చిన్న చిన్న అలవాట్లు కూడా పెద్ద మార్పుని తీసుకురాగలవు – The Compound Effect Book in Telugu
పుస్తకం పేరు: The Compound Effect
రచయిత: Darren Hardy
ప్రచురణ సంవత్సరం: 2010
చిన్న చిన్న అలవాట్లు కాలక్రమంలో మన జీవితాన్ని ఎంతగా మార్చగలవో ఈ పుస్తకం చెబుతుంది.

Important points from “The Compound Effect” in Telugu
- మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు – ఏది తినాలి, ఎంత టైం నిద్రపోవాలి, ఎలా మాట్లాడాలి – ఇవన్నీ మన జీవితాన్ని నిదానంగా మారుస్తాయి.
- ప్రతి రోజూ ఒక మంచి పని చేస్తే, అది క్రమంగా మనలో పెద్ద మార్పుని తెస్తుంది.
- ఉదాహరణకు, రోజూ తక్కువ తినడం → బరువు తగ్గడం → ఆరోగ్యం మెరుగు → జీవితం సంతోషంగా మారుతుంది.
- రోజూ ఒకే పని చేయడం కొంచెం బోర్ గా అనిపించవచ్చు. కానీ అదే క్రమం తప్పకుండా చేయడం వల్లే మనం ముందుకు వెళ్లగళం.
- మీరు ఎవరితో సమయం గడుపుతారో, వాళ్ళ అలవాట్ల ప్రభావం మీ మీద పడుతుంది. అందుకని మంచివాళ్ళతో ఉండండి – వాళ్ళ ఆలోచనలు, ప్రేరణ మీలోకి వస్తాయి.
మీరు చేస్తున్న పని ఎలా, ఎంత మార్పునిస్తుందో తెలుసుకోవాలి.
ఉదాహరణకి, మీరు రోజూ ఎంత ఖర్చు చేస్తున్నారో, ఎంత టైం వృధా చేస్తున్నారో గమనిస్తే తప్ప ఆ మార్పు మీకు అర్థం కావదు.
రేపు మొదలుపెడతా” అనే మాటే మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది.
ఈ రోజే మొదలు పెట్టండి. ఎంత చిన్న పని అయినా సరే.
నిజానికి పెద్ద పెద్ద విజయాలు అనేవి ఒక్క రాత్రిలో రావు.
ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేస్తే అది ఓ పెద్ద గమ్యానికి మిమ్మల్ని చేరుస్తుంది.
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.
మీరు చేసే చిన్న పనులే మీ జీవితాన్ని నిర్మిస్తాయి.
మీ శ్రమకు ఫలితం వెంటనే కనిపించదు.
కానీ కొన్నాళ్ల తరువాత అది పెద్దగా మారి మీ ముందు నిలబడుతుంది.
మంచి అలవాట్లను పెంచుకోండి, చెడ్డవి వదిలేయండి.
అవే మీ ఆరోగ్యం, డబ్బు, మనశ్శాంతి అన్నింటినీ ప్రభావితం చేస్తాయి.
ప్రతిరోజూ 10 నిమిషాలు పుస్తకం చదవడం.
రోజూ 15 నిమిషాలు నడవడం.
రోజూ కాఫీ తాగడం వదిలేయడం
ఇవన్నీ చిన్న చిన్న మార్పులే,
కానీ కొన్ని నెలలు, సంవత్సరాల తరువాత
ఇవే మన ఆరోగ్యం, జ్ఞానం, ధనం ఇలా అన్నింటినీ మార్చేస్తాయి.
ఈ పుస్తకాన్ని పూర్తిగా తెలుగులో ఇక్కడ చదవండి👇
The Compound Effect in Telugu
మరిన్ని పుస్తకాలు ఇక్కడ చదవండి👇
డబ్బు కన్నా ప్రశాంతత ముఖ్యం – The Monk Who Sold His Ferrari Book in Telugu
టెన్షన్ పడకుండా బ్రతకడం ఎలా – How to Stop Worrying and Start Living Book in Telugu