ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
20 Best Quotes in Telugu – నిజాయతీ లేని తెలివి ప్రమాదకరం.
తెలివిలేని నిజాయితీ,
నిరుపయోగం.
నిజాయతీ లేని తెలివి..
ప్రమాదకరం.
ఇతరుల ఓటమి
నీ గెలుపు కాదు.
అలానే, ఇతరుల గెలుపు
నీ ఓటమి కాదు.
సంతృప్తి
పేదవాణ్ణి ధనవంతునిగా చేస్తుంది.
అసంతృప్తి
ధనవంతుణ్ణి పేదవానిగా చేస్తుంది.
నాయకత్వమంటే
దారిపొడవునా
ముందు నడవడం కాదు.
బాట వెయ్యడం.
త్రోవ చూపడం.
ఎంతటివారికైనా విమర్శల బాధ తప్పదు.
సింహమైనా ఈగల బెడద తప్పించుకోలేదు కదా.
అందుకే ఎవరో ఏదో అన్నారని దిగులు పడకు.
చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి.
కానీ వారితో విరోధంగా ఉండకూడదు.
55 Telugu Quotes from Bhagavad Gita, Bible and Quran – తెలుగు కోట్స్
ప్రతి అవకాశంలోనూ
కొన్ని అడ్డంకులు ఉంటాయి.
ప్రతి అడ్డంకి వెనకా
కొన్ని అవకాశాలు ఉంటాయి.
మనం దేన్ని చూస్తామన్నదే ముఖ్యం.
ప్రకృతి, కాలం, సహనం..
ఈ మూడూ మాన్పలేని గాయం లేదు.
నువ్వు వెళ్లే దారిలో
మొరుగుతూ ఉన్న కుక్కలన్నిటినీ
నోరు మూయించాలనుకుంటే
ఎన్నటికీ గమ్యాన్ని చేరలేవు.
అన్నింటికీ
దేవుడే ఆధారమట్లు ప్రార్థించు
మొత్తం నీ మీదనే ఆధారపడినట్లు పనిచెయ్యి.
20 Best Quotes in Telugu – Must Read
తనకు ఏ విధంగానూ
సహాయపడలేనివారిపట్లా,
తనేం చేసినా
ఎదిరించలేనివారిపట్లా
ఒక మనిషి
ప్రవర్తించే విధానమే
అతని వ్యక్తిత్వానికి
అసలైన కొలమానం.
తెలియనిది అడిగితే
బయటపడే అజ్ఘానం కొద్దిసేపే.
అడగకపోతే జీవితాంతం అజ్ఘానమే.
Top 50 Telugu Quotes on Hard Work & Success
తోటివారితో కలసి నడుస్తూనే
వారిని తన దారిలో నడిపించమే నాయకత్వం.
ధైర్యమంటే
ప్రమాదాన్ని లెక్కచెయ్యకపోవడం కాదు.
ప్రమాదాన్ని
సరిగ్గా అంచనా వెయ్యడం, అధిగమించడం.
జీవితంలో అన్నీ కోల్పోయినా,
భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది.
దానిని జాగ్రత్తగా నిర్మించుకోవాలి
స్వేచ్ఛ విలువైనది.
దాన్ని మితంగా, లెక్కప్రకారం,
అవసరమైనంత మేరకే వాడుకోవాలి.
మంచి దేశాన్ని నిర్మించాలంటే,
మందు మంచి పౌరుల్ని తయారుచేయాలి.
20 Friendship Quotes in Telugu – ఫ్రెండ్షిప్ కోట్స్
మన కోరికలు ఎంత తగ్గితే
దేవుడికి మనం అంత దగ్గరౌతాము.
చెసే పనిలో
సంతోషాన్ని వెతుక్కోండి.
డబ్బును తానుగా మిమ్మల్ని
వెతుక్కుంటూ వస్తుంది.
బాగా బతకాలని కోరుకో,
ఎక్కువ రోజులు బతకాలని కాదు.
మంచి ఆరోగ్యం కోసం
రోజూ కొంత సమయం కేటాయించకపోతే,
జబ్బు పడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు.
వయసు మళ్ళిన వారివి
వెనుకటి కాలపు గాధలు,
వయసులో ఉన్న వారివి
ముందున్న స్వప్నాలు.
విజయవంతమైన వ్యక్తి కావడం కంటే
విలువైన వ్యక్తి అవడానికి ప్రయత్నించండి.
అలవాట్లు అనేవి
మనం ఉపయోగించే
చేతికర్రలా ఉండాలి కాని,
ఆధారపడే
ఊతకర్రలుగా ఉండకూడదు.
అవకాశాలు గుడ్ల లాంటివి.
వాటిని తాజాగా ఉన్నప్పుడే పొదగాలి.
తెలివితక్కువతనాన్ని
తెలుసుకోలేనంత
తెలివితక్కువతనం
మరొకటి ఉండదు.
“సోమరితనం”
మనదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద రోగం.
దానిని పెంచి పోషించేది ప్రభుత్వాలే..
ఒక గుడ్డివాడు
మరొక గుడ్డివాడికి
దారి చూపితే
ఇద్దరూ గోతిలో పడతారు.
మన సంస్కారం చెప్తుంది
కుటుంబం ఎలాంటిదో..
మనం మాట్లాడే మాటాలు చెప్తాయి
స్వభావం ఎలాంటిదో..
మనం చూసే చూపు చెప్తుంది
ఉద్దేశ్యం ఏమిటో..
మనం చేసే వాదన చెప్తుంది
జ్ఞానం ఎంతుందో..
దారి మాత్రం తెలిసి
వాహనం నడిపడం రాని వ్యక్తిని
విమర్శకుడు అంటారు.
కాలం మారుతుంది – Inspiring Telugu Quotes
Telugu Quotes on Middle Class Family – తెలుగు కోట్స్
Top 20 Money Quotes in Telugu – మనీ కోట్స్
20 Telugu Quotes on Trust