Menu Close

55 Telugu Quotes from Bhagavad Gita, Bible and Quran – తెలుగు కోట్స్

55 Telugu Quotes from Bhagavad Gita, Bible and Quran – తెలుగు కోట్స్

Telugu quotes from the Bhagavad Gita encapsulate timeless wisdom, guiding lives with profound spiritual insights, enriching souls with divine teachings passed through generations.

Telugu Quotes from Bhagavad Gita

ఇతరులను అనుకరిస్తూ బ్రతికే కంటే
అపరిపూర్ణంగా అయినా
నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం.

శ్రద్ధగా పని చేయకుండా
ఎవరూ మంచి ఫలితాన్ని పొందలేరు.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (8)

ప్రయత్నం ఎప్పటికీ వృథా కాదు.
వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా
మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది.

కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి.
అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం
అశాంతి మాత్రమే మిగులుతుంది.

నీ తప్పు లేకున్నా..
నిన్ను ఎవరైనా బాధపెడితే
నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాతకాకపోయినా
వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది.

విశిష్టమైన గుణం, శోభ, శక్తి కలిగింది ఏదైనా సరే..
అది నా తేజము నుంచే ఆవిర్భవించిందని తెలుసుకో.

మనం బయటి ప్రపంచాన్ని కళ్లతో చూస్తున్నాం.
చర్మంతో తాకుతున్నాము.
చెవులతో వింటున్నాం.
నాలుకతో రుచి చూస్తున్నాం.
మంచి వాసనలు నాసికంతో ఆస్వాదిస్తున్నాం.
ఈ ఐదింటి వల్ల బయట ప్రపంచం మన లోపలకు వెళ్తూ ఉంటుంది.
కానీ ఈ ఇంద్రియములు జడములు.
వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తుంది.
మరణించిన తర్వాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి.
కానీ అవి ఆయా పనులను చేయలేవు.
కాబట్టి బయటి ప్రపంచం అంతా మన సృష్టి.
మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది.

ఎవరు భక్తితో నాకు
పవిత్రమైన పుష్పమైనా, ఫలమైనా, ఉదకమైనా
ఫలాపేక్షరహితంగా సమర్పించుచున్నారో
అట్టివారిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

ఒకసారి అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడిగాడు
“ఈ గోడ పై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా..
అది ఎలా ఉండాలంటే..
సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దు:ఖం రావాలి..
దు:ఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి.
అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా రాశాడు..
కాలం మారుతుంది“.

ఓడిపోయానని బాధపడకు.
ఇంకోసారి ప్రయత్నించు..
ఈసారి నీకు నేను తోడుగా ఉంటాను.

Telugu Quotes from Mahabharatam Telugu Bucket Quotes (3)

అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే కనుక..
ఒకరిని ద్వేషించడం అనేది
తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది.

దు:ఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు..
సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు..
రాగం, భయం, క్రోధం పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్తారు.

ఏ పనైనా కష్టపడితే పూర్తవుతుంది.
కలలు కంటూ కూర్చొంటే అణువంతైనా ముందుకు సాగదు..
సింహం నోరు తెరుచుకుని కూర్చున్నంత మాత్రాన
వన్య మృగం దానికది నోటి దగ్గరికి వస్తుందా??.

ఏ విషయం మీదా ఆసక్తి లేనివారంటూ ఎవ్వరూ ఉండరు.
ఎలాంటి ఆసక్తి ఉంటుందో..
అలాంటివారిగానే తయారవుతారు.
ఎలాంటి ఆలోచనలు ఉంటే..
అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది.
అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు.

చావు, పుట్టుకలు సహజం.
ఎవరూ వాటిని తప్పించుకోలేరు.
వివేకవంతులు వాటి గురించి అస్సలు ఆలోచించరు.

Telugu Quotes from Bible

Telugu quotes from the Bible echo divine truths, offering solace and guidance, enriching hearts with the timeless wisdom of Christian scriptures.

నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ..
నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును.
ద్వితీయోపదేశ కాండం

శ్రమయందు ఓర్పు గలవారై,
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి.
రోమా 12.12

భయపడకు..
నిన్ను నడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను.
ఝర్మియా 1:8

అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసినవాడా..
నీవు మరల మమ్ము బ్రతికించెదవు.
భూమి యొక్క అగాథ స్థలములలో నుంచి
నీవు మరల మమ్ములను లేవనెత్తెదవు.
కీర్తన 71:20

మీకు ఈ శిక్షను కొని వచ్చిన దేవుడు
మిమ్మల్ని కాపాడి శాశ్వతానంద భరితులను చేయును.
బారూకు 4:29

Jesus Quotes Telugu – Bible Quotes Telugu - Telugu Bucket

దయాగుణం, సత్యం పరస్పరం కలిసే ఉంటాయి.
అలాగే ధర్మం, శాంతి ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి.
బైబిల్

ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు.
కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే
నీతిమంతులుగా పరిగణించబడతారు.
రోమన్స్ 2:13

నీతిమంతులు మొరపెట్టగా యోహోవా ఆలకించును.
వారి శ్రమలన్నింటి నుంచీ వారిని విడిపించును.
కీర్తనలు 34:17

నిన్ను చూసి ఈ ప్రపంచం మారాలి..
కానీ ఈ ప్రపంచాన్ని చూసి నువ్వు మారవద్దు.
బైబిల్

ఎదుటివారి కన్నీళ్లు చూసి..
నీవు ఆనందించాలని అనుకుంటే
ఆ క్షణమే నీవు మరణించినట్టు లెక్క.
బైబిల్

ఎదుటివారికి క్షమించబడే అర్హత లేకపోయినా,,
వారిని మీరు క్షమించండి.
ఎందుకంటే ప్రశాంతంగా ఉండే అర్హత మీకు ఉంది కనుక.
బైబిల్

దేని గురించీ చింతించకండి.
కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థన విజ్ఞాపముల ద్వారా
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు
దేవునికి తెలియజేయండి.
ఫిలిప్ఫీయులు 4:6

Jesus Quotes in Telugu, Bible Quotes in Telugu, Bible Verses in Telugu, Telugu Bible Quotes, Jesus Telugu Quotes

పాపము వల్ల వచ్చు జీతం మరణం..
అయితే దేవుని కృపావరము
మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవం.
రోమా 6:23

భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు.
కనుక వారికి క్షేమం కలుగదని,
వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురని నాకు తెలుసు.
ప్రసంగి 8:13

ప్రభువే నాకు దీపం..
నాకు రక్షణం..
ఇక నేను ఎవరికీ భయపడక్కర్లేదు.
ప్రభువే నాకు కోట..
ఇక నేను ఎవరికీ వెరువనక్కరలేదు.
కీర్తనలు 27:1

Telugu Quotes from Quran

Telugu quotes from the Quran resonate with profound spiritual truths, offering guidance and enlightenment, enriching hearts with the wisdom of Islamic scriptures.

ప్రేమించే బంధువులను ప్రేమించడం..
బంధుప్రేమ అనిపించుకోదు..
మిమ్మల్ని ప్రేమించని బంధువులను కూడా
మీరు ప్రేమించడమే నిజమైన బంప్రేమ.
మహమ్మద్ ప్రవక్త.

కూలీలతో పని చేయించుకున్నప్పుడు..
వారి చెమట ఆరక ముందే వారి కష్టార్జితం చెల్లించాలి.
ఖురాన్

ఉపవాసంతో, ఆకలిదప్పులతో మనిషిని బాధించడం..
ఇస్లాం ఉద్దేశం కాదు..
పేదవాడి బాధలు తెలుసుకోవడమే ముఖ్యోద్దేశం.
ఖురాన్

బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు
వారి హక్కు ఇవ్వు.
మరియు వృథా ఖర్చులతో ధనాన్ని వ్యర్థం చేయకు.
ఖురాన్

నిన్ను నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకు.
ఖురాన్

చెడు అలవాటును ప్రారంభంలోనే అరికట్టకపోతే..
అది అతి త్వరలోనే ఒక అవసరంగా మారిపోతుంది.
ఖురాన్

తమకి ఏమి కావాలో,
అది ఎక్కడ దొరుకుతుందో తెలిసినవారు
జీవితంలో పైకి వస్తారు.
ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి..
నీకు ఏది సరైందో వెతికి పట్టుకోవడమే జీవితం.
ఖురాన్

రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ బేధాలు లేకుండా
అందరూ ఒకరికొకరు భుజానికి భుజం..
పాదానికి పాదం..
కలిసి నమాజుకై రోజుకి 5సార్లు నిలబడి
విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు.
ఇస్లాంలో అంటరానితనం లేదు.
ఖురాన్

సర్వలోకాలకూ ప్రభువైన అల్లాయే
సర్వస్తోత్రాలకూ అర్హుడు.
ఖురాన్

మనం చేసే పనులు మంచివా లేక చెడువా అని
ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేది మన జయాపజయాలే.
ఖురాన్

Telugu Quotes by Goutham Buddha

నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు.
కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం నువ్వు హాని చేయకు.
గౌతమ బుద్ధుడు

మన లోపల శత్రువు లేనంత వరకు
బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు.
గౌతమ బుద్ధుడు

ద్వేషాన్ని దూరం చేయగలిగేది..
ప్రేమే తప్ప ద్వేషం కాదు.
గౌతమ బుద్ధుడు

వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా..
శాంతిని, కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట విన్నా చాలు.
గౌతమ బుద్ధుడు

తనని తాను వశపరుచుకోగల మనిషిని
దేవతలు సైతం ప్రభావితం చేయలేరు..
వారి విజయాలను అపజయాలుగా మార్చలేరు.
గౌతమ బుద్ధుడు

ఏ వ్యక్తి పవిత్రమయిన ఆలోచనలతో మాట్లాడినా
లేక పని చేసినా ఆనందం ఎప్పటికీ వారిని విడువని నీడలా
వెన్నంటే ఉంటుంది.
గౌతమ బుద్ధుడు

Buddha Jayanti Telugu Quotes Top 20

శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే..
కానీ మనసుకు మాత్రం
తప్పు చేసిన ప్రతిసారీ మరణమే.
గౌతమ బుద్ధుడు

శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు.
గౌతమ బుద్ధుడు

ఎవరూ చూడట్లేదని తప్పు చేయకు.
అందరూ చేస్తున్నారని అప్పు చేయకు.
ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదాలే అని గుర్తుంచుకో.
గౌతమ బుద్ధుడు

మనిషికి నిజమైన ఆనందం లభించేది
కేవలం వారి ఆలోచనల్లోనే.
గౌతమ బుద్ధుడు

కోపం కలిగి ఉండడం
నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఉద్దేశంతో
అరచేతిలో ఉంచుకోవడమే.
అది నిన్నే దహించివేస్తుంది.
గౌతమ బుద్ధుడు

గతాన్ని తలచుకోవడం మానుకో..
భవిష్యత్తు గురించి కలలు కనకు..
ప్రస్తుతం పై మనసు లగ్నం చేయి.
గౌతమ బుద్ధుడు

మన ముందు ఏముంది?
పక్కన ఏముంది??
అన్నది విషయం కాదు..
అసలు మనలో ఏముంది??
అన్నదే అసలైన విషయం.
గౌతమ బుద్ధుడు

సాయం చేసేవాడు దేవుడు.
మంచిగా మాటలు చెప్పేవాడు గురువు.
నీతిగా బ్రతికేవాడు మనిషి.
గౌతమ బుద్ధుడు

గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు..
మనసు ఉండాలి.
గౌతమ బుద్ధుడు

55 Telugu Quotes from Bhagavad Gita, Bible and Quran – తెలుగు కోట్స్

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images