‘కోర్ట్’ మూవీ రివ్యూ – నాని, ప్రియదర్శి – Court Movie Review – 2025
సినిమా విడుదల వరకు ఎంతగా ప్రచారం చేసినా, ఎంతగా చెప్పుకున్నా, నిజమైన ఫలితం రిలీజ్ తరువాతే తెలుస్తుంది. విడుదలకు ముందే మీడియాకు సినిమా చూపించడం అంటే సాహసం. కానీ నాని తనపై నమ్మకంతో ఈ కోర్ట్ డ్రామాను మార్చి 12న, రెండు రోజుల ముందే మీడియాకు ప్రదర్శించాడు. నాని ధైర్యం ఎందుకని? ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

కథ: చంద్ర శేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్‌లో ఫెయిల్ అవుతాడు. పార్ట్-టైం ఉద్యోగాలు చేసుకుంటూ బైక్ కూడా కొంటాడు. ఈ సమయంలో జాబిల్లి (శ్రీదేవి) పరిచయం అవుతుంది, వారి పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయం జాబిల్లి మామ మంగపతి (శివాజీ)కి తెలుసుతుంది. కోపంతో, చందును పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు. లాయర్ దామోదర్ (హర్ష వర్దన్) కూడా మంగపతికి తోడుగా ఉంటుంది. చందుని కాపాడేందుకు లాయర్ మోహన్ రావు (సాయి కుమార్)కి అసిస్టెంట్ తేజ (ప్రియదర్శి) ఏం చేస్తాడు? ఈ కథలో జాబిల్లి తల్లి సీతారత్నం (రోహిణి) పాత్ర ఏంటి? అన్నదే అసలు కథ.
చట్టంపై అవగాహన: ఈ కథ పోక్సో చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుంది. చట్టం ఏమి చెబుతుంది, ఎక్కడికి వర్తిస్తుంది, దీన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో దర్శకుడు వివరించారు. చట్టాల గురించి స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లే నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు.
ఫస్ట్ హాఫ్: ఫస్ట్ హాఫ్‌లో ప్రేమ కథలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ అది కొంత మందికి నచ్చకపోవచ్చు. మంగపతి పాత్ర మొదట్లో నెగెటివ్ కాకపోయినా, తరువాతి భాగంలో అతని ప్రతికూలత బయటపడుతుంది. ఫస్ట్ హాఫ్‌లో శివాజీ పాత్ర హైలైట్ అని చెప్పవచ్చు.
సెకండ్ హాఫ్: ఇంటర్వెల్ తరువాత కథ గాడిలో పడుతుంది. కోర్ట్ డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది, కానీ పూర్తిగా ఎంగేజింగ్ అనిపించదు. సెకండ్ హాఫ్‌లో ఎక్కువగా కోర్ట్ సీన్లు మాత్రమే ఉంటాయి. ప్రియదర్శి పాత్రలో చివరి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటాయి.
నటీనటులు: మంగపతి పాత్రలో శివాజీ చాలా బాగా నటించారు. ప్రియదర్శి తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సాయి కుమార్, హర్ష వర్దన్ లాయర్లుగా బాగా నటించారు. రోషన్, శ్రీదేవి, రోహిణి తదితరులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతికంగా: విజయ్ బుల్గానిన్ సంగీతం, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కోర్ట్ సెట్ నేచురల్‌గా ఉంది. నిర్మాతగా నాని మంచి కథను తెరపైకి తెచ్చాడు.
‘కోర్ట్’ మూవీ రివ్యూ – నాని, ప్రియదర్శి – Court Movie Review – 2025