Menu Close

Vishal – వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో హీరో విశాల్‌ – వీడియో వైరల్?

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

తమిళ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో విశాల్ ఊహించని లుక్‏లో కనిపించడంతో అభిమానులు షాకయ్యారు. పూర్తిగా బక్కగా మారిపోయి వణుకుతూ కనిపించారు. అలాగే మాట సైతం స్పష్టంగా మాట్లాడలేకపోయారు.

కనీసం నిలబడేందుకు కూడా విశాల్ ఇబ్బంది పడడం చూసి ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని ఆయన టీమ్ చెప్పినప్పటికీ కొందరు ఆయన ఆరోగ్యంపై వాకబు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ విశాల్ ఆరోగ్యం గురించి రోజుకో వీడియో షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విశాల్ ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు.

ఖుష్బూ మాట్లాడుతూ.. “విశాల్‏కు ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చింది. కానీ మదగజరాజు సినిమా దాదాపు 11 ఏళ్ల తర్వాత విడుదలవుతుందని తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఆ మూవీ వేడుకకు వచ్చారు. ఆరోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత అడియన్స్ ముందుకు వస్తుందని.. అందుకే తాను కచ్చితంగా రావాలనుకున్నానని చెప్పారు.

ఆ వేడుక రోజున విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉంది. అందుకే ఆయన వణికిపోయారు. ఆ ఈవెంట్ పూర్తికాగానే మేం విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. విశాల్ ఆరోగ్యం గురించి ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదు” అని అన్నారు. అలాగే విశాల్ ఆరోగ్యం గురించి కొంతమంది యూట్యూబర్స్ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎలాంటి నిజాలు తెలుసుకోకుండానే తేలికగా రూమర్స్ రాసేస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

విశాల్ హీరోగా నటించిన మదగజరాజు సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ . సి దర్శకత్వం వహించారు. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించగా.. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.

వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో హీరో విశాల్‌ – వీడియో వైరల్?

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading