ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ – Game Changer Movie Review in Telugu – 2025
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సంక్రాంతి సంబరాలు పెంచేలా గేమ్ ఛేంజర్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జె సూర్య విలన్ గా నటించగా శ్రీకాంత్, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
రాంచరణ్ ఈ చిత్రంలో ఐఏఎస్ అధికారిగా, ప్రజా నాయకుడిగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి ట్విట్టర్ లో వస్తున్న రెస్పాన్స్, ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ బట్టి ఎలా వుందో తెలుసుకుందాం.
ఎస్ జె సూర్య, జయరామ్, శ్రీకాంత్, సముద్రఖని పాత్రలతో గేమ్ ఛేంజర్ కథ మొదలవుతుంది. పది నిమిషాల తర్వాత రాంచరణ్ లుంగీ గెటప్ లో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే రా మచ్చా సాంగ్ ఉంటుంది. సాంగ్ లో రాంచరణ్ డ్యాన్స్ మెప్పించే విధంగా ఉంటుంది. ఇలా రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఫస్ట్ హాఫ్ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో శంకర్ తన స్టైల్ లో అవినీతి అధికారులు, వ్యాపారవేత్తల గురించి చూపించారు.
ఫస్ట్ హాఫ్ లో రాంచరణ్, ఎస్ జె సూర్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంజలి పాత్ర పరిచయం కాగానే ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది. పెళ్లి బట్టలు గెటప్ లో పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండ్ హాఫ్ పై అంచానాలు పెంచేలా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబౌ యావరేజ్ స్టఫ్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ కాలేదు.
ఇక సెకండ్ హాఫ్ లో తొలి 20 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 20 నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తెరకెక్కించిన విధానం అద్భుతం. ట్విట్టర్ లో అయితే ఆ 20 నిమిషాలు వింటేజ్ శంకర్ అలా వచ్చి వెళ్లారు అని అంటున్నారు. సినిమా మొత్తాన్ని రాంచరణ్ తన భుజాలపై మోయగా ఎస్ జె సూర్య సహకారం అందించారు. తమన్ బిజియం కూడా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది.
ఎస్ జె సూర్య. రాంచరణ్ పెర్ఫామెన్స్, తమన్ బిజియం కోసం గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చూడొచ్చని ఆడియన్స్ అంటున్నారు. చాలా సన్నివేశాలు ఆర్డినరీగా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ మినహా శంకర్ తన రేంజ్ లో ఇతర సన్నివేశాలు రాసుకోలేదు. కమర్షియల్ అంశాల కోసమే కొన్ని సన్నివేశాలు రాసుకునట్లు అనిపిస్తుంది.
ఓవరాల్ గా రాంచరణ్ మరోసారి అబ్బుపరిచే నటన కనబరిచాడు. గేమ్ ఛేంజర్ చిత్రం అబౌ యావరేజ్ కంటెంట్ తో ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బావుంది. కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శంకర్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ 2 లాంటి చిత్రాలకంటే గేమ్ ఛేంజర్ తో బెటర్ అవుట్ పుట్ ఇచ్చారు. సాంగ్స్ చిత్రీకరణ చాలా బావుంది. నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తున్నాయి.
గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ – Game Changer Movie Review in Telugu – 2025