తండేల్ మూవీ రివ్యూ – హిట్టా, ఫట్టా – నాగ చైతన్య, సాయి పల్లవి – Thandel Movie Review – 2025
Thandel Movie Review: వరుస ఫ్లాపుల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యువ సామ్రాట్ నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా. ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా చందు మొండేటి దర్శకత్వం లో వచ్చిన తండేల్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా షోస్ ఇప్పటికే మొదలయ్యాయి. మరి ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఏం చెప్తున్నారో చూద్దాం.

ఒక నిజ జీవిత సంఘటన కి ఎమోషన్ జోడించి అన్ని హంగులను అద్దడం లో డైరెక్టర్ చందు మొండేటి సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి. రియల్ స్టోరీ అయినా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ రాసుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్ లో వచ్చే సీన్స్ ని అయితే చాలా బాగా రాసుకున్నాడు. ఎలివేషన్స్,ఎమోషన్ ఎక్కడ తగ్గకుండా చూసుకున్నాడు.

సినిమాకి సోల్ డిఎస్పీ మ్యూజిక్. మొదటి సీన్ నుండే తన మ్యూజిక్ తో ప్రేక్షకులని కట్టి పడేశాడు. బుజ్జి తల్లి పాట స్క్రీన పైన చాలా బావుంది. ముఖ్యంగా బుజ్జి తల్లి బీజీఎం సినిమా కి ఊపిరిగా నిలిచింది అని చెప్పొచ్చు.
ఇక యాక్షన్ సీన్స్ చాలా బాగా తీశారు. ఫైట్స్ చాలా న్యాచురల్ గా అనిపించాయంటున్నారు. అక్కినేని ఫాన్స్ కి చాలా రోజుల తర్వాత ఫుల్ మీల్స్ ఈ సినిమా. చాలా మంది సాయి పల్లవి కంటే చైతు బాగా నటించాడు అంటున్నారు అంటే అర్థం చేసుకోండి. యువసామ్రాట్ నట విశ్వరూపం యే రేంజ్ లో ఉందో. బొమ్మ ఒకింత యావరేజ్ గానే ఉన్నా, మజిలీ తర్వాత ఆ రేంజ్ కలెక్షన్ రావడం మాత్రం పక్కా అని అంటున్నారు.
హైదరాబాద్ లో న్యూ టూరిస్ట్ ప్లేస్ – Experium Eco Park – New Tourist Place – 2025
తండేల్ మూవీ రివ్యూ – హిట్టా, ఫట్టా – నాగ చైతన్య, సాయి పల్లవి – Thandel Movie Review – 2025 2