డబ్బు కన్నా ప్రశాంతత ముఖ్యం – The Monk Who Sold His Ferrari Book in Telugu
పుస్తకం పేరు: The Monk Who Sold His Ferrari
రచయిత: రాబిన్ శర్మ (Robin Sharma)
ప్రచురణ సంవత్సరం: 1997
మన జీవితంలో ధనవంతుడు కావడం కన్నా ప్రశాంతంగా జీవించడం ముఖ్యమనే సందేశాన్ని ఇస్తుంది ఈ పుస్తకం. జూలియన్ మాంటెల్ అనే విజయవంతమైన న్యాయవాది తన ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత, అతని జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటాడు. అతడు హిమాలయాలకు వెళ్లి సివానా సన్యాసుల దగ్గర జీవన సత్యాలు తెలుసుకుంటాడు. ఆ జీవన సత్యాలే ఈ పుస్తకంలో మాట్లాడినవి.

Important Points From the Book “The Monk Who Sold His Ferrari” in Telugu
- చిన్న మార్పులు, పెద్ద ఫలితాలకు దారితీస్తాయి. ప్రతి రోజు 1% మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవాలి.
- మన రోజును ప్రారంభించే విధానం మన రోజంతా ప్రభావం చూపుతుంది.
- కొరికలకి లోబడకుండా జీవించడమే స్వేచ్ఛ.
- సెల్ఫ్ కంట్రోల్ అనేది విజేతల లక్షణం. మన శరీరాన్ని, మనస్సును, భావోద్వేగాలను నియంత్రించగలిగినవారే నిజమైన విజేతలు.
- నిరంతర నేర్చుకోకుండా ఏదీ సాధ్యం కాదు. ప్రాక్టీస్ వలనే మన ప్రతిభ మెరుగవుతుంది.
- బాధలు జీవితంలో భాగమే. వాటిని దాటితేనే మనం నిజమైన ఆనందాన్ని, అర్థాన్ని పొందగలుగుతాం.
- ప్రతి రోజు ఒక మంచి పని చేయడం మన జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. అది మరొకరికి ముఖంలో చిరునవ్వును తేగలిగితే మనకూ ఆనందం కలుగుతుంది.
- మనసులో ప్రశాంతత ఉంటే జీవితం నిండుగా, సంతోషంగా ఉంటుంది. అది ధనంతో కాదు, ధ్యానంతో వస్తుంది.
- నిజమైన ఆనందం సంపదలో కాదు మనలోనే ఉంటుంది అనే సందేశం ఇస్తుంది ఈ పుస్తకం.
- కాలం పై మనం గెలేవలేం కానీ సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి ఉపయోగించాలి.
- ప్రతి మనిషిలో ఒక గొప్ప శక్తి ఉంది. దానిని వెలికితీసుకోవాలంటే శ్రమ, క్రమశిక్షణ, ఆత్మపరిశీలన అవసరం.
- మనస్సును గెలిచినవాడు ప్రపంచాన్ని గెలిచినట్టే. మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్మానిస్తాయి.
- రోజూ కొద్దిసేపు మౌనంగా కూర్చొని ధ్యానం చేయడం మన ఆత్మకు శాంతినిస్తుంది.
- లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోవడం ద్వారా వాటిని సాకారం చేసుకునే అవకాశం పెరుగుతుంది.
- సాధన, సమయపాలన, ఆత్మనిబద్ధత వంటి అంశాలు మన జీవితాన్ని గమ్యానికి తీసుకెళ్తాయి.
- ఇతరులను సహాయపడటం వల్ల మనకి కూడా ఆనందం కలుగుతుంది.
- రోజూ చిన్నచిన్న మంచి పనులు చేయడం మన స్వభావాన్ని, జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
- మన జీవితంలో ధనవంతుడు కావడం కన్నా ప్రశాంతంగా జీవించడం ముఖ్యం.
ఈ పుస్తకాన్ని ఇక్కడ పూర్తిగా చదవండి(ఇంగ్షీషు లో) – The Monk Who Sold His Ferrari
Like and Share
+1
1
+1
+1