Telugu Movies Releasing in This Summer – 2025 – ఈ సమ్మర్ లో రిలీజ్ అవ్వబోతున్న టాప్ 10 సినిమాలు
Kubera (కుబేరా): తమిళ నటుడు ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కుబేర’. క్లాసిక్ సినిమాలు దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. టాలీవుడ్ అగ్ర నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.
Ghaati (ఘాటి): అగ్ర కథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ఘాటి(Ghaati). వేదం, కంచె చిత్రాల దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో అనుష్క ట్రైబల్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని కొండ లోయలలో నివసించే జీవితాల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇందులో అనుష్క ఒక బాధితురాలి నుంచి క్రిమినల్‌గా, అనంతరం లెజెండ్‌గా ఎలా మారింది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Kingdom (కింగ్‌డమ్): విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కింగ్‌డమ్. సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ గత చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తన ఆశలన్నీ ప్రస్తుతం కింగ్‌డమ్ మీదే పెట్టుకున్నాడు.
Raaja Saabb (రాజా సాబ్): పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab). భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వలన సమ్మర్ నుంచి వింటర్‌కి ఈ సినిమా షిప్ట్ అవ్వబోతున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Hit 3 (హిట్ 3): నాని ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం హిట్ ది థర్డ్ కేస్(). నాని బ్యానర్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో హిట్‌తో పాటు హిట్ 2 రాగా రెండు బ్లాక్ బస్టర్‌లు అందుకున్నాయి. ఇప్పడు ఇదే ఫ్రాంచైజీ నుంచి 3వ భాగం రాబోతుంది. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ చిత్రం మే 01న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Kannappa (కన్నప్ప): మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa). ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. నాస్తికుడిగా ఉన్న కన్నప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు అనే కథతో ఈ సినిమా రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. హిస్టారికల్ కం మైథాలాజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.
Jack (జాక్): ‘డీజే టిల్లు’(DJ Tillu), టిల్లు 2 చిత్రాలతో తనకంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే సిద్ధు తాజాగా నటిస్తున్న చిత్రం జాక్ (Jack Movie). బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత భాస్కర్ దర్శకత్వంలో సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Mad Square (మ్యాడ్ స్క్వేర్): టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైనమెంట్స్ నుంచి వస్తున్న తాజా ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). “మ్యాడ్” (MAD) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఈ చిత్రంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. మార్చి 28, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే హరిహర వీరమల్లుతో పాటు రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు ఒకే సమయంలో విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
Hari Hara Veera Mallu (హరిహర వీరమల్లు): నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. సమ్మర్‌లో వస్తున్న క్రేజీ సినిమాలలో ఈ చిత్రం ఒకటి. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రం 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Robinhood (రాబిన్ హుడ్): హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమా విషయానికి వస్తే.. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు.