ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
చెలియా ఓ చెలియా… చాలే నాకిక ఓ చెలియా
మనసే పలికే తొలి పదనిస నీ వల్ల
కలయా ఇది కలయా… కానే కాదది ఓ సఖియా
నిజమై నిలిచే నా ఎదుటన ఈ వేళ
కొత్త ఎఫ్ఎంలో సంగీతమే నా గుండెల్లో
లవ్ బర్డల్లే తేలానులే ఆకాశంలో
రివ్వున రివ్వున రాకెట్లా… రింగులు తిరిగే రెయిన్బో లా
మనసే మెరుపుల బాస్కెట్ లా… మిణుకుల్లో మునిగేలా
రంగుల రంగుల చిత్రంలా… చుట్టూ లోకం మారేలా
ప్రేమను జల్లి నిలువెల్లా… కురిసావే వెన్నెల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్… నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్… అని లోకం చూసేలా
ఇన్ని నాళ్ళ నా ఎడారిలో
పూలతోట అడుగుపెట్టేరో
మండుటెండ బుల్లి బుగ్గపై
మంచుముక్క ముద్దు పెట్టేరో
నీతో ఉన్న కొత్త నన్నునీ
కాదు అన్న కన్ను చూసెరో
ఆ కళ్ళల్లో నేనంటే అసూయలే పొంగిపోయెరో
పట్టుతీగ పట్టి లాగెరో
చుట్టుకున్న ముళ్ళు తెంచెరో
నేనేనాడు ఊహించలేనంతలా
ప్రేమ పొంగెరో
టన్నుల టన్నులు వెన్నెలలే… గుప్పెడు గుండెను కప్పేలా
నిన్నల మొన్నల నీడలలో… హరివిల్లే గుప్పేలా
భూమిని ఎత్తుకు బొంతల్లే… హత్తుకు తిరిగా బాలుడిలా
పోలిక దొరకని ప్రేమికుడై… నిలిచానే నీ వల్ల
యూ ఆర్ మై లవ్ మై లవ్… నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్… అని లోకం చూసేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్… మబ్బుల్లో ఎగిరేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్… ఈ మ్యాజిక్ నీ వల్ల
యూ ఆర్ మై లవ్ మై లవ్… నువ్వే నా పిల్లా
యూ ఆర్ మై లవ్ మై లవ్… అని లోకం చూసేలా
యూ ఆర్ మై లవ్ మై లవ్… మబ్బుల్లో ఎగిరేలా
యూ ఆర్ మై లవ్ లవ్ లవ్… ఈ మ్యాజిక్ నీ వల్ల