అసలే కరువు, అందులో అధిక మాసం – Why Do We Have Leap Years?
భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ మాస వివరాలున్నాయి. హిందూ కేలండర్ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా పురుషోత్తమ మాసం వస్తుంది.
కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా అందరూ వాడే మాటలు “అసలే కరువు, అందులో అధిక మాసం” అని. సాధారణంగా సంవత్సరానికి 12 మాసాలే కానీ ఈ అధిక మాసం ఏమిటని అంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.
ఓసారి భగవాన్ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారాయణుడు అధిక మాసాన్ని సృష్టించాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటం లేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట.
సౌరమానం & చంద్రమానం: తెలుగువారు చాంద్రమానం ప్రకారం పండుగలను జరుపు కుంటారు. చాంద్రమానం అంటే శుక్లపక్ష పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ఒక చాంద్ర మాసం అవుతుంది. సౌరమాన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు, ప్రతిమాసం ఒక్కొక్క రాశియందు సంచరిస్తూ పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో సంచరించడం వలన ఒక సంవత్సర కాలం పూర్తి అవుతుంది.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 365.2622 రోజులు. సౌరమానం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తుంటాయి. అంటే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది ఆయన సంక్రాంతి అవుతుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అవుతుంది.
ఒక అమావాస్య నుండి తిరిగి అమావాస్య ఏర్పడుటకు 29.53 రోజులు పట్టును. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు. సౌరమానానికి సంవత్సరానికి 365.24 రోజులు. ఈ రెండు మాసాల మధ్య గల వ్యత్యాసాన్ని భర్తీ చేయుటకు భారతీయ కాల గణనలో ప్రతిరెండున్నర సంవత్స రాల తర్వాత ఒక అధిక మాసముగా ఏర్పాటు చేశారు. అంటే రెండు అమావాస్యల మధ్య ఎప్పుడయితే సంక్రమణం ఉండదో అదే అధిక మాసం ఇది సుమారు 32 మాసాల పదహారు రోజులకు ఒకసారి వస్తుంది.
పంచమే పంచమే వర్షే ద్వౌమాసే ఉదజాయత: అని శాస్త్రవచనం, అనగా ప్రతి ఐదు సంవత్సర ములలో రెండు అధిక మాసములు వచ్చునని అర్థం.
సూర్య సంక్రమణం లేని చాంద్రమాసమునే అధిక మాసంగా పరిగణిస్తున్నాం. ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది.
సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు
తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయ వ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుష్ఫలితాలుండవు.
అధిక మాసంలో చేసిన జప, దానాదులకు అధిక ఫలం వస్తుందని శాస్త్రవచనం పురుషోత్తమ మాసంలో చేసే పురాణ పారాయణ మునకు, శ్రవణమునకు,
విష్ణుపూజకు అధిక ఫలం లభిస్తుంది. ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు.
What is a leap year?
Answer: A leap year is a year that has 366 days instead of the usual 365. This extra day is added to keep our calendar year synchronized with the astronomical or seasonal year. The additional day is added to February, making it 29 days long instead of 28.
How often does a leap year occur?
Answer: A leap year occurs every four years. However, there’s an additional rule: if the year is divisible by 100 but not by 400, it’s not a leap year. This means that some century years like 1900 are not leap years, but others like 2000 are.
Why do we have leap years?
Answer: Leap years are needed to correct the discrepancy between the calendar year and the solar year. A solar year is approximately 365.25 days, so by adding an extra day every four years, we align the calendar with the Earth’s revolutions around the Sun.
When is the next leap year?
Answer: The next leap year is 2028. The most recent leap year was 2024, and the cycle continues every four years.
What is a leap day?
Answer: Leap day is February 29th, the extra day added to the calendar in a leap year. It helps align the calendar year with the solar year, which has a slightly different length.
చిక్కు ప్రశ్న – విప్పండి
ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న
దేహమే దేవాలయం
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.