Menu Close

చిన్న అలవాట్లు, పెద్ద మార్పులు – Atomic Habits Book in Telugu


చిన్న అలవాట్లు, పెద్ద మార్పులు – Atomic Habits Book in Telugu

  • రచయిత: జేమ్స్ క్లియర్
  • ప్రచురణ: 2018
  • విక్రయాలు: 10 మిలియన్ల పైగా

ఈ పుస్తకంలో ఏముంది?

“ఎటామిక్ హ్యాబిట్స్” మన జీవితంలో చిన్నచిన్న అలవాట్లు ఎంత ముఖ్యమో చెబుతుంది. మన జీవితాన్ని మార్చాలంటే పెద్ద మార్పులు అవసరం లేదు; చిన్న అలవాట్లు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయని ఈ పుస్తకం వివరిస్తుంది.

Atomic Habits Book in Telugu

ఎందుకు చదవాలి?

మీరు జీవితంలో మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలని లేదా చెడు అలవాట్ల నుంచి బయటపడాలని అనుకుంటే, ఈ పుస్తకం మీకు చాలా సహాయం చేస్తుంది. సులభంగా అనుసరించే టెక్నిక్స్, ప్రాక్టికల్ ఉదాహరణలతో మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.

ముఖ్యమైన విషయాలు:

  • చిన్న అలవాట్ల శక్తి: ప్రతిరోజు చేసే చిన్న పనులు మీ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో వివరించబడింది.
  • అలవాట్లను మార్చడం ఎలా? చెడు అలవాట్లను ఎలా తొలగించాలో, మంచి అలవాట్లను ఎలా ఏర్పరచుకోవాలో చాలా సింపుల్‌గా వివరిస్తుంది.
  • అలవాట్లను కొనసాగించడం: కొత్త అలవాట్లను ఎలా కంటిన్యూ చేయాలి, మోటివేషన్ లేకపోయినా అలవాట్లకు ఎలా స్టిక్ అవ్వాలో చూపిస్తుంది.
  • ప్రోగ్రెస్ ట్రాకింగ్: మీ అలవాట్లను ట్రాక్ చేయడం ద్వారా, మరింత మెరుగైన ఫలితాలు పొందే మార్గాలు సూచిస్తుంది.

1. 1% మెరుగుదల (1% Improvement):

  • పెద్ద పనులు చేయాలంటే మనకు కష్టంగా, బోర్‌గా అనిపిస్తుంది.
  • కానీ ప్రతిరోజూ కేవలం 1% మెరుగుదల చేస్తే, ఏడాది పూర్తయ్యేసరికి మన జీవితం పూర్తిగా మారిపోతుంది.
  • ఉదాహరణకు, రోజూ 10 నిమిషాలు పుస్తకం చదవడం, నెలరోజుల్లో 300 నిమిషాల చదివినట్లే.

2. Habit Stacking (అలవాట్లను కలపడం):

  • మీకు ఇప్పటికే ఉన్న అలవాటుకు కొత్త అలవాటును జోడించడం.
  • ఉదాహరణకు, “నేను ఉదయం టీ తాగిన తర్వాత 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను.”
  • ఇలా అలవాట్లను కలిపితే కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా సులువు అవుతుంది.

3. 2-Minute Rule (2 నిమిషాల రూల్):

  • కొత్త అలవాటు మొదలుపెట్టాలంటే కేవలం 2 నిమిషాల్లో చేసేలా చూడండి.
  • ఉదాహరణకు, “రోజూ యోగా చేయాలి” అంటే మొదట్లో “2 నిమిషాలపాటు మాత్రమే స్ట్రెచింగ్ చేస్తాను” అని ఫిక్స్ చేయండి.
  • ఈ విధంగా మొదలుపెడితే అలవాటు కొనసాగించడం ఈజీ అవుతుంది.

4. పరిసరాల ప్రభావం (Environment Matters):

  • మీ పరిసరాలను మీ అలవాట్లకు అనుకూలంగా మార్చుకోండి.
  • ఉదాహరణకు, మీకు రోజూ పుస్తకం చదవాలని ఉందా? పుస్తకాన్ని బెడ్ పక్కనే పెట్టుకోండి.
  • వ్యాయామం చేయాలని ఉందా? వ్యాయామ బట్టలు ముందుగానే రెడీగా ఉంచండి.

5. Track Your Habits (మీ అలవాట్లను ట్రాక్ చేయండి):

  • మీరు చేసే అలవాట్లను రోజూ గుర్తుంచుకోవడం (tracking) ద్వారా మీ ప్రోగ్రెస్ స్పష్టంగా తెలుస్తుంది.
  • ఇలా ట్రాక్ చేస్తే, అలవాట్లలో క్రమశిక్షణ వస్తుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత మీ రోజువారీ అలవాట్లను స్పష్టంగా అర్థం చేసుకుంటారు, వాటిని మెరుగుపరచి జీవితంలో మంచి మార్పులు చూడగలరు.

ఈ పుస్తకాన్ని తెలుగు ఇక్కడ పూర్తిగా చదవండి👇
Atomic Habits in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Book Recommendations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading