Monk Who Sold His Ferrari Book in Telugu

Like and Share
+1
1
+1
0
+1
0
Share with your friends & family
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading poll ...

Subscribe for latest updates

Loading