ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Who Wrote Pledge? ప్రతిజ్ఞ రాసింది మన తెలుగు వాడు అని ఎంత మందికి తెలుసు? Paidimarri Venkata Subbarao – పైడిమర్రి వెంకటసుబ్బారావు
Who Wrote Pledge? Pydimarri Venkata Subba Rao.
జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్
వందేమాతరం రాసింది బంకించంద్ర ఛటర్జీ
ఈ విషయం ప్రతి భారతీయుడు కి తెలుసు
కానీ రోజు పోదున్నే స్కూల్ లో
“భారత దేశం నా మాతృభూమి
భారతీయులు అందరు నా సహోదరులు”
రాసింది మాత్రం చెప్పమంటే ఎవరు చెప్పలేరు
స్కూల్ టెక్స్ట్ బుక్ మొదటి పేజీ లో నే ప్రతిజ్ఞ ఉంటుంది
కానీ దాని రాసిన రచయిత పేరు మాత్రం కనిపించదు
తెలుసుకుందాం అంటే వివరాలు ఉండవు అందుకే
దానిని రాసిన వ్యక్తి ఎవరో ఇప్పటికి చాల మంది కి తెలియదు
ఈ గేయ్యని రాసిన వ్యక్తి తెలంగాణా బిడ్డే పైడిమర్రి వెంకటసుబ్బారావు గారు ..
ఇతను నల్గొండ జిల్లా అన్నెపర్తి లో జన్మించారు.
ఇతర రచనలు:
పైడిమర్రి వెంకటసుబ్బారావు తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు.
‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు.
‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి.
‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి.
1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు.
పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా..
ఆయన పేరు ఎక్కడా ప్రచురించకపోవడం గమనార్హం.
పొరుగు రాష్ట్రాల వారు గుర్తించకపోయినా…
ఇప్పుడు స్వరాష్ట్రంలో తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక పునర్నిర్మాణ దిశగా జరుగుతున్న
ప్రపంచ తెలుగు మహాసభల్లోనైనా పైడిమర్రిని స్మరించుకోకపోవడం శోచనీయం.
ఆ ప్రముఖ రచయితను విస్మరించడం బాధాకరమంటున్నారు పలువురు సాహితీకారులు.