Menu Close

ఆషాఢ మాసం కొత్త జంట కలిసి ఉండకూడదు అని చెబుతారు.. ఎందుకో తెలుసా..?

కొత్త గా పెళ్లి అయిన జంటలను ఆషాఢ మాసం కలిసి ఉండకూడదు అని చెబుతూ ఉంటారు. కొందరైతే.. ఆ సమయం లో దంపతులు కలిసి ఉండడం వలన సత్సంతానం కలగదు అని చెబుతూ ఉంటారు.

కొందరేమో.. అత్తా కోడళ్ళు, అత్తా అల్లుళ్ళు ఒకే గడప దాటకూడదు అని అనుకుని భార్య భర్తలు వేరే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ ఉంటారు. అసలు ఈ ఆచారం ఉద్దేశ్యం ఏంటంటే భార్య, భర్తలు ఒక ఇంట్లో ఉండకూడదు అని.

ఇందులో చాలా వరకు అవాస్తవాలు ఉన్నాయి. అసలు వాస్తవం ఏంటో ఈరోజు తెలుసుకుందాం.

నిజానికి ఆషాఢమాసం అంటే తొలకరి జల్లులు కురిసే మాసం. ఆ రోజుల్లో అన్ని వ్యవసాయం పై ఆధారపడే కుటుంబాలు ఉండేవి కాబట్టి ఈ మాసం లో అందరు పొలం పనుల్లో బిజీ గా ఉండేవారు.

కొత్త గా పెళ్లి చేసుకుని వచ్చిన యువకుడు ఈ కాలం లో పొలం పని చేయడం కంటే ఇంట్లో ఉండడానికి ఆసక్తి చూపిస్తాడు. అందుకే.. భార్య భర్తల మధ్య ఈ సమయం లో ఎడబాటు ఉండాలన్నారు.

అత్తా కోడలు ఒక ఇంట్లో ఉండకూడదు అన్నారు కదా అని.. అల్లుడు వెళ్లి అత్తగారింట్లో కూడా ఉండకూడదు అని చెప్పేవారు. ఎందుకంటే వారికి కూడా పొలం పనులు ఉంటాయి కాబట్టి.

మరొక కారణం ఏంటంటే.. ఆషాఢ మాసం లో శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర లో ఉంటారు. ఈ సమయం లో కలిసే జంటలకు స్వామీ వారి ఆశీస్సులు అందవు. అందుకే ఆషాఢమాసం లో దంపతులు కలవకూడదనే ఉద్దేశ్యం తో ఈ నియమం పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే..

ఈ ఆచారానికి ఓ శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. ఆషాడ మాసం లో దంపతులు కలిస్తే.. పురుడు వచ్చే సమయానికి వేసవి కాలం వస్తుంది.

మండుటెండల్లో.. ఆసుపత్రులు అంత గా లేని ఆరోజుల్లో.. అది ప్రాణాంతకం గా భావించేవారు. అందుకే, ఆషాఢమాసం, ఆ తరువాత శ్రావణమాసం నోములు అని చెప్పి..

ఆ రెండు నెలలు ఆడపిల్లలను పుట్టింట్లోనే ఉంచే వారు. ఇన్ని రకాలుగా ఆలోచించే ఈ నియమాన్ని తీసుకువచ్చారు. అందుకే పెద్దలు ఏమి చెప్పినా అది మన మంచికే అని అర్ధం చేసుకోవాలి.

Like and Share
+1
2
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading